Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!
గీతూను ఒక ఆట ఆడుకున్నారు నాగార్జున. రేవంత్ ‘లూజర్’ కాదంటూ ఆడియన్స్ కూడా తేల్చేశారు.
ఈ రోజు (25.09.2022) సన్ డే.. ఫన్‌డే. అంటే ‘బిగ్ బాస్’ హౌస్‌లో నవ్వులు విరబూయనున్నాయి. అదే సమయంలో.. ఏడుపులు కూడా. ఎందుకంటే.. ఎలిమినేషన్ జరిగేది కూడా ఈ రోజే. అయితే, ఈ రోజు యాంకర్ నేహా ఎలిమినేట్ కానుందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి, ఇందులో నిజమేంటనేది ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాతే తెలుస్తుంది.
తాజాగా రిలీజైన ప్రోమో ప్రకారం.. ఈ రోజు ఫుల్ ఫన్ కనిపించనుంది. ఈ రోజు ‘సుత్తి దెబ్బ’ పేరుతో హౌస్‌మేట్స్‌తో ఆటలాడుకోనున్నాడు బిగ్ బాస్. ఈ సందర్భంగా ఇంట్లో ఫేక్ ఎవరని నాగ్.. ఫైమాను అడిగారు. ఇందుకు ఫైమా.. ఆరోహిని సుత్తితో కొట్టింది. దీంతో నాగ్ ఆరోహి ఫేక్ అయితే హౌస్‌లో మాకు అన్ని ఫొటోలు దొరికేవా అని నాగ్ అన్నారు. హౌస్‌లో నోటి దురద ఎవరికి అని ఆదిరెడ్డిని అడిగితే.. అతను గీతూను సుత్తితో కొట్టాడు. దీంతో ఆడియన్స్ కూడా ఎక్కువ ఎస్ చెప్పారు. అయితే, ఒకరిద్దరు మాత్రం నోచెప్పారు. దీంతో వారిని ఎందుకు నో చెప్పారని నాగ్ అడిగితే.. గీతూ ఏది మాట్లాడినా కరెక్టుగా మాట్లాడుతుందని తెలిపాడు. ఇలా ఫన్నీగా ఈ రోజు ఎపిసోడ్ సాగనుంది. ఆటలో లూజర్ ఎవరు అంటే, గీతూ.. రేవంత్‌ను సుత్తితో కొట్టింది. అయితే, ఆడియన్స్ అంతా ఆమె ఆరోపణకు అంగీకరించలేదు. అంతా ‘నో’ చెప్పారు. ఆ తర్వాత సుదీప.. రేవంత్‌ను తిండిబోతు అని దానికి కూడా ఆడియన్స్ నో చెప్పారు. అసలైన తిండిబోతు శ్రీసత్య అని చెప్పారు. అయితే, నాగ్.. నీతూకు నోటి దూ* అనడం చర్చనీయమైంది.
బిగ్ బాస్ తెలుగు ప్రోమో:
శనివారం ఎపిసోడ్ హైలెట్స్
❤ గేమ్ లో బాలాదిత్య ఆడడం లేదని ఒక వీడియో వేసి చూపించారు నాగార్జున. దానికి బాలాదిత్య తన వెర్షన్ వినిపించారు. గేమ్ లో చాలా మంది ఫిజికల్ అయ్యారని.. తను ఆడింది కరెక్ట్ అని చెప్పుకున్నాడు. దానికి ఆడియన్స్ అంగీకరించలేదు. మళ్లీ బాలాదిత్య మాట్లాడే ప్రయత్నం చేయగా.. నాగార్జున ఆపేశారు. వాసంతిని ఉద్దేశిస్తూ.. 'నువ్ చక్కగా రెడీ అవుతున్నావ్, అలానే గేమ్ కూడా ఆడు' అని సజెషన్ ఇచ్చారు నాగార్జున.
