అన్వేషించండి

Bigg Boss Season 7 Day 14 Updates: నేనే కొంచెం ఎక్కువ అర్హుడిని అంటూ యావర్ వ్యాఖ్యలు - సీరియస్ అయిన నాగార్జున

బిగ్ బాస్ హౌజ్‌లోకి వచ్చిన ప్రతీ ఒక్కరు.. అర్హులని నిరూపించుకోవాలి అనుకుంటారు. అంతే కాకుండా ఎవరికి వారు ఎక్కువ అర్హుడు అని కూడా అనుకుంటున్నారు. యావర్ మాత్రం అంతకంటే కొంచెం ఎక్కువే అనుకుంటున్నాడు.

బిగ్ బాస్ సీజన్ 7లో సండే ఫండే మొదలయ్యింది. ఇప్పటికే మొదటి వారంలో ఒక అస్త్రం, రెండో వారంలో రెండో అస్త్రం సాధించుకున్న ఇద్దరు కంటెస్టెంట్స్ ఫుల్ ఖుషీలో ఉన్నారు. వారు కాకుండా మిగిలిన కంటెస్టెంట్స్ మాత్రం కాస్త డిసప్పాయింట్‌మెంట్‌లోనే ఉన్నారు. అవన్నీ మర్చిపోయేలా చేయడానికి చాలా ఫన్‌తో నాగార్జున.. ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ముందుగా బిగ్ బాస్‌ హౌజ్‌లో ఉన్నవారు ‘బాహూబలి’ అయితే వారి జీవితంలో కట్టప్ప  ఎవరు, భల్లాలదేవ ఎవరు అనే విషయాన్ని చెప్పమని నాగార్జున చెప్పారు. దీంతో కంటెస్టెంట్స్ అంతా హౌజ్‌లో తమరికి ఎవరు కట్టప్ప, ఎవరు భల్లాలదేవ అని వారి కారణాలు చెప్పడం మొదలుపెట్టారు.

ముందుగా శోభా శెట్టితో ఈ ఫన్ ఆట ప్రారంభమయ్యింది. తన జీవితంలో కట్టప్ప గౌతమ్ అని, భల్లాలదేవ ప్రిన్స్ యావర్ అని చెప్పుకొచ్చింది. రణధీర టీమ్‌లో బాగా ఆడినా కూడా గౌతమ్ తనను గుర్తించలేదు అనే కారణంతో కట్టప్ప అనే ట్యాగ్ తనకు ఇచ్చింది. ఇక యావర్ అన్నింటిలో అర్హుడు అని శోభా శెట్టి ఫీల్ అవుతున్నానని చెప్పింది. గౌతమ్ కూడా యావరే స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని తనకే భల్లాలదేవ అనే ట్యాగ్ ఇచ్చాడు. ఇక రతికకు కట్టప్పను ఇచ్చాడు. మహాబలి టీమ్ అంతా కలిసి మాయాస్త్రాన్ని ఒకరికి ఇవ్వాలి అన్నప్పుడు రతిక బాగా మొండికేసిందని, టీమ్ అందరిని ఇబ్బంది పెట్టిందని గౌతమ్ గుర్తుచేసుకున్నాడు.

రతిక అయితే కట్టప్ప ట్యాగ్‌ను తేజకు ఇచ్చింది. భల్లాలదేవ ట్యాగ్‌ను గౌతమ్‌కు ఇచ్చింది. దీంతో కంటెస్టెంట్స్ అంతా ఆశ్చర్యపోయారు. మహాబలి టీమ్‌లో ఉన్నప్పుడు గౌతమ్, రతిక మధ్య జరిగిన వాగ్వాదం తర్వాత గౌతమ్‌కు భల్లాలదేవ ట్యాగ్ ఇచ్చిందంటే ట్విస్ట్ అదిరిందంటూ ప్రేక్షకులు కూడా ఆశ్చర్యపోయారు. ఇక తేజ.. టీమ్ డిస్కషన్ అప్పుడు తనను వేరుగా చూశాడని, నమ్మలేదనే కారణంతో తనకు కటప్ప ట్యాగ్‌ను ఇచ్చింది రతిక. తేజ మాత్రం కట్టప్పను గౌతమ్‌కే ఇచ్చాడు. బల్లాలదేవను శివాజీకి ఇచ్చాడు. చాలావరకు మహాబలి టీమ్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అంతా తమ టీమ్‌లోని ఇతర కంటెస్టెంట్స్‌కే భల్లాలదేవ, కట్టప్ప అనే ట్యాగ్స్ ఇచ్చారు. 

