Bigg Boss Telugu 7: ‘బిగ్ బాస్’ హౌస్‌లో సీమంతం - చిన్న పిల్లడిలా ఏడ్చేసిన అర్జున్, గుండె బరువెక్కడం ఖాయం
Arjun Ambati: బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఫ్యామిలీకి నడుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అర్జున్ వైఫ్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్రోమో మరింత ఎమోషనల్ గా సాగింది.
బిగ్ బాస్ అంటే టాస్కులు, గొడవలు, నామినేషన్స్, ఎలిమినేషన్స్ మాత్రమే కాదు ఎమోషనల్ బాండింగ్స్ కూడా. ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ అంతా ఫుల్ ఎమోషనల్ అయ్యేది ఫ్యామిలీ వీక్ లోనే. ఎన్నో వారాలు తమ కుటుంబాలకు దూరంగా ఉండి కనీసం ఫోన్లో కూడా మాట్లాడలేని స్థితిలో ఉండే కంటెస్టెంట్స్ దగ్గరికి ఫ్యామిలీ మెంబర్స్‌ను పంపించి ఎంతో ఎమోషనల్ చేస్తారు బిగ్ బాస్. కేవలం ఫ్యామిలీ మెంబర్స్, కంటెస్టెంట్స్ మాత్రమే కాదు చూసే ఆడియన్స్ కూడా ఎంతో ఎమోషనల్ అవుతుంటారు. ఈ విషయం ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, బిగ్ బాస్ సీజన్ సెవెన్ లో ఫ్యామిలీ వీక్ రానే వచ్చింది. ఈవారం కంటెస్టెంట్ లో ఫ్యామిలీ మెంబర్స్‌ని హౌస్‌లోకి పంపిస్తున్నారు బిగ్ బాస్.
ఇప్పటికే విడుదలైన ప్రోమోలో శివాజీ కొడుకు హౌస్‌కు ఎంట్రీ ఇచ్చి అందరినీ ఎమోషనల్ చేయగా.. తాజాగా విడుదలైన ప్రోమోలో అర్జున్ భార్య హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ ప్రోమో అయితే మరింత ఎమోషనల్ గా సాగింది. ప్రోమోని పరిశీలిస్తే.. హౌస్ మేట్స్ అంతా ఆక్టివిటీ ఏరియాలో ఉండగా, అర్జున్ భార్య కిచెన్లో నుంచి వస్తుంది. అది చూసిన అర్జున్ ఆనందంతో పరిగెత్తుకుంటూ వెళ్లి భార్యని కౌగిలించుకుంటాడు. అది చూసి హౌస్ మేట్స్ ఎంతో ఆనందిస్తారు. తర్వాత వాళ్ళిద్దరూ ఏకాంతంగా మాట్లాడుకున్నారు. ఆ సమయంలో అర్జున్ ఎమోషనల్ అవుతుంటే అతని భార్య.. "మిస్ అయ్యావా నన్ను? ఎందుకు ఏడుస్తున్నావ్? అంటూ కన్నీళ్లు తుడుస్తుంది. నువ్వు ఎమోషన్స్ ని బయట పెట్టు. నువ్వు రియాక్ట్ అవ్వట్లేదు. అదే నాకున్న స్ట్రెస్" అని చెబుతూ చివరికి 'కప్ ఇంపార్టెంట్ బిగిలూ' అనే డైలాగ్ ని నవ్వుతూ చెప్పి అర్జున్ కి తన చేతితో అన్నం తినిపిస్తుంది.
ఆ తర్వాత శివాజీ.. "This Is Life, This is Only The Life" అని తోటి హౌస్ మేట్స్ తో చెప్తాడు. తన భార్య ప్రెగ్నెంట్ అవ్వడంతో అర్జున్ ఆమె యోగక్షేమాలు అడిగితే.. "బేబీ బాగా కదులుతుంది. పడుకోనివ్వటం లేదు" అని చెబుతూ అర్జునుని హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకుంటుంది. ఆపై హౌస్ మేట్స్ అందరితో అర్జున్ వైఫ్ చాలా జోవియల్ గా మాట్లాడింది. ‘‘బయట ఏం జరుగుతుంది?’’ అని ప్రియాంక అడిగితే.. "తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా.." అని అర్జున్ వైఫ్ అనడంతో అందరూ నవ్వేశారు. "మా ఆయన అంటే భయం పోయిందా?" అని అశ్వినిని అడుగుతుంది అర్జున్ వైఫ్. ఇక చివరగా హౌస్ మెంట్స్ అంతా అర్జున్ వైఫ్ కి సీమంతం చేశారు.
శోభ, రతిక, అశ్విని, ప్రియాంక కలిసి అర్జున్ వైఫ్ ని కూర్చోబెట్టి నుదుటిన బొట్టు పెట్టి, చేతులకు గాజులు తొడిగి సీమంతం వేడుక చేయగా, అది చూసిన అర్జున్ చాలా ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. హౌస్ మేట్స్ అందరూ గ్రాండ్‌గా సీమంతం వేడుక నిర్వహించి అర్జున్ వైఫ్‌కు సెండ్ ఆఫ్ ఇచ్చారు. లాస్ట్ లో వెళ్తూ వెళ్తూ అర్జున్ వైఫ్ తన భర్తని గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టి హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది. "ఇలాంటివి లైవ్ లో చూసే అదృష్టం నాకు ఇచ్చినందుకు థాంక్యూ బిగ్ బాస్" అంటూ శివాజీ చెప్పడంతో ప్రోమో ఎండ్ అవుతుంది. జస్ట్ ప్రోమోనే ఇంత ఎమోషనల్ గా ఉంటే ఫుల్ ఎపిసోడ్ ఇంకెంత ఎమోషనల్ గా ఉంటుందో చూడాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే. లేకుంటే హాట్ స్టార్ సబ్స్క్రిప్షన్ ఉన్నవారు లైవ్ స్ట్రీమ్ లో కంటిన్యూగా చూడొచ్చు.
Also Read : మెగాస్టార్ మూవీని రిజెక్ట్ చేసిప అనుష్క శెట్టి - ఆ సినిమా సీక్వెల్‌కు గ్రీన్ సిగ్నల్
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial