అన్వేషించండి

Bigg Boss 7 Telugu: ఉల్టా పుల్టా బిగ్ బాస్! సీజన్ 7 గురించి ఆసక్తికర విషయాలు బయటికి!

బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డిఫరెంట్‌గా ఉంటుంది అని నాగార్జున చెప్పినప్పటి నుండి ఈసారి బిగ్ బాస్ కోసం ఒకటి కాదు రెండు హౌజ్‌లు సిద్ధంకానున్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి.

దాదాపు సంవత్సరం తర్వాత మళ్లీ బిగ్ బాస్ ప్రారంభం కానుంది. బిగ్ బాస్ ఫ్యాన్స్ అంతా షోను చూడడం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సెప్టెంబర్ 3న బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లాంచ్ ఎపిసోడ్ ప్రీమియర్‌కు సర్వం సిద్ధమయ్యింది. అయితే ఇంకా ఈ సీజన్ గురించి ప్రేక్షకుల్లో ఎన్నో అనుమానాలు ఉన్నాయి. మామూలుగా మొదటి సీజన్ నుంచి బిగ్ బాస్ ప్రోమోలకు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. కానీ సీజన్ 7 ప్రోమో మాత్రం ముందు సీజన్ల కంటే చాలా భిన్నంగా ఉంది. ప్రేక్షకులు, కంటెస్టెంట్స్ ఊహకు అతీతంగా ఈ సీజన్ ఉండబోతుంది అంటూ నాగార్జున ఇచ్చిన స్టేట్‌మెంట్.. ఎన్నో రూమర్స్‌కు దారితీస్తోంది. ఇక తాజాగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 గురించి కొన్ని ఆసక్తికరమైన విషయాలు బయటికొచ్చాయి.

కంటెస్టెంట్స్ వీరే..!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 డిఫరెంట్‌గా ఉంటుంది అని నాగార్జున చెప్పినప్పటి నుంచి ఈసారి బిగ్ బాస్ కోసం ఒకటి కాదు రెండు హౌజ్‌లు సిద్ధంకానున్నాయి అంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అంతే కాకుండా ఈసారి హౌజ్‌లోకి ఎంటర్ అవ్వనున్న కంటెస్టెంట్స్ వీరే అంటూ కొందరు సెలబ్రిటీల పేర్లు కూడా బయటికి వచ్చాయి. అందులో మహేశ్, అమర్‌దీప్, ఫర్జానా, షకీలా, జబర్దస్త్ మహేశ్, కిరణ్ రాథోడ్, ఆట సందీప్, శోభా శెట్టి, విష్ణు ప్రియ, గౌతమ్ కృష్ణ, భోలే షవాలి, ప్రతీష, దామిని భట్లా పేర్లు ఎక్కువగా వినిపిస్తున్నాయి. వీరితో పాటు ఇంకా పలువురు సెలబ్రిటీల పేర్లు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ అసలు ఇందులో ఎంతమంది నిజంగా బిగ్ బాస్ తెలుగు సీజన్ 7లో కంటెస్టెంట్స్‌గా వస్తున్నారో తెలియాలంటే లాంచ్ ఎపిసోడ్ రిలీజ్ అయ్యేంత వరకు వేచిచూడాల్సిందే.

టైమింగ్స్ ఇవే..
ఇప్పటికే బిగ్ బాస్‌కు కేవలం ఒకటే హౌజ్ ఉన్నప్పుడే ఎంజాయ్‌మెంట్, ఎంటర్‌టైన్మెంట్ మామూలుగా ఉండేది కాదు.. ఇప్పుడు ఏకంగా రెండు హౌజ్‌లు అంటే ఇంక ఎంటర్‌టైన్మెంట్ ఏ రేంజ్‌లో ఉంటుందో అని బిగ్ బాస్ ఫ్యాన్స్ అప్పుడే అంచనాలు పెంచేసుకోవడం మొదలుపెట్టారు. ఈ రెండు ఇళ్లుల మధ్య కంటెస్టెంట్స్ మారుతూ ఉంటారని సమాచారం. ఈ వార్తలు వింటుంటేనే అసలు ఈ సీజన్ అంతా ఎంత డిఫరెంట్‌గా ఉంటుందో అర్థమయిపోతోంది. ఇక ప్రసార సమయాల విషయానికొస్తే.. బిగ్ బాస్ తెలుగు సీజన్ 7.. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9.30 నిమిషాలకు స్టార్ మాలో ప్రసారం అవుతుంది. ఇక శనివారం, ఆదివారం మాత్రం రాత్రి 9 గంటలకే దీని ప్రసారం ప్రారంభమవుతుంది. అంతే కాకుండా స్టార్ మాలో రాని కొంచెం ఎక్స్‌ట్రా కంటెంట్‌తో స్టార్ మా మ్యూజిక్‌లో బిగ్ బాస్ బజ్ అనే పేరుతో ఎపిసోడ్స్ ప్రసారం అవుతాయి.

