నిద్ర పట్టడం లేదు సార్, ముద్దు పెడుతుంటే: ‘జబర్దస్త్’ ఫైమా
‘బిగ్ బాస్’ స్టేజ్ మీద ఫైమాకు ముద్దుపెట్టబోయారు నాగార్జున. ఈ సందర్భంగా ఫైమా ఫన్నీగా స్పందించింది. ఆమె మాటలకు అంతా పగలబడి నవ్వేశారు.
‘బిగ్ బాస్’ సీజన్-6 ఫినాలేలో ఓ ఆసక్తికర ఘటన చోటుచేసుకుంది. టాప్-5లో ఉన్న ఆదిరెడ్డితో మాట్లాడుతూ.. ‘‘నువ్వు కాకుండా 21 మంది కంటెస్టెంట్లలో గొప్ప డ్యాన్సర్ ఎవరని అడిగారు. ఇందుకు ఆదిరెడ్డి.. ఫైమా పేరు చెప్పాడు. దీంతో ఫైమా స్టేజ్ మీదకు వచ్చింది. ఆమె చేయి పట్టుకున్న నాగార్జున ముద్దు పెట్టేందుకు ప్రయత్నించారు. దీంతో ఫైమా సిగ్గుపడుతూ, మెలికిలి తిరుగుతూ.. చేతిని వెనక్కి లాగుకుంది. ‘‘నిద్ర పట్టడం లేదు సార్, మీరు ముద్దు పెడుతుంటే..’’ అనడంతో నాగార్జునతో పాటు అంతా నవ్వేశారు. అయితే, ఇదే సీన్.. ‘బీబీ జోడీ’లో కూడా జరిగినట్లు తెలుస్తోంది. ‘బిగ్ బాస్’ స్టేజ్ మీద రిలీజ్ చేసిన ‘బీబీ జోడీ’ గ్లింప్స్‌లో కూడా ఫైమా చేతిపై నాగ్ ముద్దుపెట్టబోతుంటే.. ఆమె తన చేతిని వెనక్కి లాక్కుంది.
కడపటి వార్తలు అందేసరికి ఆదిరెడ్డి ఇంటి నుంచి ఎలిమినేట్ అయ్యాడు. ఆ తర్వాత రవితేజ సిల్వర్ సూట్‌కేస్‌తో బిగ్ బాస్ ఇంట్లోకి వెళ్లి.. కంటెస్టెంట్లను టెంప్ట్ చేశారు. అయితే, ఎవరూ డబ్బులు తీసుకోడానికి సిద్ధం కాలేదు. చివరికి.. కీర్తికి రెడ్ సూట్ కేస్ ఇచ్చి ఎలిమినేట్ చేశారు రవితేజ. ప్రస్తుతం.. శ్రీహాన్, రేవంత్ మాత్రమే ఇంట్లో ఉన్నారు. వీరిలో రేవంత్ విన్నర్, శ్రీహన్ రన్నరప్ అని తెలుస్తోంది.
కన్నీళ్లు పెట్టుకున్న కంటెస్టెంట్స్
బిగ్ బాస్ ఫినాలే సందర్భంగా హౌస్ జర్నీని వేశారు నాగార్జున. అది చూసి అందరూ ఎమోషన్ అయ్యారు.కొందరికి కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ కన్నీరు చెంపల మీద నుంచి జారినా వారు కంట్రోల్ లో ఉన్నారు. కానీ గీతూ మాత్రం వెక్కి వెక్కి ఏడ్వడం మొదలుపెట్టింది. ఆమెను ఫైమా ఓదార్చసాగింది. అంతేకాదు టాప్ 5 కంటెస్టెంట్లతో నాగార్జున మాట్లాడుతున్నంత సేపు ముఖం మాడ్చుకునే ఉంటుంది గీతూ. మిగతా అందరూ ఎలిమినేట్ వాళ్లే. కానీ వారు చాలా సాధారణంగా ప్రవర్తించారు. ఈమె మాత్రం తానే విన్నర్ అవ్వాల్సింది,మిస్ అయిపోయినట్టు తెగ ఫీలైపోతుంది. తన ప్రవర్తనలోనే లోపం ఉందని ఆమె ఇప్పటికీ తెలుసుకోలేకపోతుంది. ‘బిగ్ బాస్’ సీజన్-6 ఈ ఏడాది సెప్టెంబరు 4న మొదలైంది. మొత్తం 21 మంది కంటెస్టెంట్లు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు. చివరికి టాప్-5లో కీర్తి భట్, రేవంత్, శ్రీహాన్, రోహిత్, ఆదిరెడ్డి ఉన్నారు.
‘బిగ్ బాస్’ సీజన్-6లో పాల్గొన్న కంటెస్టెంట్లు వీరే
1. కీర్తి భట్ (‘కార్తీక దీపం’ సీరియల్ నటి)
2. సుదీప (‘నువ్వు నాకు నచ్చావ్’లో బాలనటి)
3. శ్రీహన్ (సిరి బాయ్ ఫ్రెండ్, యూట్యూబర్)
4. నేహా (యాంకర్)
5. శ్రీ సత్య (మోడల్)
6. అర్జున్ కళ్యాణ్ (సీరియల్ నటుడు)
7. చలాకీ చంటి (‘జబర్దస్త’ కమెడియన్)
8. అభినయ శ్రీ (నటి, డ్యాన్సర్)
9. గీతూ (సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్)
10. బాలాదిత్య (నటుడు)
11. మరీనా (సీరియల్ నటి, రోహన్ భార్య)
12. రోహన్ (సీరియల్ నటి, మరినా భర్త)
13. వాసంతి కృష్ణన్ (సీరియల్ నటి)
14. షాని (నటుడు)
15. ఆర్జే సూర్య (ఆర్జే)
16. ఆది రెడ్డి (యూట్యూబర్)
17. ఆరోహిరావు (టీవీ యాంకర్)
18. ఫైమా (‘జబర్దస్త్’ కమెడియన్)
19. రాజశేఖర్ (నటుడు)
20. ఇనయా (నటి)
21. రేవంత్ (సింగర్)