By: ABP Desam | Updated at : 03 Sep 2023 09:59 PM (IST)
Image Credit: Rathika/Instagram
సినీ పరిశ్రమలో గుర్తింపు అనేది ఎవరికీ అంత ఈజీగా రాదు.. కొందరికి కొన్నాళ్లలోనే లక్ ద్వారా, టాలెంట్ ద్వారా గుర్తింపు అనేది లభిస్తుంది. కానీ కొందరికి మాత్రం ఎన్నేళ్లు ఎంత కష్టపడినా తగిన గుర్తింపు మాత్రం రాదు. అలాంటి వారికి బిగ్ బాస్ అనేది ఒక మంచి ప్లాట్‌ఫార్మ్‌గా మారుతుంది. ఎన్నో సినిమాలు చేసినా, షోలు చేసినా రాని గుర్తింపు.. ఒక బిగ్ బాస్ సీజన్‌తో వచ్చేస్తుంది. అలా గుర్తింపు కోసం బిగ్ బాస్‌లోకి ఎంటర్ అయినవారిలో రతిక రోజ్ ఒకరు. అసలు ఇంత అందంగా ఉంది, చూస్తే యూత్‌ను కట్టిపడేసేలా ఉంది.. ఎవరీ అమ్మాయి అని తెలుసుకోవడం కోసం అందరూ ఆసక్తి చూపిస్తున్నారు. తన గురించి చాలామంది తెలియని ఆసక్తికరమైన విషయాలు ఎన్నో ఉన్నాయి.
అప్పుడు ప్రియా.. ఇప్పుడు రతిక..
2016లో ముందుగా ఒక స్టాండప్ కామెడియన్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది రతిక. కానీ అప్పట్లో తన పేరు రతిక కాదు.. ప్రియా. ఒకప్పుడు ఈటీవీ ప్లస్‌లో వచ్చే ‘పటాస్’ అనే స్టాండప్ కామెడీ షోలో ఒక స్టాండప్ కామెడియన్‌గా ప్రేక్షకులను నవ్వించింది ప్రియా. అలా ‘పటాస్’లో తన ప్రయాణం దాదాపు ఏడాది వరకు సాగింది. ఆ తర్వాత తను ఆ షోలో కనిపించడం మానేసింది. అసలు తను ఏమైంది, ఏంటి అని ఎవరికీ తెలియదు. ఆ తర్వాత తనను తాను బెటర్ చేసుకోవడం కోసం బ్రేక్ తీసుకొని, రతికగా మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మోడల్‌గా ఫుల్ టైమ్ బిజీ అయిపోయింది. మోడల్‌గా చేస్తున్న సమయంలోనే సినిమా అవకాశాలను అందుకుంది.
తెలుగుతో పాటు తమిళంలో కూడా..
తెలుగులో ఎన్నో చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటించింది రతిక. మెల్లగా తమిళంలో నుండి కూడా తనకు అవకాశాలు రావడం మొదలయ్యాయి. ‘మారో’ అనే తమిల చిత్రంలో నటిగా తన తమిళ డెబ్యూకు సిద్ధమయ్యింది రతిక. కానీ ఇంకా ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాలేదు. ఇప్పటివరకు విడుదలయిన సినిమాలు కూడా తనకు అంతగా గుర్తింపు తీసుకురాలేదు. కానీ ఇన్‌స్టాగ్రామ్ ఇన్‌ఫ్లుయెన్సర్‌గా తను చేసే పోస్టులు మాత్రం ఫాలోవర్స్‌ను ఆకట్టుకుంటూ ఉంటాయి. రతికకు ఇన్‌స్టాగ్రామ్‌లో దాదాపుగా 133 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. అందుకే తను ఏ ఫోటో పెట్టినా వెంటనే వేలల్లో లైక్స్ వచ్చి పడతాయి.
గుర్తింపు కోసమే..
రతిక.. చివరిగా గణేష్ బెల్లంకొండ హీరోగా తెరకెక్కిన ‘నేను స్టూడెంట్ సర్’లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించింది. తను చేసిన ఇతర సినిమాల్లో పోలిస్తే.. ఈ మూవీలో తన క్యారెక్టర్‌కు ఎక్కువ స్కోప్ ఉంది. తెలంగాణ యాసలో మాట్లాడుతూ పోలీసుగా తన గ్లామర్‌తో అందరినీ ఆకట్టుకుంది రతిక. అయితే బిగ్ బాస్‌లోకి చమ్‌కీల అంగీలేసి అనే పాటకు స్టెప్పులేసుకుంటూ ఎంటర్ అయ్యింది రతిక. అసలు బిగ్ బాస్‌లోకి ఎందుకు వచ్చావు అంటూ నాగార్జున అడిగిన ప్రశ్నకు.. ఎన్నో సినిమాల్లో నటించినా గుర్తింపు రాలేదు. అందుకే గుర్తింపు కోసం బిగ్ బాస్‌ను ఎంచుకున్నాను అంటూ సమాధానం ఇచ్చింది ఈ భామ. ఇక ఈ భామ గ్లామర్‌కు అప్పుడే బిగ్ బాస్ ఫ్యాన్స్‌లోని యూత్ అంతా ఫిదా అయిపోతున్నారు.
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఎలిమినేట్ - అసలు పట్టించుకోని శివాజీ
Bigg Boss Season 7 Telugu: తేజను గుడ్డి గొర్రె అన్న కంటెస్టెంట్స్, 'నా రక్తం తాగుతాడు' అంటూ అమర్‌దీప్‌పై శోభా వ్యాఖ్యలు
Bigg Boss Season 7 Latest Promo: ‘ఎందుకు అనర్హుడిని’ అంటూ శివాజీ ప్రశ్న, శోభా శెట్టిపై నాగ్ ఫైర్
Bigg Boss Season 7 Latest Promo: బిగ్ బాస్‌లో సండే ఫన్‌డే సందడి, ఇంతలోనే నాగార్జున అదిరిపోయే ట్విస్ట్
Rathika: బిగ్ బాస్ సీజన్ 7 నుండి రతిక ఔట్, తన ఎలిమినేషన్‌కు కారణాలు ఇవే!
Pawan Kalyan: వైసీపీ పతనం మొదలైంది, వచ్చేది టీడీపీ- జనసేన ప్రభుత్వమే - పవన్ కళ్యాణ్ ధీమా
KTR Counter PM Modi: నమో అంటే నమ్మించి మోసం చేయడం! అదానీ చేతిలో బీజేపీ స్టీరింగ్- ప్రధాని వ్యాఖ్యలకు కేటీఆర్ కౌంటర్
Jyoti Yarraji: ఏషియన్ గేమ్స్‌లో తెలుగమ్మాయి సత్తా - 100 మీటర్ల హర్డిల్స్‌లో రజతం సాధించిన జ్యోతి!
Top 10 Scooters in India: కొత్త స్కూటీ కొనాలనుకుంటున్నారా? - అయితే ఈ టాప్-10 స్కూటీలపై ఓ లుక్కేయండి!
/body>