అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 2 Promo : బిగ్​బాస్ హౌజ్​లో రెండో రోజే యాక్షన్​ స్టార్ట్ చేసేసిన కంటెస్టెంట్లు.. నేను పశువునా? మనిషిని కానా అంటూ ఫైర్ అయిన శేఖర్ భాషా

Biggboss Monday Promo : బిగ్​బాస్​ సీజన్ 8 రెండో రోజు మొదటి ప్రోమో వచ్చేసింది. కంటెస్టెంట్లు అప్పుడే వీరలెవల్​లో సీరియస్​ అయిపోతూ.. యాక్షన్ స్టోరిని తలపిస్తున్నారు. ఈరోజు ప్రోమో ఎలా సాగిందంటే..

Bigg Boss 8 Day 2 Promo : బిగ్​బాస్​లో వీకెండ్ ఎపిసోడ్స్ కంటే సోమవారం ఎపిసోడ్స్​కే డిమాండ్ ఎక్కువ. ఎందుకంటే నెక్స్ట్ వీక్ హీట్​ అంతా మండేనే ఉంటుంది. పైగా నామినేషన్లు లొల్లి కూడా సోమవారమే ఉంటుంది. అయితే హౌజ్​లోకి అడుగుపెట్టిన మొదటివీక్​లోనే నామినేషన్లు లేకున్నా.. హౌజ్ హీట్ పెంచేస్తున్నారు బిగ్​బాస్ సీజన్ 8 కంటెస్టెంట్లు. ఆదివారం జరిగిన ఫేక్ ఎలిమినేన్ విషయంలో నాగ మణికంఠ ఫుల్ ఫైర్ అయ్యాడు. తాజాగా దానికి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. 

ఇది ఫీలింగ్స్ గురించి.. రెస్పెక్ట్ గురించి కాదు..

నాగమణికంఠ.. నిఖిల్, పృథ్వీరాజ్ గార్డెన్ దగ్గర కూర్చోని ఫేక్ ఎలిమినేషన్​ గురించి మాట్లాడుకుంటున్నారు. ఈ సమయంలో మణికంఠ.. ఆదిత్య ఓంని ఉద్దేశించి మాట్లాడాడు. నేను బయటకు వెళ్లడానికే ఆయన నాకు ఓటు వేశాడు. ఆయన మాట్లాడే విధానంలో డిఫరెన్స్ ఉంది అంటూ నిఖిల్​తో చెప్పగా.. బేసికల్​గా యూ హ్యావ్ టూ రెస్పెక్ట్ దెమ్ అంటూ ఆన్సర్ ఇచ్చాడు. దానికి నాగమణికంఠ.. ఇట్స్ నాట్ ఎబౌట్ రెస్పెక్ట్.. ఇట్స్ ఆల్ ఎబౌట్ ఫీలింగ్స్ అంటూ బదులిచ్చాడు. ప్రతీసారి ఈ టాపిక్ తీయడం తనకు నచ్చడం లేదని చెప్పాడు.

దమ్ మసాలా బిర్యానీ..

హౌజ్​లో డే 2కోసం మార్నింగ్ గుంటూరు కారం సినిమాలోని దమ్ మసాలా బిర్యానీ సాంగ్​ని బిగ్​బాస్ ప్లే చేశాడు. కంటెస్టెంట్లు అంతా ఈ సాంగ్​కు డ్యాన్స్​లు వేశారు. అనంతరం కొందరు స్మిమ్మింగ్​ పూల్​లో దిగి ఆడుకున్నారు. అనంతరం కొందరు అక్కడే ఉన్న ఆరెంజ్​లతో గేమ్స్ ఆడుకున్నారు. దీనిపై హౌజ్​లో పెద్ద రచ్చనే జరిగింది. సోనియా ఆకుల.. శేఖర్ భాషా మధ్య ఆరెంజ్​ గురించి వాగ్వాదం జరిగింది. 

ఫుడ్ గొడవ మొదలైందిగా..

