Bigg Boss 8 Telugu Wild Card Entry: ఫస్ట్ వైల్డ్ కార్డు కంటెస్టెంట్ అతడే... హింట్ ఇచ్చి మరీ టీజ్ చేస్తున్న బిగ్ బాస్
Bigg Boss 8 Telugu: బిగ్ బాస్ సీజన్ 8 లోకి అడుగు పెట్టబోతున్న వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ లో ఫస్ట్ కంటెస్టెంట్ గురించి హింట్ ఇచ్చారు బిగ్ బాస్. మరి ఆ ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఎవరో చూసేద్దాం పదండి.
బిగ్ బాస్ సీజన్ 8 తెలుగు మొత్తానికి గొడవలు తగ్గి, కాస్త ఎంటర్టైన్మెంట్ పై ఫోకస్ చేశారు. నామినేషన్ పరంగా చూసుకుంటే ఇప్పటికీ రివేంజ్ నామినేషన్లే నడుస్తున్నాయి. ఇలాంటి టైంలో బిగ్ బాస్ 12 మంది వైల్డ్ కార్డు కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారు అంటూ బిగ్ బాంబు పేల్చిన విషయం తెలిసిందే. కానీ ఆ 12 మందిలో ఎంతమందిని హౌస్ లోకి రానిస్తారు అనేది మాత్రం ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేతుల్లోనే ఉంటుందని మరో బిగ్ ట్విస్ట్ ఇచ్చారు. అలాగే తాజాగా హౌస్ లోకి అడుగు పెట్టబోతున్న ఫస్ట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ గురించి హింట్ ఇచ్చి సోషల్ మీడియాలో టీజ్ చేశారు బిగ్ బాస్. మరి ఆ కంటెస్టెంట్ ఎవరో గెస్ట్ చేద్దాం పదండి.
ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఆ నారదుడే?
వైల్డ్ కార్డు ద్వారా గత సీజన్లలో పాల్గొన్న మాజీ కంటెస్టెంట్స్ హౌస్ లోకి అడుగు పెట్టబోతున్నారన్న వార్త ఇప్పటికే చక్కర్లు కొడుతోంది. అలాగే చాలా మంది మాజీ కంటెస్టెంట్స్ పేర్లు తెరపైకి రాగా, సీజన్ 8 ఫస్ట్ వైల్డ్ కార్డు ఎంట్రీ ఎవరో చెప్పుకోండి చూద్దాం అంటూ ఫేస్ రివీల్ చేయకుండా అతని నీడను మాత్రమే బయట పెట్టారు బిగ్ బాస్ నిర్వాహకులు. అయితే ఎవరైనా సరే బిగ్ బాస్ ఇచ్చిన ఈ హింట్ ను చూస్తే ఆ కంటెస్టెంట్ ఎవరో ఇట్టే పట్టేస్తారు. అతను మరెవరో కాదు టేస్టీ తేజ. గత సీజన్లో కమెడియన్ గా హౌస్ లోకి వెళ్ళిన టేస్టీ తేజాకి అదృష్టంతో పాటు అభిమానులు కూడా పెరగడంతో ఏకంగా తొమ్మిది వారాలు హౌస్ లో ఉండగలిగాడు. ఇక ఒకవేళ ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేస్తున్న విధంగా టేస్టీ తేజనే హౌస్ లోకి అడుగుపెడితే ఎంటర్టైన్మెంట్ పరంగా బిగ్ బాస్ ప్రియులకు ఎలాంటి ఢోకా ఉండదు అని చెప్పొచ్చు. అయితే ప్రస్తుతం హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ను తట్టుకొని నిలబడితే టేస్టీ తేజ మరో నాలుగు ఐదు వారాలు హౌస్ లో ఉండొచ్చు. కానీ టాప్ ఫైవ్ లోకి వెళ్తాడా అన్నది మాత్రం అనుమానమే. ఎందుకంటే ఆయనకి మరో నారదుడు, ఐరన్ లెగ్ అనే రెండు బిరుదులు ఉన్నాయి.
View this post on Instagram
హౌస్ మేట్స్ కోసం రంగంలోకి ఐరన్ లెగ్
బిగ్ బాస్ సీజన్ 7 లో టేస్టీ తేజాకి ఐరన్ లెగ్ అనే ట్యాగ్ పడింది. ఎందుకంటే ఏకంగా హౌస్ లో ఉన్న ఎనిమిది మంది కంటెస్టెంట్స్ లో ఆరుగురు తేజ వల్లే ఎలిమినేట్ అయ్యారు అప్పట్లో. అంటే ఇతను ఎవరిని నామినేట్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అయిపోతారు అనే పేరు వచ్చింది. ముఖ్యంగా సందీప్ మాస్టర్, నైని పావని, పూజ మూర్తి, శుభశ్రీ, రజిత, దామిని వీళ్లంతా అతను నామినేట్ చేయడం వల్ల ఎలిమినేట్ అయిన వాళ్ళే. అంతేకాదు తేజాది కన్నింగ్ మెంటాలిటీ అని ఫిక్స్ అయిపోయారు గత సీజన్ లో అతడిని చూసిన ప్రేక్షకులు. కానీ ఇప్పటికే హౌస్ లో చాలామంది ఇలాంటి మెంటాలిటీతో ఉన్నారు కాబట్టి తేజా వాళ్ళతో కలిసి పోతాడా? లేదంటే మరింత మంట పెడతాడా? అనేది చూడాలి.
Read Also : డబుల్ ఎలిమినేషన్ ఉంటుందా ? బిగ్ బాస్ హౌస్ లో ఐదో వారం నామినేట్ అయిన కంటెస్టెంట్లు వీరే