News
News
X

Bigg Boss Season 6: సెప్టెంబర్ 4 నుంచి బిగ్ బాస్ సీజన్ 6 - కొత్త ప్రోమో చూశారా?

ఈరోజు బిగ్ బాస్ సీజ్ 6కి సంబంధించి మరో కొత్త ప్రోమో వదిలారు. ఇందులో నాగార్జున 'హలో బ్రదర్' సినిమాలో డైలాగ్ చెబుతూ అలరించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.  

FOLLOW US: 

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు. 

ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6(Bigg Boss 6) కోసం సన్నాహాలు చేస్తున్నారు. రీసెంట్ గా షోకి సంబంధించిన లోగోను విడుదల చేస్తూ.. చిన్న వీడియో వదిలారు. మల్టిపుల్ కలర్స్ తో ఈ లోగోను డిజైన్ చేశారు. అలానే ఈ షోకి సంబంధించిన ప్రోమోని కూడా రిలీజ్ చేశారు. సెప్టెంబర్ 4 నుంచి ఈ షో మొదలవుతుందని వెల్లడించారు. ఈరోజు మరో కొత్త ప్రోమో వదిలారు. ఇందులో నాగార్జున 'హలో బ్రదర్' సినిమాలో డైలాగ్ చెబుతూ అలరించారు. ప్రస్తుతం ఈ ప్రోమో వైరల్ అవుతోంది.

సెప్టెంబర్ నుంచి వంద రోజుల పాటు ఈ షో సాగనుంది. షోకి వచ్చే క్రేజ్ ని బట్టి మరో వారం రోజులు పొడిగించే అవకాశాలు కూడా ఉన్నాయి. 17 లేదా 18 మంది కంటెస్టెంట్స్ ఈ షోలో కనిపించనున్నారు. గతంలో కామన్ మ్యాన్ కి ఈ షోలో అవకాశం దక్కింది. కొన్నాళ్లకు ఆ కాన్సెప్ట్ ను పక్కన పెట్టేశారు. కానీ ఇప్పుడు మరోసారి బిగ్ బాస్ షో కామన్ మ్యాన్ కనిపించబోతున్నారు. అలానే బుల్లితెరపై అలరిస్తోన్న కొందరు సెలబ్రిటీలను ఈ షో కోసం తీసుకురాబోతున్నారు. సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోన్న లిస్ట్ ప్రకారం.. యాంకర్ వర్షిణి, నటి నవ్యా స్వామి, యాంకర్ దీపిక పిల్లి, యాంకర్ ధన్షు, చిత్రారాయ్, ఆదిలను షో నిర్వాహకులు సంప్రదించినట్లు తెలుస్తోంది. 

Chalaki Chanti, Amardeep in Bigg Boss6: వీరితో పాటు సిరి బాయ్ ఫ్రెండ్ శ్రీహన్ వస్తున్నాడని సమాచారం. ఇక బుల్లితెర నటుడు అమర్ దీప్ కూడా రాబోతున్నారట. ఇటీవలే అతడు తన ప్రేయసి, సహనటి తేజస్వితో ఎంగేజ్మెంట్ జరుపుకున్నారు. మరిప్పుడు పెళ్లి వాయిదా వేసుకొని వస్తాడా..? లేదంటే త్వరగా పెళ్లి చేసుకొని బిగ్ బాస్ షోకి రెడీ అవుతారా..? అనేది చూడాలి. ప్రతి సీజన్ లో ఓ కమెడియన్ ఉన్నట్లే.. ఈసారి కూడా ఓ కమెడియన్ ను తీసుకురావాలనుకుంటున్నారు. 

అందులో భాగంగా చలాకీ చంటిని ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. బిగ్ బాస్ షోపై రివ్యూ ఇచ్చే వ్యక్తి ఆది రెడ్డిని కూడా తీసుకొస్తున్నట్లు టాక్. ఆదిరెడ్డితో పాటు గీతూరాయల్ కూడా రాబోతుంది. వీరితో పాటు బిగ్ బాస్ నాన్ స్టాప్ టాప్ 5 కంటెస్టెంట్స్ లో ఒకరిద్దరు బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించనున్నారు. యాంకర్ శివ, మిత్రాశర్మ, అనిల్ రాథోడ్ లాంటి కంటెస్టెంట్స్ బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించే ఛాన్స్ ఉంది. కింగ్ నాగార్జున ఈ షోని హోస్ట్ చేయబోతున్నారు. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారు.

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - ఆ బూతు డైలాగ్స్ కట్!

Also Read : 'లైగర్' సెన్సార్ రిపోర్ట్ - సినిమాలో పాటలు ఎన్ని? ఫైట్లు ఎన్ని?

Published at : 19 Aug 2022 03:30 PM (IST) Tags: nagarjuna Bigg Boss Bigg Boss 6 Bigg Boss 6 show Bigg Boss 6 new promo

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్

Bigg Boss 6 Telugu: నామినేషన్లో ఇనయా వయసుపై చర్చ, యాటిట్యూడ్ చూపించిన శ్రీహాన్

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: రేవంత్ వల్లే ఎలిమినేట్ అయ్యాను, దమ్మున్న కంటెస్టెంట్స్ వాళ్లే - నేహా కామెంట్స్!

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss 6 Telugu: ఇంట్లో ఎవరు గాడిద? ఎవరు పాము? ఎవరు ఊసరవెల్లి? ఇదిగో మీరే చూడండి

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss Telugu: గీతూను అంత మాట అనేసిన నాగార్జున, రేవంత్‌కు లైన్ క్లియర్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

Bigg Boss 6 Telugu: బాలాదిత్యకు నాగార్జున పంచ్, ఆ ఇద్దరినీ నేరుగా నామినేట్ చేసిన హోస్ట్ - శనివారం ఎపిసోడ్ హైలైట్స్!

టాప్ స్టోరీస్

Madhapur Crime: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

Madhapur Crime: ఉద్యోగాల పేరిట మోసం చేసిన వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగింత

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

Karthikeya 2 OTT Release: దసరా స్పెషల్ - ఓటీటీ రిలీజ్‌కు 'కార్తికేయ2' రెడీ!

CUET PG Result: సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

CUET PG Result:  సీయూఈటీ పీజీ ఫలితాలు వెల్లడి, రిజల్ట్ ఇలా చూసుకోండి!

Upcoming Movies: 'పొన్నియిన్ సెల్వన్', 'విక్రమ్ వేద' - ఈ వారం థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్!

Upcoming Movies: 'పొన్నియిన్ సెల్వన్', 'విక్రమ్ వేద' - ఈ వారం థియేట్రికల్, ఓటీటీ రిలీజెస్!