ఉల్టా పుల్టా థీమ్..
బిగ్ బాస్ సీజన్ 7 థీమ్.. ఉల్టా పుల్టా. అంటే కంటెస్టెంట్స్ ఊహించినట్టు కానీ, ప్రేక్షకులు ఊహించినట్టు కానీ.. ఈ సీజన్ అసలు ఉండదు అని అర్థం. ముందు సీజన్స్ చూసి కంటెస్టెంట్స్ ప్రిపేర్ అయ్యి వచ్చినా కూడా వారి ఊహకు అందని ఎన్నో ట్విస్టులు బిగ్ బాస్ సీజన్ 7లో ఉండబోతున్నాయట. ఇంతకు ముందు సీజన్స్‌తో పోలిస్తే ఈసారి వచ్చే కంటెస్టెంట్స్ ఎక్కువగా ప్రేక్షకులకు తెలిసిన వారు అవ్వడంతో వారిలో కూడా ఎక్కువగా ఆసక్తి కనిపిస్తోంది. ఇప్పటికే బిగ్ బాస్ సీజన్ 7 గ్రాండ్ లాంచ్ ఎపిసోడ్ ప్రోమో విడుదలయ్యి.. అసలు కంటెస్టెంట్స్ మొహాలు కనిపించకుండా ప్రేక్షకుల హైప్‌ను మరింత పెంచేసింది. రాత్రి 7 గంటలకు ఈ ఎపిసోడ్ ప్రసారం కానుంది.

Also Read: విజయ్ వర్మ మధ్య మనస్పర్థలు? వైరల్ అవుతోన్న తమన్నా కామెంట్స్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2: 'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
'బిగ్ బాస్'లో మోసం... రికమండేషన్ బ్యాచ్‌కు గ్రీన్ కార్డు... అగ్నిపరీక్షలో అసలేం జరుగుతోంది?
Rajkumari Dayana: సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
సోషల్ మీడియా నెగెటివిటీని ఎదిరించి బిగ్ బాస్ వరకు.. రాజకుమారి దయానా రియల్ లైఫ్ ఆసక్తికర విషయాలు
Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్

వీడియోలు

Vijayasai Reddy Announces New Political Party | విజయసాయి రెడ్డి కొత్త రాజకీయ పార్టీ
Gundenininda Gudigantalu Serial August 19 | ప్రభావతి, రోహిణిలకు ఊహించని షాక్
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Anganwadi Leader Dalavai Ramadevi TDP MLC | ఎమ్మెల్సీగా అంగన్ వాడి టీచర్ దళవాయి రమాదేవి
India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Folk Singer Eshwar Sai Controversy:వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
వేములవాడలో వివాదం! మరో మహిళతో భార్యకు దొరికిపోయిన బాసింగ బలాలు ఫేమ్‌ ఈశ్వర్‌!
AP Legislative Council : ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
ఆంధ్రప్రదేశ్‌ మండలి డిప్యూటీ ఛైర్మన్‌గా మాధవరావు ఎన్నిక ఏకగ్రీవం! సభ నుంచి అధికార పక్షం వాకౌట్‌!
Nalgonda crime news:నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
నల్గొండ స్కూల్ ప్రిన్సిపాల్ రూపారెడ్డిని హత్య చేసింది పదో తరగతి విద్యార్థులే! ఆ ఫొటోల కోసమే ఈ దురాగతం!
Adilabad Spiny Gourd:ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
ఆదిలాబాద్ జిల్లాలో బోడకాకరకి భలే గిరాకీ! ఈ సీజన్‌లో అందరి నోట వినిపించే వంటకం ఇదే!
Kakinada AE Nookaraju Family Suicide Case: కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
కాకినాడ ఏఈ కుటుంబం ఆత్మహత్య కేసులో కీలక మలుపు!వెలుగులోకి సౌజన్య లేఖలు! షూటింగ్ కోచ్‌ ఖాన్‌పై హత్య కేసు నమోదు!
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Pithapuram AE Family Suicide Case | కాకినాడ షేక్ సాధిక్ ఖాన్ వికృత రూపం - షూటింగ్ కోచ్ ముసుగులో కామాంధుడి దౌర్జన్యాలు
Tamil Nadu CM Vijay: చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
చంద్రబాబును మించిపోయిన విజయ్‌! మూడో బిడ్డ పుడితే ఏడాది సెలవులు! తమిళనాడు సీఎం కీలక నిర్ణయం!
Kolkata Hotel Fire Accident: కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
కోల్‌కతాలోని న్యూ మార్కెట్ హోటల్‌లో భారీ అగ్నిప్రమాదం- పిల్లలు, మహిళలు సహా 9 మంది మృతి! 
Embed widget