Bigg Boss Telugu 7: ఎవిక్షన్ ఫ్రీ పాస్ పోటీ ఉల్టా పుల్టా - ఆ ఐదుగురికే అవకాశం, పాపం గౌతమ్.. ఆ చిన్న తప్పుతో!
Telugu Bigg Boss 7 : బిగ్ బాస్ సీజన్ 7లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం టాప్ 10 కంటెస్టెంట్స్ సిద్ధమయ్యారు. కానీ ఇంతలోనే బిగ్ బాస్ వారికి అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ రియాలిటీ షో చివరి దశకు వచ్చేసరికి దాదాపుగా ప్రతీ సీజన్‌లో టాప్ 10 ఎవరో నిర్ణయించుకోమని బిగ్ బాస్.. కంటెస్టెంట్స్‌కు చెప్తాడు. దీంతో ఎవరు ఏ స్థానంలో ఉన్నానని, ఉండాలని అనుకుంటారో వారు ఆ స్థానాల్లో నిలబడతారు. కానీ చాలావరకు అందరు కంటెస్టెంట్స్‌కు మొదటి స్థానమే కావాలి కాబట్టి దానికోసం వాగ్వాదాలు కూడా జరుగుతాయి. అయితే ఈసారి టాప్ 10 కంటెస్టెంట్స్‌ను నిర్ణయించుకోమనడంతో పాటు బిగ్ బాస్ మరో లింక్ పెట్టారు. అదే ఎవిక్షన్ ఫ్రీ పాస్. టాప్ 10 స్థానాల్లోని మొదటి అయిదు స్థానాల్లో ఎవరు నిలబడాలో నిర్ణయించుకున్న తర్వాత ఆ అయిదుగురు కంటెస్టెంట్స్‌కు ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం దక్కుతుందని అనుకున్నారంతా. కానీ అక్కడే బిగ్ బాస్ అసలైన ట్విస్ట్ ఇచ్చాడు.
బిగ్ బాస్ ట్విస్ట్..
టాప్ స్థానాలలో నిలబడడం కోసం కంటెస్టెంట్స్ మధ్య పెద్ద వాగ్వాదమే జరిగింది. కానీ వాగ్వాదం వల్ల లాభం లేదని అర్థం చేసుకున్న కంటెస్టెంట్స్.. నిర్ణయమంతా ప్రేక్షకుల చేతుల్లో ఉంటుందని నమ్మి తమకు ఇచ్చిన నెంబర్ దగ్గర నిలబడ్డారు. అంతా కలిసి శివాజీని టాప్ 1 స్థానంలో నిలబెట్టారు. రెండో స్థానాన్ని యావర్, మూడో స్థానాన్ని పల్లవి ప్రశాంత్, నాలుగవ స్థానాన్ని ప్రియాంక, ఐదవ స్థానాన్ని శోభా శెట్టి ఆక్రమించుకున్నారు. దీంతో వేరేదారిలేక మిగతా స్థానాలను మిగిలిన కంటెస్టెంట్స్ పంచుకున్నారు. టాప్ 6గా అమర్‌దీప్, టాప్ 7గా గౌతమ్, టాప్ 8గా అర్జున్, టాప్ 9గా అశ్విని, టాప్ 10గా రతిక నిలబడ్డారు. టాప్ 5 స్థానాల్లో నిలబడిన శివాజీ, యావర్, ప్రశాంత్, ప్రియాంక, శోభా.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీకి సిద్ధమవ్వగా బిగ్ బాస్ ఇచ్చిన క్లారిటీ వారిని ఒక్కసారిగా షాక్‌కు గురిచేసింది.
ఆ అయిదుగురి మధ్య పోటీ..
టాప్ 5 స్థానాలలో నిలబడినవారు కాకుండా టాప్ 6 నుండి 10 వరకు నిలబడిన అమర్, గౌతమ్, అర్జున్, అశ్విని, రతిక .. ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడుతున్నట్టు అనౌన్స్ చేశాడు బిగ్ బాస్. దీంతో అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. దీంతో టాప్ 5 స్థానాల్లో నిలబడిన కంటెస్టెంట్స్‌కు కనీసం ఎవిక్షన్ ఫ్రీ పాస్ కోసం పోటీపడే అవకాశం కూడా పోయింది. ఈ పాస్ కోసం కంటెస్టెంట్స్‌కు పజిల్ గేమ్‌ను ఇచ్చారు బిగ్ బాస్. ముందుగా కంటెస్టెంట్స్‌కు కొన్ని కలర్స్ పజిల్స్ ఇచ్చాడు బిగ్ బాస్. స్విమ్మింగ్ పూల్‌లో ఉన్న సంబంధిత కలర్ కీస్‌ను తీసుకుని ఆ పజిల్ కీ తెరవాలి. ఆ తర్వాత పజిల్ బాక్స్‌ను EVICTION స్పెల్లింగ్, సర్కిల్స్ క్లియర్‌గా వచ్చేలా అమర్చాలి. రతిక, అశ్వినీ తొందరగా పెట్టినా.. సరిగ్గా పూర్తి చేయలేదు. అయితే, గౌతమ్, అమర్, అర్జున్ చివరి వరకు ఉండి తప్పులేకుండా పెట్టే ప్రయత్నం చేశారు. కానీ, అమర్, గౌతమ్ చిన్న చిన్న తప్పిదాలతో ఈ టాస్క్ ఓడినట్లు తెలుస్తోంది. లైవ్‌లో ఎవరు గెలిచారనేది బిగ్ బాస్ చూపించలేదు. అయితే, హౌస్‌మేట్స్ మాటల ప్రకారం.. అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలిచాడని, దాన్ని అతడు డిఫెండ్ చేసుకోవాలని బిగ్ బాస్ చెప్పిటన్లు తెలుస్తోంది. మరి, డిఫెండ్ అంటే మరో టాస్క్ ఏమైనా ఇస్తాడా అనేది చూడాలి.
Also Read: రతికా రోజ్ చుట్టూ అమర్, యావర్ నామినేషన్స్ - కొట్టుకోడానికీ రెడీ!