Bigg Boss Telugu 7: వాళ్లు నీ వారు కాదు - తల్లి ఒడిలో పడుకొని గుక్క పెట్టి మరీ ఏడ్చిన అశ్విని!
బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఫ్యామిలీ వీక్ లో భాగంగా తాజాగా ఓ ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అశ్విని మదర్ హౌస్ లోకి ఎంట్రీ ఇచ్చింది.
బిగ్ బాస్ సీజన్ 7 ( Bigg Boss Season 7 )లో ఫ్యామిలీ వీక్ స్టార్ట్ అయింది. ప్రతి సీజన్లో కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ని హౌస్ లోకి పంపిస్తూ అందరినీ ఎంతో ఎమోషనల్ చేస్తారు బిగ్ బాస్. ఆ ఎపిసోడ్ చూసి ఆడియన్స్ కూడా కండతడి పెట్టుకుంటారు. ఎన్నో వారాలుగా ఫ్యామిలీస్ కి దూరంగా ఉండి కనీసం మాట్లాడలేని స్థితిలో ఉండే కంటెస్టెంట్స్ దగ్గరికి ఒక్కసారిగా ఫ్యామిలీ మెంబర్స్ వెళ్లడంతో ఆ ఎపిసోడ్ అంతా ఎమోషనల్ గా సాగుతుంది. తాజాగా సీజన్ సెవెన్ లో ఫ్యామిలీ వీక్ మొదలైంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు ప్రోమోలు విడుదలవగా, ఓ ప్రోమోలో శివాజీ కొడుకు హౌస్ లో ఎంట్రీ ఇవ్వగా మరో ప్రోమోలో అర్జున్ భార్య సర్ప్రైజ్ ఎంట్రీ ఇచ్చి ఏడిపించింది.
అంతేకాదు ప్రెగ్నెంట్ గా ఉన్న అర్జున్ భార్యకి హౌస్ మేట్స్ సీమంతం కూడా చేశారు. ఆ ప్రోమో అయితే చాలా ఎమోషనల్ గా సాగింది. ఇక బిగ్ బాస్ నుంచి మరో ప్రోమో విడుదలైంది. ఈ ప్రోమోలో అశ్విని మదర్ హౌస్ లోకి వచ్చారు. మొదటి రెండు ప్రోమోల కంటే ఈ ప్రోమో మదర్ సెంటిమెంట్ తో మరింత ఎమోషనల్ గా సాగింది. ఇక ప్రోమోని ఒకసారి పరిశీలిస్తే.. స్టార్టింగ్ లో బిగ్ బాస్ హౌస్ మేట్స్ తో ఫ్రీజ్, లూప్ అంటూ సరదాగా ఆట పట్టించారు. వారిలో రతికాని ఫ్రీజ్ అని అన్నప్పుడు శివాజీ, యావర్ ఆమెను కదిలించే ప్రయత్నం చేశారు. ఆ తర్వాత యావర్, అశ్వినీలను ఫ్రీజ్ అనగానే అందరూ ఫ్రీజ్ అయిపోయారు.
ఆ తర్వాత అమర్, అర్జున్ లను లూప్ అని చెప్పడంతో వాళ్ళు చేసిందే రిపీట్ చేశారు. అలా ఎంతో సరదాగా సాగిన ఈ ప్రోమో ఒక్కసారిగా ఎమోషనల్ టర్న్ తీసుకుంది. బిగ్ బాస్ అందరూ ఫ్రీజ్ అని చెప్పడంతో అశ్విని మదర్ హౌస్ లోకి వస్తుంది. వచ్చి రాగానే కిచెన్ లో ఫ్రీజ్ మోడ్ లో కూర్చున్న అశ్విని గట్టిగా హగ్ చేసుకోవడంతో అశ్విని ఒక్కసారిగా ఏడ్చేసింది. వెంటనే లేచి తన తల్లిని కౌగిలించుకొని తీవ్ర కన్నీటి పర్యంతమైంది. "నువ్వు ఎక్కువ వేరే వాళ్ల గురించి ఆలోచించకు? స్ట్రాంగ్ గా ఉండు?" అని అశ్విని మదర్ తన కూతురికి చెప్పగా అశ్విని.. "ఒక్కోసారి ఇవన్నీ వదిలేసి ఇంటికి వచ్చేయాలనిపిస్తుంది" అని అనగానే అశ్వినిని వాళ్ళ మదర్ ఓదారుస్తుంది.
"నువ్వు ఎవరైతే నావాళ్ళు అనుకుంటావో వాళ్ళు నీ వాళ్లు కారు" అంటూ అశ్వినితో తన తల్లి చెప్పగా కాసేపు అశ్విని తన తల్లి ఒడిలో పడుకుంటుంది. ఆ సమయంలో "మీరు వెళ్లాల్సిన సమయం ఆసన్నమైంది" అంటూ బిగ్ బాస్ ఆదేశిస్తాడు. దాంతో తల్లి ఒడిలో పడుకున్న అశ్విని ఏడుస్తూ.. "మమ్మీ నన్ను వదిలేసి వెళ్లకు మమ్మీ" అంటూ గుక్కపెట్టి మరీ ఏడ్చింది. దాంతో హౌస్ లో ఉన్న వాళ్లంతా ఒక్కసారిగా ఎమోషనల్ మోడ్ లోకి వెళ్లిపోయారు. తాజాగా విడుదలైన ఈ ప్రోమో నెట్టింట వైరల్ గా మారింది. ఇప్పటివరకు విడుదలైన ప్రోమోస్ చూస్తుంటే ఫ్యామిలీ వీక్ ఎపిసోడ్ అయితే ఊహించిన దాని కంటే మరింత హార్ట్ టచింగ్ గా ఉండబోతుందని అర్థమవుతుంది. మరి ఈ ఫుల్ ఎపిసోడ్ ని చూడాలంటే రాత్రి వరకు వేచి చూడాల్సిందే.
Also Read : రాజమౌళి మూవీలో భారీ మార్పు - టీమ్ నుంచి ఆయన ఔట్?
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial