Bigg Boss Season 7 Latest Promo: షకీలాకు దెయ్యం పట్టిందా? వణికిపోయిన కంటెస్టెంట్లు - శివాజీ ఆటగాడే!
తాజాగా కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేయడానికి శివాజీ.. ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్.. ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా భయపడేలా చేసింది.
![Bigg Boss Season 7 Latest Promo: షకీలాకు దెయ్యం పట్టిందా? వణికిపోయిన కంటెస్టెంట్లు - శివాజీ ఆటగాడే! Bigg Boss Season 7 Latest Promo shivaji makes master plan and shakila joins with him Bigg Boss Season 7 Latest Promo: షకీలాకు దెయ్యం పట్టిందా? వణికిపోయిన కంటెస్టెంట్లు - శివాజీ ఆటగాడే!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2023/09/08/fded0c191e1f78f837260be6b47cdc941694181682724802_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
బిగ్ బాస్ హౌజ్‌లో అసలు కంటెస్టెంట్స్‌కు ఎలా టైమ్‌పాస్ అవుతుంది? ఫోన్ లేకుండా, టీవీ లేకుండా, బయట ప్రపంచానికి ఎలాంటి యాక్సెస్ లేకుండా అసలు వారు అన్ని రోజులు ఒకేచోట ఎలా ఉంటారు? ఇలాంటి అనుమానాలు చాలామంది ప్రేక్షకులకు ఉంటాయి. కానీ అదే కదా.. బిగ్ బాస్ రియాలిటీ షో అంటే. బిగ్ బాస్ హౌజ్‌లో ఉన్నంత వరకు కంటెస్టెంట్స్ బోర్ ఫీల్ అవ్వకూడదు, ప్రేక్షకులు బోర్ ఫీల్ అయ్యేలా చేయకూడదు.. అదే వారికి అన్నింటికంటే అతిపెద్ద టాస్క్. తాజాగా కంటెస్టెంట్స్‌తో పాటు ప్రేక్షకులను కూడా ఎంటర్‌టైన్ చేయడానికి శివాజీ.. ఒక మాస్టర్ ప్లాన్ వేశాడు. ఆ ప్లాన్.. ఒక్కసారిగా కంటెస్టెంట్స్ అంతా భయపడేలా చేసింది. శివాజీ వేసిన ఈ మాస్టర్ ప్లాన్‌లో షకీలా కూడా చేయికలిపారు.
ఇది కదా ప్రేక్షకులకు కావాల్సిన ట్విస్ట్..!
బిగ్ బాస్ సీజన్ 7లో డే 4కు సంబంధించి తాజాగా మరో ప్రోమో విడుదలయ్యింది. అందులో ముందుగా షకీలాకు జ్వరం వచ్చినట్టుగా చూపించారు. అప్పుడు గౌతమ్ కృష్ణ వచ్చి తనకు ఏమయ్యిందో చూసే ప్రయత్నం చేశాడు. ‘‘ఫీవర్ వచ్చిందా? నిద్రొస్తుందా’’ అని గౌతమ్ అడగగా లేదు అంటూ సమాధానం ఇచ్చారు షకీలా. ఆ తర్వాత గౌతమ్.. తనను ట్రీట్ చేసే ప్రయత్నం చేయగా.. ఒక్కసారిగా కళ్లు మూసుకున్నారు షకీలా. అది చూసి కిరణ్ రాథోడ్, శివాజీ భయపడ్డారు. ఆ తర్వాత తనకు ఆరోగ్యం బాగాలేదని అనుకొని నిద్రపుచ్చే ప్రయత్నం చేశారు ఇతర కంటెస్టెంట్స్. కానీ షకీలా మాత్రం పడుకోకుండా అలాగే చూస్తూ కూర్చున్నారు. కట్ చేస్తే.. అక్కడే ప్రోమోలో అసలైన ట్విస్ట్ వచ్చింది.
ఆ ముగ్గురు వేసిన ప్లాన్..
షకీలా ఇలా ప్రవర్తించే ముందు శివాజీ, కిరణ్ రాథోడ్, షకీలా కలిసి మాట్లాడుకుంటున్నారు. అప్పుడు శివాజీ.. ‘నాకు బోర్ కొడుతుంది’ అన్నాడు. దానికి ‘నేనేం చేయాలి’ అంటూ ప్రశ్నించారు షకీలా. ‘సడెన్‌గా నిద్రలోకి నుండి లేచి అందరినీ భయపెట్టాలి’ అని ఐడియా ఇచ్చాడు శివాజీ. దానికి కిరణ్ రాథోడ్ భయపడినా.. వెంటనే ముగ్గురూ ఈ ప్లాన్‌కు ఒప్పుకున్నారు. అదే ప్లాన్‌తో కంటెస్టెంట్స్‌ను భయపెట్టాలని అనుకున్నారు. శివాజీ చెప్పినట్టుగానే షకీలా బెడ్ మీద కూర్చొని పడుకోకుండా అలాగే చూస్తూ కూర్చున్నారు. అప్పుడు శివాజీ.. మీరు వెళ్లి మాట్లాడండి అంటూ కొంతమంది కంటెస్టెంట్స్‌ను షకీలా దగ్గరికి పంపించాడు. కానీ ఎవరూ తన దగ్గర వరకు వెళ్లే ధైర్యం చేయలేదు.
నిద్రపోలేదు.. నిద్రపోనివ్వలేదు..
దామిని, శుభశ్రీ.. షకీలా ప్రవర్తనను చూసి చాలా భయపడ్డారు. ఇదంతా తను వేసిన ప్లానే అయినా శివాజీ అయితే యాక్టింగ్ ఇరగదీశారు. షకీలా సడెన్‌గా నిద్రలో నుండి లేచి ఉలిక్కిపడినట్టుగా చేసినందుకు ‘ఎవరూ లేరు’ అంటూ ధైర్యం చెప్తూ మళ్లీ నిద్రపుచ్చే ప్రయత్నం చేశాడు. తేజ కూడా షకీలాను నిద్రపుచ్చే ప్రయత్నం చేయగా.. అప్పుడు కూడా అలాగే సడెన్‌గా లేచి, అతడిని భయపెట్టింది. అందరూ కంటెస్టెంట్స్ షకీలా ఎందుకలా చేస్తున్నారు అనే కన్ఫ్యూజన్‌లో ఉండిపోయారు. శివాజీ అయితే ఏం టెన్షన్ లేదు అంటూ తను చేస్తున్న ఈ ఫన్నీ టాస్క్ గురించి బిగ్ బాస్‌కు ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తూనే ఉన్నాడు. ఆ తర్వాత షకీలా.. దామిని ప్లాన్ అంతా లీక్ చేసింది. మొత్తానికి తను వేసిన ప్లాన్‌తో శివాజీ.. తాను పడుకోకుండా, ఎవరిని పడుకోనివ్వకుండా చేశాడు. ప్రతీరోజూ శివాజీ.. ఇలా కొత్త కొత్త ఐడియాలతో ప్రేక్షకులను ఎంటర్‌టైన్ చేస్తున్నాడంటూ బిగ్ బాస్ ఫ్యాన్స్ ప్రశంసిస్తున్నారు.
Also Read: బ్యాక్ టు బ్యాక్ రెండు సినిమాలు చూసేశా - స్వీటీ, షారుఖ్ మూవీస్‌పై రాజమౌళి రివ్యూ ఇది!
ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)