చాలామంది భల్లాలదేవ అని ట్యాగ్ ఇచ్చిన శివాజీ మాత్రం.. ప్రశాంత్‌కు భల్లాలదేవ అని ట్యాగ్ ఇస్తూ తను మరోసారి స్ట్రాంగ్ అని చెప్పాడు. అయితే హౌజ్‌లో అందరూ ప్రశాంత్ నటిస్తున్నాడని చెప్పున్నారు కదా.. దీనిపై నీ ఉద్దేశ్యం ఏంటి అని నాగార్జున.. శివాజీని అడిగారు. ‘అలా అయితే నేను వాడితో ఉండేవాడిని కాదు కదా. నాకు ఎప్పుడూ అలా అనిపించలేదు’ అంటూ సమాధానమిచ్చాడు. యావర్ అయితే తనను పవర్ అస్త్రాకు సెలక్ట్ చేయకపోవడంతో సందీప్‌ను కట్టప్పలాగా ఎంపిక చేశాడు. షకీలా అయితే కట్టప్ప ట్యాగ్‌ను ప్రిన్స్‌కు ఇచ్చింది. తను ఊరికే అర్హుడు అని చెప్తున్నాడు అంటూ దానికి కారణం చెప్పింది. అయితే షకీలాను మాట్లాడనివ్వకుండా యావర్ మధ్యలో మాట్లాడుతుంటే.. నాగార్జున సీరియస్ అయ్యారు. ‘యావర్ విను’ అని అరిచారు. ఆ తర్వాత కూడా యావర్.. అందరికంటే తాను కొంచెం ఎక్కువ అర్హుడు అన్నట్టుగా మాట్లాడాడు.

Also Read: అనిరుధ్‌తో కీర్తి సురేష్ పెళ్లి - అసలు సంగతి చెప్పిన ఆమె తండ్రి

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

గ్రామస్థుల భారీ ఆందోళన రోడ్డుపైనే వంట.. RDO నిర్బంధం!హైవే పక్కనే పెద్దపులి తిష్ట, జడుసుకున్న వాహనదారులుఇంకా చల్లారని  రాకాసి మంటలు, కుప్పకూలిపోయిన భవనంజీడిమెట్లలో భారీ అగ్ని ప్రమాదం, ఆ తప్పు వల్లే దట్టంగా మంటలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
YS Sharmila: అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
అదాని, మోదీలంటే చంద్రబాబుకు భయం - గవర్నర్‌కు షర్మిల ఫిర్యాదు
Telangana Adani Investments: కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
కేసీఆర్ హయాంలోనే అదానీతో ఒప్పందాలు, పెట్టుబడులు - అధారాలు రిలీజ్ చేసిన కాంగ్రెస్
CM Chandrababu: సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
సభ్యత్వ నమోదులో టాప్ 10 నేతలకు చంద్రబాబు అభినందన, మంత్రి లోకేష్‌కు ప్రత్యేకంగా
PAN Card Vs PAN 2.0: పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
పాన్ కార్డు వర్సెస్ పాన్ 2.0 - రెండిటి మధ్య తేడా ఏంటి? - కొత్త కార్డు వల్ల లాభాలేంటి?
Maharastra: నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
నా వల్లనే ప్రాబ్లం అయితే సీఎం పదవి అక్కర్లేదు - ప్రధానికి చెప్పానన్న షిండే - వీడనున్న మహా చిక్కుముడి !
Dilawarpur Latest News: ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
ఇథనాల్‌ పరిశ్రమ వివాదంలో బిగ్‌ అప్‌డేట్‌- పనులు ఆపాలని కలెక్టర్ ఆదేశం- ప్రభుత్వానికి కీలక నివేదిక
Vizag News: విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
విశాఖ జిల్లా పరవాడ ఫార్మాసిటీలో ప్రమాదం- ఒకరు మృతి- విషయాన్ని దాచి పెట్టిన యాజమాన్యం
Mahindra XEV 9e: సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
సింగిల్ ఛార్జ్‌తో 656 కిలోమీటర్లు - మోస్ట్ అవైటెడ్ మహీంద్రా ఎలక్ట్రిక్ కారు వచ్చేసింది!
Embed widget