❤ రోహిత్-మెరీనా గేమ్ లో మరింత ఇంప్రూవ్ అవ్వాలని చెప్పారు నాగ్. కీర్తి చిన్న చిన్న విషయాలకు కూడా ఏడుస్తుందని.. అలా చేయొద్దని నాగార్జున చెప్పారు. గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే అసలు ఏడవాల్సిన అవసరం కూడా లేదని అన్నారు.
❤ సుదీపను కూడా గేమ్ బాగా ఆడాలని చెప్పారు. శ్రీసత్య గేమ్ తీరుని పొగిడారు నాగార్జున. దొంగల టీమ్ లో, కెప్టెన్సీ టాస్క్ లో చాలా బాగా ఆడావ్ అంటూ శ్రీహాన్ పై ప్రశంసలు కురిపించారు.
❤ ఇనయాను శ్రీహన్ 'పిట్ట' అని అనడంపై నాగార్జున క్లాస్ పీకారు. శ్రీహాన్, ఇనయాల మధ్య గొడవ జరుగుతుంటే మధ్యలో గీతూ రావడంపై నాగార్జున ప్రశ్నించారు. దాన్ని గీతూ కామెడీ చేసేసింది.
❤ నాగార్జున మాత్రం గీతూకి నోటి దురద అని తేల్చేశారు. రేవంత్, ఇనయాల మధ్య గొడవ గురించి మాట్లాడారు నాగార్జున. ఇనయా 'వాడు' అని పిలవడం రేవంత్ కి కోపమొచ్చి 'లాగిపెట్టి కొడతా' అన్నట్లుగా మాట్లాడాడు. ఇంకెప్పుడు అలా ప్రవర్తించొద్దని రేవంత్ కి, క్లోజ్ నెస్ లేనప్పుడు ఇష్టమొచ్చినట్లుగా పిలవొద్దని ఇనయాకి చెప్పారు.
❤ అర్జున్ కళ్యాణ్ ని కాసేపు శ్రీసత్య పేరుతో ఏడిపించారు నాగార్జున. ఇనయా.. తన చెంప పగలగొట్టిందని నేహా అందరికీ చెప్పడాన్ని నాగార్జున తప్పుబట్టారు. నిజానికి గేమ్ లో నేహా మొహంపై ఇనయా రాసుకుంటూ వెళ్లిందని.. దాన్ని కొట్టడం అనరని నాగార్జున చెప్పారు. వీడియో కూడా వేసి చూపించారు. దీంతో నేహా సారీ చెప్పింది.
❤ ఫైమా గేమ్ బాగా ఆడుతుందని.. ఆమెకి తొమ్మిది మార్కులు ఇచ్చారు నాగార్జున. సూర్య కూడా గేమ్ బాగా ఆడుతున్నారని చెప్పారు నాగ్. చంటి, రాజ్ సరిగ్గా ఆడడం లేదని సోఫా వెనక్కి వెళ్లి నుంచోమన్నారు. గీతూ, ఆదిరెడ్డిలకు గేమ్ లో పదికి పది మార్కులు ఇచ్చారు నాగార్జున.
❤ ఇనయా గేమ్ పరంగా బాగా ఆడుతుందని.. కానీ మాట తీరు సరిగ్గా లేదని అన్నారు. ఆ తరువాత ఆరోహి, సూర్యలకు సంబంధించిన ఒక ఫొటోని స్క్రీన్ పై చూపించారు నాగార్జున. అది రొమాంటిక్ గా ఉండడంతో హౌస్ మేట్స్ అందరూ వారిద్దరి ఆడుకున్నారు.
❤ సోఫా వెనుక ఉన్న ఎనిమిది మంది ఆటతీరు ఇంప్రూవ్ అవ్వడం కోసం బిగ్ బాస్ నాగార్జునకు ఒక స్పెషల్ పవర్ ఇచ్చారు. హోస్ట్ నేరుగా ఇద్దరిని నామినేట్ చేయొచ్చు. దీంతో అర్జున్ కళ్యాణ్, కీర్తిలను నేరుగా నామినేట్ చేశారు నాగార్జున.