ఆరెంజ్స్​తో ఎవరైతే ఆడుతున్నారో వాళ్లు ఎవరూ ఆరెంజ్స్ పట్టుకోవడానికి వీల్లేదు అంటూ సోనియా వార్నింగ్ ఇచ్చింది. బిగ్​బాస్ రూల్స్​లో దీనిగురించి ఎక్కడైనా రాశారా అంటూ శేఖర్​ బాషా కౌంటర్ ఇచ్చాడు. ఆరెంజ్స్​ని టచ్​ చేయొద్దు అన్నావంటే.. నేను తినొద్దని చెప్పానని సోనియా తెలుపగా.. శేఖర్ ఆమె ముందే ఆరెంజ్స్​ని తిన్నాడు. ఆడుకుంటున్న ఫ్రూట్స్​ని తినేవాటిలో కలపకండి.. నీట్​గా తినాలనుకున్న వారికి అది ఇబ్బందిగా ఉంటుంది.. మనుషుల్లాగా తినాలనుకునేవాళ్లు ఉన్నామంటూ గట్టి రిప్లై ఇచ్చింది. ఇప్పుడు నేను పశువునా? మనిషిని కానా? అంటూ శేఖర్ ఫైర్ అయ్యాడు. 

కొత్త టాస్క్​తో వచ్చిన బిగ్​బాస్

అనంతరం బిగ్​బాస్ న్యూ టాస్క్​తో వచ్చాడు. ఆరుగురు కంటెస్టెంట్​లు ఈ పోటీలో పాల్గొంటారని తెలిపాడు. ఈ మొదటి ఛాలెంజ్ పేరు.. పట్టుకుని ఉండండి. వీల్​ని తిప్పినప్పుడు ఏ కలర్​ రంగు మీద ఆగితే.. కంటెంస్టెంట్ ఆ రంగు తాడు మీదనే ఉండాలి. నేలకు కానీ.. పోల్స్​కి కాని టచ్​ కాకూడదంటూ బిగ్​బాస్ కండీషన్స్ పెట్టాడు. కేజ్​ని పట్టుకున్నా టాస్క్​నుంచి వెళ్లిపోవాలని సూచించాడు. దీంతో కంటెస్టెంట్లు మొదటి టాస్క్​ని ఛాలెంజింగ్​గా తీసుకుని గేమ్​ ఆడుతున్నారు. దీనితో ప్రోమో ముగిసింది.​  ​

Also Read : విష్ణుప్రియతో పాటు వాళ్లిద్దరూ... 'బిగ్ బాస్ 8'కు కిరాక్ ఖిలాడీ కనెక్షన్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

అధికారుల నిర్లక్ష్యం, ఉద్యోగాలు కోల్పోయిన ఏడుగురు టీచర్లుఆ గ్రామంలో కుల గణన సర్వే బహిష్కరణPV Sindhu Badminton Academy Visakhapatnam | పీవీ సింధు బ్యాడ్మింటన్ అకాడమీకి శంకుస్థాపన | ABP DesamCurious Case of Manuguru Boy Shiva Avatar | శివుడి అవతారం అని చెబుతున్న 18ఏళ్ల బాలుడు | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Revanth Musi: మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
మూసి కాలుష్యం వల్ల అణుబాంబు కంటే ఎక్కువ నష్టం - ప్రక్షాళనకు అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం - రేవంత్ సంకల్పం
Sanju Samson: చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
చరిత్ర సృష్టించిన సంజూ శాంసన్ - వరుసగా రెండో టీ20 సెంచరీ చేసి అరుదైన రికార్డు
Rains: బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
బంగాళాఖాతంలో అల్పపీడనం - తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్
Varra Ravider Reddy: వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
వైసీపీ సోషల్ మీడియా కార్యకర్త వర్రా రవీందర్ రెడ్డి అరెస్ట్?
Salaar 2 Update: ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
ప్రభాస్ ఫ్యాన్స్‌కు పూనకాలు - 'సలార్ 2' షూటింగ్ షురూ!
KTR: 'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
'నా అరెస్ట్ కోసం సీఎం ఉవ్విళ్లూరుతున్నారు' - వారిని అరెస్ట్ చేసే దమ్ముందా అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ సవాల్
DSPs Transfers : ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు -  సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
ఏపీలో 20మంది డీఎస్పీల బదిలీలు - సోషల్ మీడియా కీచకులపై నిర్లక్ష్యం చేస్తే ఇక అంతేనా ?
10th Exams: తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
తెలంగాణ టెన్త్ విద్యార్థులకు అలర్ట్ - పరీక్ష ఫీజుల చెల్లింపు తేదీలు ఖరారు
Embed widget