Bigg Boss Season 7 Latest Promo: షర్ట్ విప్పి శోభా శెట్టికి బాడీ చూపించిన గౌతమ్ - ఉగ్రరూపం చూపించిన ‘కార్తీక దీపం’ విలన్, ప్రిన్స్‌కు నరకం!
బిగ్ బాస్ సీజన్ 7లో కొందరు కేవలం శారీరిక బలంతో ముందుకెళ్లాలని ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా విడుదలయిన ప్రోమో చూస్తుంటే గౌతమ్ కూడా అలాంటే కంటెస్టెంటేనేమో అని డౌట్ వస్తుంది.
బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss Telugu Season 7) మూడో పవర్ అస్త్రా కోసం పోటీ రసవత్తరంగా సాగుతోంది. ఇప్పటికే అమర్‌దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌లను పవర్ అస్త్రా కోసం బిగ్ బాస్ ఎంపిక చేశారు. కానీ బిగ్ బాస్ తీసుకున్న ఆ నిర్ణయాన్ని కంటెస్టెంట్స్ ఒప్పుకోలేకపోయారు. దీంతో ఆ ముగ్గురు ఎందుకు అనర్హులు అనే విషయాన్ని ప్రతీ కంటెస్టెంట్ చెప్పారు. తమ తమ అభిప్రాయాలను విన్న తర్వాత బిగ్ బాస్.. ఆ కంటెస్టెంట్స్‌కు అసలైన ట్విస్ట్ ఇచ్చాడు. వారి కన్ఫెషన్ రూమ్‌లో సీక్రెట్‌గా చెప్పిన విషయాన్ని.. అందరి ముందు బయటపెట్టాడు. నిన్న (సెప్టెంబర్ 19న) ప్రసారమయిన ఎపిసోడ్‌లో ప్రిన్స్ యావర్‌ను ఎందుకు అనర్హుడు అని కంటెస్టెంట్స్ అనుకుంటున్నారో అన్న విషయాన్ని బయటపెట్టాడు బిగ్ బాస్. ఇక నేటి (సెప్టెంబర్ 20న) ఎపిసోడ్ సరిగ్గా అక్కడ నుండే ప్రారంభమయ్యింది.
ప్రిన్స్ యావర్‌ను పలువురు కంటెస్టెంట్స్.. పవర్ అస్త్రాకు అనర్హుడు అంటూ తమ తమ కారణాలు చెప్పారు. దీంతో యావర్ అనర్హుడు కాదు అని నిరూపించుకోమని బిగ్ బాస్ తనకు ఒక అవకాశాన్ని ఇచ్చాడు. కంటెస్టెంట్స్ వచ్చి ఏం చేసినా.. ప్రిన్స్ యావర్ మాత్రం స్టాండ్ బై నుంచి అసలు లేవకూడదు అని బిగ్ బాస్ ఆదేశించారు. దీంతో స్టాండ్ బైలో ఉన్న యావర్‌ను చూసి ఇదే రివెంజ్ తీసుకునే ఛాన్స్ అని అనుకున్నారు రతిక, దామిని. ముందు నుంచే రతికకు, దామినికి యావర్ పద్ధతి నచ్చడం లేదు. అందుకే ఇలాంటి టాస్క్ వచ్చినప్పుడు యావర్ ఏం చేస్తాడా, ఎంత ఓపికగా ఉంటాడా అని వారు చూడాలని అనుకున్నారు. దానికి తగినట్టు యావర్‌ను స్టాండ్ బై నుంచి లేపడానికి విపరీతంగా ప్రయత్నాలు చేశారు. నరకం చూపించారు. ఈ టాస్క్‌కు శివాజీ సంచాలకుడిగా వ్యవహరించాడు.
ప్యాంట్‌లో ఐస్.. మొహంపై పేడ..
ముందుగా రతిక వచ్చి స్టాండ్ బై దగ్గర నిలబడి ఉన్న యావర్ మొహంపై గుడ్డు కొట్టింది. అది చూసి శివాజీ వద్దని చెప్పాడు. కానీ దామిని మాత్రం ‘‘సార్ ఇవన్నీ మా ప్రయత్నాలు’’ అంటూ తమ ప్రవర్తనను సమర్థించుకుంది. ఆ తర్వాత యావర్ ముక్కులో కూడా ఏదో పెట్టి తనను కదపాలని చూశారు. టేస్టీ తేజ.. యావర్‌ను లేపడానికి ఐస్ తీసుకొని వచ్చాడు. ఆ ఐస్‌ను తీసుకొని యావర్ ప్యాంట్‌లో వేశారు కంటెస్టెంట్స్. అయినా కూడా యావర్ అలాగే కదలకుండా నిలబడ్డాడు. ఆ తర్వాత యావర్ మోహంపై నీళ్లు కొట్టారు. యావర్‌ను కదిలించడం కోసం గడ్డి, పేడను పంపించారు బిగ్ బాస్. ఒకటి తర్వాత ఒకటి ఎన్ని చేసినా యావర్ మాత్రం అక్కడ నుంచి కదలలేదు.
షర్ట్ విప్పేసి మరీ..
ప్రిన్స్ యావర్‌ను కంటెస్టెంట్స్ ఎందుకు అనర్హుడు అనుకుంటున్నారో.. బిగ్ బాస్ ఇప్పటికే వీడియోలు చూపించారు. ఇప్పుడు అమర్‌దీప్, శోభా శెట్టి టర్న్ వచ్చింది. ఇక ముందుగా శోభా శెట్టి ఎందుకు అనర్హురాలు అని కంటెస్టెంట్స్ అనుకుంటున్నారో వీడియోలు చూపించారు బిగ్ బాస్. దీంతో శోభాకు, గౌతమ్‌కు మధ్య గొడవ మొదలయ్యింది. ‘‘నువ్వు చెప్పింది బక్వాస్ రీజన్’’ అని గౌతమ్‌పై అరిచింది శోభా. ‘‘నేను జిమ్ చేస్తే నీకెంటి సమస్య’’ అని ఎదురుప్రశ్న వేశాడు గౌతమ్. ‘‘అందుకే ఏం చేయలేకపోయావు’’ అంటూ శోభా హేళన చేసింది. ఆ మాటకు కోపం తెచ్చుకున్న గౌతమ్.. ఒక్కసారిగా తన షర్ట్‌ను విప్పి చూపించాడు. ఆ తర్వాత ఒకరిపై ఒకరు అరచుకోవడం మొదలుపెట్టారు. ఒకరు గట్టిగా అరిస్తే.. వారికంటే గట్టిగా మరొకరు అరిచారు. వాదించి విసిగిపోయిన శోభా శెట్టి.. గార్డెన్‌లో వెళ్లి కూర్చుంది. ఒక డంబుల్ తీసుకొని అక్కడికి వచ్చిన గౌతమ్.. ‘‘నా బాడీ నా ఇష్టం’’ అంటూ వర్కవుట్ చేయడం మొదలుపెట్టాడు.
Also Read: 8 ఏళ్ల తర్వాత మరోసారి ప్లాప్ డైరెక్టర్‌తో గోపిచంద్ సినిమా?
Join Us on Telegram: https://t.me/abpdesamofficial