Bigg Boss 8 : ఆపోజిట్ టీంకు సపోర్ట్ చేసిన సొంత క్లాన్ పై నబిల్ అలక... రెచ్చగొడుతూ చిచ్చు పెడుతున్న శేఖర్, ఆదిత్య
Bigg Boss 8 News: బిగ్ బాస్ హౌస్‌లో సొంత క్లాన్ సభ్యులకే టీమ్స్ సపోర్ట్ చేయడం లేదు. నబిల్ విషయంలో ఇదే జరిగింది. క్లాన్ గెలిపించడానికి కష్టపడితే తర్వాత ఒక్కరు కూడా తనకు సపోర్ట్ చేయలేదు.
Nabeel Afridi In Bigg Boss Telugu Season 8 : ఈసారి బిగ్ బాస్ కొత్త సీజన్లో అరుచుకోవడం, సమయం సందర్భం లేకుండా గొడవ పడడం, చిన్న చిన్న విషయాలకు కూడా ఏడవడం వంటివే ఎక్కువగా కనిపిస్తున్నాయి. అంతేకాదు బిగ్ బాస్ సీజన్ 8 స్పెషల్ ఏంటంటే సొంత టీంకే వెన్నుపోటు పొడవడం, సపోర్ట్ చేయకపోవడం. గత ఎపిసోడ్ లో నిఖిల్ తన సొంత క్లాన్ సభ్యుడైన మణికంఠకు ఫుడ్ దొంగతనం చేద్దామని ఎంత బతిమాలినా అస్సలు సపోర్ట్ చేయలేదు. ఇక ఇప్పుడేమో నబీల్ విషయంలో అదే జరిగింది.
సొంత క్లాన్ నుంచి దొరకని సపోర్ట్
తాజాగా బిగ్ బాస్ ఇన్ఫినిటీ మనీని ప్రైజ్ మనీ గా గెలుచుకోండి అంటూ కంటెస్టెంట్స్ కు ఆరు టాస్కులు పెట్టారు. ఆ టాస్క్ లలో విన్ అయిన వారికి ప్రైజ్ మనీ దక్కుతుంది. అయితే అందులో భాగంగా చివరగా పెట్టిన టాస్క్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకోబోతున్నాం. సాక్స్ టాస్క్ లో నబీల్, అభయ్, నిఖిల్ చివరగా మిగిలారు. అయితే సాక్స్ ని దాచుకోకూడదు అంటూ సంచాలక్ ప్రేరణ రూల్ పెట్టింది. అంతలోనే నవీన్ టార్గెట్ చేయడంతో ఆయన తన కాలికి ఉన్న ఆ సాక్స్ ని కొన్ని సెకన్ల పాటు దాచేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా యశ్మి గౌడ నబిల్ అవుట్ అవుట్ అంటూ అరవడంతో సంచాలక్ గా ఉన్న ప్రేరణ నబిల్ అవుట్ అని అనౌన్స్ చేసింది. కానీ ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే నబిల్ ఒక్కడే తనను తాను డిఫెండ్ చేసుకున్నాడు. నువ్వు కనీసం ఫైవ్ సెకండ్స్ కూడా చూడలేదు. నేను వెంటనే అలా అని తీసేసాను అంటూ సర్ది చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఆమె ఏ మాత్రం వినకుండా అవుట్ అంటూ అరిచింది. దీంతో బిగ్ బాస్ ను న్యాయం అడిగాడు నబిల్.
సంచాలక్ దే తుది నిర్ణయం
ఈ విషయంలో పట్టరానంత కోపం వచ్చినప్పటికీ కంట్రోల్ చేసుకున్న నబిల్ "బిగ్ బాస్ మీరు చెప్పండి.. ఇది అసలు కరెక్టా?" అంటూ ప్రశ్నించాడు. వెంటనే నబిల్ టీం నుంచి సీత "వచ్చేసేయ్. బిగ్ బాస్ ఏమీ చెప్పరు నబిల్" అంటూ అతన్ని బయటకు పిలిచింది. పైగా అతని టీం సభ్యులు ఎవ్వరూ అతనికి సపోర్ట్ చేయలేదు. దీంతో సీరియస్ గా హౌస్ లోకి వెళ్లి తన కోపాన్ని వెళ్ళగక్కాడు. నెక్స్ట్ టైం తాను సంచాలక్ అయినప్పుడు చెప్తాను అంటూ పటపటా పళ్ళు కొరుక్కున్నాడు. అయితే ఒక్కరు కూడా నబిల్ దగ్గరకు వచ్చి ఈ విషయం గురించి మాట్లాడే ప్రయత్నం చేయలేదు ఒక ఆదిత్య తప్ప. అలాగే శేఖర్ మాస్టర్ తో ఆదిత్య కూడా కలిసి మెల్లగా నబిల్ కి ఎవ్వరూ సపోర్ట్ చేయలేదు అని ఎక్కించడం మొదలుపెట్టారు. మరోవైపు నబిల్ క్లాన్ సభ్యులైన నైనిక, విష్ణుప్రియ, సీత ఏడుస్తూ కూర్చున్నా ఆపోజిట్ టీం సభ్యురాలైన ప్రేరణ దగ్గరికి వెళ్లి కన్నీళ్లు తుడవడంలో బిజీ అయిపోయారు. అసలు వీళ్ళ టాస్క్ ఏంటి? ఎవరికి ఎవరు సపోర్ట్ చేయాలి? అని అవగాహన కొంచమైనా ఉందా అనిపించేలా చేస్తున్నారు.
Also Read: నా లవ్ బ్రేకప్ కు కారణం ఆవిడే... బిగ్ బాస్ యాష్మీ గౌడ షాకింగ్ కామెంట్స్