అన్వేషించండి

Kamal Haasan: ‘బిగ్ బాస్’కు కమల్ బై.. బై.. కారణం ఇదేనట, మరి నెక్ట్స్ ఎవరు?

గత ఏడు సంవత్సరాలుగా తమిళ బిగ్ బాస్ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న కమల్ హాసన్.. ఈసారి చేయడం లేదని చెప్పారు. సినిమా కమిట్మెంట్స్ కారణంగా ఈ సీజన్ నుంచి తప్పుకుంటున్నట్లు వెల్లడించారు.

Kamal Hassan Will Not Host Bigg Boss Tamil Seaon 8: బిగ్ బాస్ రియాలిటీ షో గురించి పెద్దగా పరిచయం అవసరం లేదు. దేశ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ రియాలిటీ షో కొనసాగుతోంది. భాష ఏదైనా ఈ షోకు మాంచి క్రేజ్ ఉంటుంది. ఏటా ఈ షోపై వివాదాలు చెలరేగినా, ప్రేక్షకుల నుంచి ఆదరణ ఏమాత్రం తగ్గడం లేదు. మరికొద్ది రోజుల్లో తెలుగు, తమిళ భాషల్లో 8వ సీజన్ బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో తమిళ బిగ్ బాస్ హోస్ట్ కమల్ హాసన్ షాకింగ్ న్యూస్ చెప్పారు. ఇప్పటి వరకు ఏడు సీజన్లు అద్భుతంగా నడిపించిన ఆయన, ఈసారి ఆ షో చేయడం లేదని వెల్లడించారు. అధికారికంగా ఈ విషయాన్ని వెల్లడిస్తూ ఆయన సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు.

సినిమాల కమిట్మెంట్స్ కారణంగానే తప్పుకుంటున్నా-కమల్ హాసన్

ఏడు సంవత్సరాలుగా బిగ్ బాస్ తో కొనసాగుతున్న తన ప్రయాణం ఈ ఏడాది కొనసాగించలేకపోతున్నట్లు కమల్ హాసన్ తెలిపారు. “ఏడు సంవత్సరాల కిందట మొదలైన మా ప్రయాణంలో చిన్న బ్రేక్. సినిమా కమిట్మెంట్స్ కారణంగా రాబోయే బిగ్ బాస్ షోకు హోస్టుగా చేయడం లేదు. ఈ విషయాన్ని మీతో పంచుకునేందుకు చాలా బాధగా ఉంది. ఈ షో ద్వారా ప్రతి ఇంటికి చేరుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. మీరు నా మీద ఎంతో ప్రేమ చూపించారు. బిగ్ బాస్ తమిళ షోను బెస్ట్ షోగా నిలిపారు. ఈ షో హోస్టుగా ఎన్నో కొత్త విషయాలను నేర్చుకున్నాను. ఈ షోలో భాగం అయిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్” అని చెప్పుకొచ్చారు.

 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Kamal Haasan (@ikamalhaasan)

తమిళ షో కొత్త హోస్టు ఎవరు?

తమిళ బిగ్ బాస్ హోస్టుగా ఈసారి తాను చేయడం లేదని కమల్ చెప్పడంతో.. కొత్త హోస్టు ఎవరు? అనే విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఏ హీరో ఈ షోకు హోస్టుగా ఉంటే బాగుంటుంది? అని సోషల్ మీడియాలో చర్చిస్తున్నారు. త్వరలోనే ఈ షో కొత్త హోస్టు ఎవరు అనే విషయాన్ని విజయ్ టీవీ అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది. ఇక తెలుగులో మాత్రం రాబోయే షోకు నాగార్జున్ హోస్టుగా వ్యవహరించనున్నారు. ఇప్పటికే ఈ షోకు సంబంధించి స్టార్ మా కీలక అప్ డేట్స్ ఇచ్చింది. ఈ షోకు సంబంధించి ప్రోమోను కూడా రన్ చేస్తోంది.

వరుస సినిమాలతో కమల్ బిజీ

కమల్ హాసన్ రీసెంట్ గా ‘కల్కి 2898 AD’లో కనిపించారు. కాంప్లెక్స్ చీఫ్ యాస్కిన్ అనే నెగెటివ్ పాత్రలో కనిపించారు. ప్రస్తుతం ‘కల్కి 2898 AD’ తర్వాత భాగంలో నటిస్తున్నారు. అటు ‘ఇండియన్ 3’లోనూ నటిస్తున్నారు. మరోవైపు ‘థగ్ లైఫ్’ అనే మూవీ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించి విడుదలైన ఫస్ట్ లుక్ ప్రేక్షకులను ఓ రేంజిలో ఆకట్టుకుంది. మణిరత్నం దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియన్ మూవీ కోసం ప్రేక్షకుల ఎంతగానో ఎదురుచూస్తున్నారు.

