అన్వేషించండి

Bigg Boss Season 7: శోభా శెట్టి, తేజ డేటింగ్ - మోకాళ్లపై కూర్చొని ప్రపోజల్, శోభా సమాధానం ఇదే!

Bigg Boss Season 7: బిగ్ బాస్ సీజన్ 7లో శోభా శెట్టి, టేస్టీ తేజ మధ్య కూడా ఒక ట్రాక్ నడుస్తుంది అని ప్రేక్షకులు ఎప్పటినుండో ఫీలవుతున్నారు.

బిగ్ బాస్ సీజన్ 7లో కంటెస్టెంట్స్ మానసిక బలాన్ని, శారీరిక బలాన్ని తెలుసుకునే టాస్కులతో పాటు అప్పుడప్పుడు కాస్త ఫన్నీ టాస్కులు, రొమాంటిక్ టాస్కులు కూడా జరుగుతాయి. తాజాగా అలాంటి ఒక టాస్కే జరిగింది. ఈ టాస్కులో గెలిచినందుకు శోభా శెట్టితో కలిసి డేట్‌కు వెళ్లే అవకాశం కొట్టేశాడు తేజ. ఓవైపు వీకెండ్ ఎపిసోడ్‌లో శోభా, తేజల డేటింగ్ హైలెట్‌గా నిలిస్తే.. మరోవైపు ప్రిన్స్ యవర్ చేతికి కెప్టెన్సీ వచ్చిన 24 గంటల్లోనే తన ప్రవర్తన, కంటెస్టెంట్స్‌తో తను మాట్లాడే పద్ధతి మొత్తం మారిపోయిందని ప్రేక్షకులు సైతం ఫీల్ అయ్యేలా చేశాడు. 

ఉబ్బిన పూరి లాంటి పెదాలు..
ముందుగా డేటింగ్ టాస్క్ కోసం ఒక వైట్ టీషర్ట్‌ను పంపించారు బిగ్ బాస్. ప్రస్తుతం బిగ్ బాస్ హౌజ్‌లో మొత్తం అయిదుగురు అమ్మాయిలు ఉన్నారు కాబట్టి ఆ వైట్ టీషర్ట్‌పై అయిదు నెంబర్లు రాసి ఉన్నాయి. అమ్మాయిలంతా లిప్ స్టిక్ పెట్టుకొని ఆ టీషర్ట్‌పై లిప్ మార్క్ పెట్టాలి. ఆ తర్వాత మేల్ కంటెస్టెంట్స్ వచ్చి ఆ లిప్ మార్క్స్ ఎవరివో కరెక్ట్‌గా కనిపెట్టాలి. కరెక్ట్‌గా కనిపెట్టిన మేల్ కంటెస్టెంట్.. ఆ లిప్ మార్క్ ఉన్న ఫీమేల్ కంటెస్టెంట్‌తో డేట్‌కు వెళ్లవచ్చు. ఈ టాస్క్‌కు శివాజీ సంచాలకుడిగా వ్యవహరించాడు. ఈ టాస్కులో యావర్.. నయని పావని లిప్ మార్క్‌ను కరెక్ట్‌గా కనిపెట్టగా.. తేజ.. శోభా శెట్టి లిప్ మార్క్‌ను కరెక్ట్‌గా గుర్తించాడు. ఉబ్బిన పూరిలాంటి పెదాలు ఉన్న లిప్ మార్క్ శోభాది అని చాలా ఫన్నీగా చెప్పాడు తేజ. దీంతో తేజ సమాధానం ఫన్నీగా ఉందని తననే విన్నర్‌గా ప్రకటించాడు శివాజీ. దీంతో వీరిద్దరూ కలిసి డేట్‌కు వెళ్లే అవకాశం లభించింది.

మోకాళ్లపై కూర్చొని ప్రపోజల్..
యాక్టివిటీ ఏరియాలో శోభా శెట్టి, తేజ డేట్ కోసం మంచి డెకరేషన్ కూడా ఏర్పాటు చేయించారు బిగ్ బాస్. అందులోకి వెళ్లగానే అక్కడ ఉన్న రెడ్ హార్ట్ బెలూన్‌ను తీసుకొని తన మోకాళ్ల మీద కూర్చొని శోభా శెట్టికి ప్రపోజ్ చేశాడు తేజ. ‘‘శోభా.. మూడేళ్లు లేట్ అయ్యింది. చెప్పాల్సింది చెప్పేస్తున్నా. నిన్ను ఒక ఫ్రెండ్‌గా ప్రేమిస్తున్నా. ఇదయితే ఫిక్స్. నువ్వు నా ప్రపోజల్‌కు ఒప్పుకుంటున్నావా?’’ అని అడిగాడు. దానికి శోభా.. ‘‘ఐ లవ్ యూ టూ ఫ్రెండ్. ఫ్రెండ్స్ కూడా డేట్ చేయవచ్చు అని మనం నిరూపిద్దాం’’ అని చెప్పింది. ఆ తర్వాత వీరిద్దరూ రొమాంటిక్ డిన్నర్ డేట్‌ను ఎంజాయ్ చేయడంతో పాటు కలిసి డ్యాన్స్ కూడా చేశారు.

