అన్వేషించండి

Bigg Boss Telugu Season 7: రతిక మైండ్ గేమ్‌కు బలి పశువైన టేస్టీ తేజ - పాపం, అనవసరంగా బుక్కయ్యాడు!

‘బిగ్ బాస్’ సీజన్ 7లో రతిక పెట్టిన చిచ్చు.. ముగ్గురికి శాపమైంది. ఒకరినొకరు అపార్థం చేసుకుని హౌస్ నుంచి బయటకు పంపేందుకు నామినేట్ చేసుకున్నారు.

సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయెన్సర్, నటి రతిక పెట్టిన చిచ్చు.. టేస్టీ తేజాకు అంటుకుంది. అనవసరంగా గౌతం, ప్రిన్స్‌ల దృష్టిలో అనవసరంగా విలన్ అయ్యాడు. ఈ నేపథ్యంలో తర్వాత రాబోయే నామినేషన్స్‌లో సమస్యలు ఎదుర్కొనే అవకాశాలు కనిపిస్తున్నాయి. ‘బిగ్ బాస్’ హౌస్‌లోకి వస్తూనే రతిక ఓ సీక్రెట్ టాస్క్ ఐడియాతో పుల్లలు పెట్టే పనిలో నిమగ్నమైంది.  

ముందుగా శోభా శెట్టి దగ్గరకు వెళ్లి ఒక సీక్రెట్ టాస్క్ ఉంది చేస్తావా అని అడిగింది రతిక. దీంతో శోభా కూడా చేస్తాను.. ఏంటో చెప్పు అని పాజిటివ్‌గా రియాక్ట్ అయ్యింది. రెండు ముక్కలైన హార్ట్‌ను చూపించి.. ‘‘అమర్‌దీప్, ప్రియాంక మధ్య ఏదో ఒక గొడవ పెట్టాలి, ఫైట్ క్రియేట్ చేయాలి’’ అని చెప్పింది రతిక. ఏం చేసినా గొడవ జరగాలి అని చెప్పింది. ‘‘వాళ్లిద్దరు నిజంగా గొడవపడితే నువ్వు టాస్క్ విన్ అవుతావ్, నామినేషన్ నుంచి సేవ్ అవుతావ్, ఒకవేళ వారు గొడవ పడకపోతే నువ్వు నేరుగా నామినేషన్స్‌లోకి వెళ్తావ్’’ అని శోభాతో అంటుంది రతిక. ఇదంతా విన్న శోభాకు అనుమానం వచ్చింది. ‘‘టాస్క్ పరంగా నాకు నీ మీద నమ్మకం రావడం లేదు’’ అని మోహం మీదే చెప్పేసింది. ‘‘ఏ విధంగా చూసుకున్న బిగ్ బాస్ నీకు ఇచ్చిన సీక్రెట్ టాస్క్‌ను వేరేవాళ్లకు చెప్పకూడదు కదా.. ఒకవేళ నాకు చెప్పావ్ అని నేను చేస్తే అది నీకు మాత్రమే ప్రయోజనాన్ని ఇస్తుంది కదా’’ అని అక్కడి నుంచి వెళ్లిపోయింది శోభా. ఆ తర్వాత అమర్‌దీప్, ప్రియాంక దగ్గరకు వెళ్లి రతిక చెప్పిన విషయం అంతా చెప్పింది. ఆ తర్వాత పల్లవి ప్రశాంత్‌తో ఆ పని చేయించాలని ప్రయత్నించి విఫలమైంది.

శోభా శెట్టి, పల్లవి ప్రశాంత్‌తో సీక్రెట్ టాస్క్ చేయడం కష్టమని తెలుసుకున్న రతిక.. వెళ్లి టేస్టీ తేజకు అదే విషయాన్ని చెప్పింది. ఇద్దరి మధ్య గొడవ పెడితే.. సీక్రెట్ టాస్క్ గెలిచినట్టే, తరువాతి వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతావు అని చెప్పింది. ఎవరు ఆ ఇద్దరు అని తేజ అడగగా.. గెస్ చేయమంటుంది. గౌతమ్ కృష్ణ, యావర్ అని చెప్తే.. అవును కరక్టే అని చెప్పి వారిద్దరి మధ్య గొడవపెట్టమని ఎంకరేజ్ చేస్తుంది. దీంతో తేజ.. యావర్ దగ్గరకు వెళ్లి.. గౌతమ్ నువ్వు షోఆఫ్ చేస్తున్నావని అన్నాడని తెలిపాడు. అలాగే గౌతం దగ్గరకు వెళ్లి ప్రిన్స్ తనని అలా అంటున్నాడని చెప్పాడు. రతిక ఇదంతా సైలెంట్‌గా గమనించింది. 

యావర్‌కు, గౌతమ్ కృష్ణకు మధ్య గొడవపెట్టాలనుకున్న తేజ ప్రయత్నం.. కొంతవరకు ఫలించింది. తేజ చెప్పిన కారణంతో.. గౌతమ్‌ను ప్రిన్స్ నామినేట్ చేశాడు. బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ ఇదే విషయంపై క్లారిటీ ఇచ్చేందుకు ప్రయత్నించాడు. తాను అలా అనలేదని, తేజ కావాలనే మన ఇద్దరి మధ్య గొడవ పెట్టే ప్రయత్నం చేశాడని చెప్పాడు. ఆ తర్వాత గౌతమ్ కూడా ప్రిన్స్‌ను నామినేట్ చేసి ప్రిన్స్‌పై నామినేషన్ చేశాడు. అంతేకాదు.. అలా పుల్లలు పెట్టిన కారణంతో అమర్‌దీప్ టేస్టీ తేజాను నామినేట్ చేశాడు. రతిక వేసిన ఉచ్చులో పడ్డ తేజ వల్ల.. ప్రిన్స్, గౌతమ్‌లు అనవసరంగా నామినేట్ చేసుకున్నారనే అభిప్రాయం ప్రేక్షకుల్లో ఏర్పడే అవకాశాలున్నాయి. 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget