Bigg Boss 6 Telugu: రేవంత్‌కు వాసంతి అంటే ఇంట్రెస్ట్ - లాలీపాప్ కోసం గీతూ చెత్త గేమ్
Bigg Boss 6 Telugu: గీతూ మాట్లాడేవి వింటే ఒక్కోసారి ఈమెకు బుర్ర ఉందా, ఉన్నా పనిచేస్తోందా అనే సందేహం వస్తుంది.
Bigg Boss 6 Telugu: సన్ డే కోసం బిగ్ బాస్ ఎపిసోడ్ ప్రత్యేకంగా సిద్ధమైంది. అతిధిగా దేవిశ్రీ ప్రసాద్ వచ్చి కాసేపు పాటలతో వినోదం పంచారు. స్టేజీ పైన ఓ పాటను రిలీజ్ చేస్తున్నట్టు చెప్పారు. అలా అతను పాట పాడి వినిపించారు. ఆ పాటకు నాగార్జునతో సహా అందరూ డ్యాన్సులేశారు. తరువాత రేవంత్ చేతిలో చాక్లెట్ బాక్సు కనిపించింది. అదెలా వచ్చిందో తెలియాలంటే ఎపిసోడ్ చూడాలి.
చాక్లెట్ల కోసం ఏదైనా సీక్రెట్ చెప్పాలని అడగ్గానే ఫైమా ఇనయా క్రష్ సూర్య అని చెప్పింది. దీంతో నాగార్జున ఒక లాలీపాప్ ఫైమాను తీసుకోమని చెప్పారు. ఒక చాక్లెట్ కోసం గీతూ గలీజ్ గేమ్ మొదలైంది. రేవంత్ కు పెళ్లయిందని, ఆమె భార్య గర్భవతి అని తెలిసి కూడా ‘రేవంత్‌కు వాసంతి అంటే ఇంట్రెస్ట్ అనిపిస్తోంది సర్, మొన్న గేమ్‌లో ఫ్రీగా మసాజ్ చేయించుకున్నాడు’ అని చెప్పింది. దానికి వాసంతి అదో రకంగా ముఖం పెట్టింది. గీతూ ఇలాంటి చీప్ కామెంట్లు చేసినా నాగార్జున ఏమీ అనకపోవడం బాగోలేదు. ఫ్రీగా చేయించుకుంటే సాఫ్ట్ కార్నర్ ఎందుకు, పని చేయించుకున్నాడు అనేసి ఊరుకున్నారు నాగార్జున. ఫైమా ఇక చాల్లే రా అన్నట్టు గీతూని ‘నేనిస్తాలే సగం రా’ పిలిచేసింది. కచ్చితంగా ఈ టాపిక్‌ను రేవంత్ రేపటి నామినేషన్లో తీసే అవకాశం ఉంది.
సామెతలు
కొన్ని తెలుగు సామెతలు ఇచ్చి అవి సరిపోయే వారికి మెడలో వేయమని చెప్పారు నాగార్జున. మొదట ఫైమా ‘ఏమిరా పడ్డావ్ అంటే ఇదొక పల్టీలే అన్నాడంట’ అనే సామెతను రాజశేఖర్ మెడలో వేసింది. ఇక బాలాదిత్య ‘అన్నీ ఉన్న ఆకు అణిగిమణిగి ఉంటుంది, ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుంది’ అనే సామెత తెచ్చి రోహిత్ మెడలో వేశాడు. ఇక సూర్య ‘చింత చచ్చినా పులుపు చావదు’ అనే సామెతను రేవంత్ మెడలో వేశాడు. ఇక చంటి ‘కందకి లేని దురద కత్తికి ఎందుకు’ అనే సామెతను కీర్తి మెడలో వేశాడు. గీతూకి ఎవరిచ్చారో కానీ సరైనదే ఇచ్చారు. ఇంట్లో గొడవలు పడడంలో, పెట్టడంలో గీతూని మించిన వారు లేరు. ఆమెకు ఎవరో కానీ ‘అగ్నికి ఆజ్యం పోయడం’ అనే సామెతను వేశారు. ఇది ఇనయా ఇచ్చినట్టు అనిపిస్తోంది. ఎపిసోడ్ చూస్తే తెలుస్తుంది. ఇక రేవంత్ ‘కుక్కతోక వంకర’ అనే సామెతను అర్జున్ కళ్యాణ్ మెడలో వేశాడు. ఎందుకు ఆ సామెత వేశాడో అందరికీ తెలిసిందే.
అందరూ సేవ్ అయ్యాక చివరికి నామినేషన్లోల ఇనయా, అర్జున్, చంటి నిలబడ్డారు. వారిలో ఇద్దరినీ సేవ్ చేసి ఒకరిని ఎలిమినేట్ చేయనున్నారు. ఇప్పటికే చంటి ఎలిమినేట్ అయినట్టు వార్తలు వచ్చేసాయి.
Also read: బిగ్‌బాస్ వేదికపై మ్యూజిక్ మాంత్రికుడు దేవిశ్రీ ప్రసాద్, ఇంట్లో పాటల ఆటలు
Also read: చలాకీ చంటి షాకింగ్ నిర్ణయం, సెల్ఫ్ ఎలిమినేషన్ చేసుకుని బిగ్‌బాస్ నుంచి బయటికి వచ్చేసిన కమెడియన్?