యావర్ కెప్టెన్సీ నచ్చని కంటెస్టెంట్స్..
ప్రిన్స్ యావర్.. బిగ్ బాస్ సీజన్ 7లో రెండో కెప్టెన్‌గా బాధ్యతలు స్వీకరించాడు. కానీ అలా తన చేతికి అధికారం రాగానే యావర్ ప్రవర్తనే మారిపోయింది అని చాలామంది కంటెస్టెంట్స్ భావించారు. ముందుగా కిచెన్‌లోని రేషన్ విషయంలో యావర్ ప్రవర్తన తనకు నచ్చలేదంటూ రేషన్ మ్యానేజర్ స్థానంలో ఉన్న గౌతమ్.. యావర్ కెప్టెన్సీని బాయ్‌కాట్ చేస్తున్నట్టుగా ప్రకటించాడు. ఆ తర్వాత వీఐపీ రూమ్‌లో ఉన్న స్ప్రైట్ కావాలంటూ అమర్‌దీప్ వచ్చి యావర్‌ను అడిగాడు. యావర్ ఇవ్వకపోవడంతో ఇద్దరి మధ్య కాసేపు వాగ్వాదం జరిగింది. అది ఆపడానికి వచ్చిన సందీప్‌పై యావర్ అనవసరంగా అరిచాడు. తనను ‘రా’ అని అనొద్దు అంటూ గట్టిగా చెప్పేశాడు. ఇప్పుడు నేను కెప్టెన్, నన్ను రా అనొద్దు అని అన్నాడు యావర్. అయితే కెప్టెన్‌గా యావర్ ప్రవర్తనను నాగార్జున కూడా సమర్ధించడం చాలామంది హౌజ్‌మేట్స్‌కు నచ్చలేదు.

Also Read: బిగ్ బాస్‌లో అనూహ్య ఎలిమినేషన్ - శోభా శెట్టి కాకుండా మరో లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్

ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial 

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సెంచరీ చేసిన నితీశ్ రెడ్డి, సోషల్ మీడియాలో స్టిల్స్ వైరల్మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు పూర్తిమాదాపూర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం, ఇద్దరు యువకులు మృతిపవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Pawan Kalyan: అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
అల్లు అర్జున్ ఇష్యూ గురించి పవన్ కళ్యాణ్‌కు ప్రశ్నలు... జనసేనాని ఏం చెప్పారో తెలుసా?
Where is Mohanbabu: కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
కనిపిస్తే అరెస్టు - మోహన్ బాబుకు టార్చర్ - ఆజ్ఞాతంలో ఇంకెంత కాలం
HYDRA: '200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
'200 ఎకరాల ప్రభుత్వ భూమిని రక్షించాం' - త్వరలోనే 'హైడ్రా' FM ఛానల్, కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన
Borewell: అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
అయ్యో చిట్టితల్లీ ఎంత నరకయాతన! - 6 రోజులుగా బోరుబావిలోనే చిన్నారి, తమ బిడ్డను రక్షించాలంటూ వేడుకోలు
Gavaskar Standing Ovation: నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
నితీశ్ సెంచరీకి గావస్కర్ స్టాండింగ్ ఓవెషన్ - ఆ జాగ్రత్తలు తీసుకుంటే అద్భుతమైన కెరీర్ ఉంటుందని సూచనలు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
పవన్ టూర్‌లో ఫేక్ ఐపీఎస్  కలకలం! పోలీసులతో ఫోటోలకు ఫోజులు
Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..  
Jio Airtel Best Plans: కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
కాలింగ్, ఎస్ఎంఎస్‌తో పాటు ఓటీటీ యాప్స్ కూడా - జియో, ఎయిర్‌టెల్ బెస్ట్ ప్లాన్లు ఇవే!
Embed widget