Also Read: పవన్‌ కళ్యాణ్‌-రవితేజతో మల్టీస్టారర్‌ - క్రేజీ అప్‌డేట్‌ ఇచ్చిన హరీశ్‌ శంకర్‌

టాప్ హెడ్ లైన్స్

Patas Hari: పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
పంచ్ పంచ్‌లో కామెడీ.. పటాస్ హరి రియల్ లైఫ్ విషయాలు.. బిగ్ బాస్ ఎంట్రీపై ఊహాగానాలు!
Bigg Boss 10 Telugu: 'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
'బిగ్ బాస్ 10'లోకి ఫిమేల్ లిరిసిస్ట్... గ్లామర్ లేడీ కాదు, కంటెంట్ ఉన్న అమ్మాయి
Shiva Kumar: బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
బిగ్ బాస్ 10 ప్రాబబుల్స్ లిస్ట్‌లో శివకుమార్?.. ప్రియాంక జైన్ లవర్ రియల్ లైఫ్ విషయాలు
Kalyan: 'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు
'మ్యాడ్ ఫర్ ఈచ్ అదర్' విన్నర్.. బిగ్ బాస్ 10 వైపు అడుగులు.. కళ్యాణ్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు

వీడియోలు

Ajinkya Rahane Reveals MS Dhoni's Secret | ధోనీ రూమ్ సీక్రెట్ రూల్ బయటపెట్టిన రహానే
Women's Asia Cup 2026 Schedule | ఉమెన్స్ ఆసియా కప్ 2026 షెడ్యూల్ విడుదల
Dhoni Riding KTM in Chennai | చెన్నై రేసింగ్ ట్రాక్‌పై ధోనీ బైక్ స్టంట్
Kalyan in Bigg Boss 10 Agnipareeksha Probables List | బిగ్ బాస్ 10 ప్రొబబుల్స్‌లో కళ్యాణ్
Gundenininda Gudigantalu Serial August 7 | రోహిణి అని లేడీ కానిస్టేబుల్‌తో మనోజ్ గొడవ

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Mancherial News: ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
ఛీ.. మీ ముఖాలు చూడ‌టం ఇష్టం లేదు... కింద కూర్చోండి! అంగన్వాడీ టీచర్లపై సర్పంచ్ అమానుషం
Anakapalle Latest News:
"అనకాపల్లిలోని కళ్యాణపులోవ రిజర్వాయర్‌ను నో మైనింగ్ జోన్‌గా ప్రకటించాలి" రైతులు, గిరిజనుల జల దీక్ష !
Double Lung Transplant : 47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
47 ఏళ్ల వ్యక్తికి డబుల్ లంగ్ ట్రాన్స్‌ప్లాంట్.. రెండు సంవత్సరాలుగా ఆక్సిజన్‌పై ఉన్న రోగికి కొత్త జీవితం
World Wonders: ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
ప్రపంచ వింతలు అంటే ఏమిటి? 7 మాత్రమే ఎందుకున్నాయి, 8వ వింత ఏర్పడదా?
Divorce After Marriage : పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
పెళ్లయిన ఎన్ని సంవత్సరాల తర్వాత విడాకులు ఎక్కువగా జరుగుతున్నాయో తెలుసా?కారణాలు ఇవే
Vijay Divorce Case: తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
తమిళనాడు సీఎం విజయ్ విడాకుల కేసులో కీలక మలుపు- పిటిషన్ వెనక్కి తీసుకున్న సంగీత!
Nethanna Seva Lo: జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
జాతీయ చేనేత దినోత్సవం నాడు నేతన్న సేవలో పథకం ప్రారంభం! 71వేల కుటుంబాలకు ఆర్థిక ఊతం!
Hyderabad Crime News: వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
వినాయకుడి ప్రసాదమే పెట్టుబడిగా వ్యాపారం చేసిన గణేష్‌! 51 లక్షలకు లడ్డూ కొని 3.45కోట్లతో పరార్‌!
Embed widget