By: ABP Desam | Updated at : 04 Apr 2022 10:36 PM (IST)
ఈ వారం నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే?
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ ఇప్పటికే ఐదు వారాలను పూర్తి చేసుకుంది. ఐదో వారం ఎలిమినేషన్ లో ఊహించని విధంగా తేజస్విని ఇంటి నుంచి బయటకు పంపించేశారు. ఇక సోమవారం నాటి ఎపిసోడ్ లో నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. ముందుగా అరియనా మిత్రాశర్మను నామినేట్ చేస్తూ.. గేమ్ కాకుండా ఇంప్రెషన్ ఫామ్ చేయడం తనకు నచ్చలేదని చెప్పింది. ఆ తరువాత బిందుమాధవి తనను డబుల్ స్టాండర్డ్స్ అన్నందుకు నామినేట్ చేస్తూ.. ఏదైనా తను గేమ్ ఆడుతున్నానని చెప్పింది. ఈ క్రమంలో బిందుమాధవి, అరియనాలు వ్యంగ్యంగా మాట్లాడుకున్నారు. ఆ తరువాత అజయ్.. మహేష్, హమీదాలను నామినేట్ చేశాడు.
హమీద తనపై ఓ బ్లేమ్ వేసిందని.. అది బయటకు ఎలా వెళ్తుందోననే అనుమానం వ్యక్తం చేశాడు. దీంతో హమీద ఫైర్ అయింది. అసలు బయట గురించి ఎందుకు మాట్లాడుతున్నావ్ అంటూ గట్టిగా అరిచింది. ఆ తరువాత అషురెడ్డి ముందుగా మిత్రాశర్మను నామినేట్ చేసింది. అలానే హమీదను కూడా నామినేట్ చేసింది. ఈ సమయంలో ఇద్దరి మధ్య మాటల యుద్ధం జరిగింది. అనిల్ రాథోడ్.. నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేయడంతో ఆయన ఎప్పటిలానే వెటకారంగా నవ్వుతూ కామెంట్స్ చేశాడు. దీంతో అనిల్.. 'నువ్ ఎవడు బాయ్.. నువ్ నన్ను ఏం చేయలేవు' అంటూ అరిచాడు. ఆ తరువాత మిత్రాశర్మని నామినేట్ చేశాడు అనిల్.
స్రవంతి కూడా మిత్రాశర్మనే నామినేట్ చేసింది. ఆ తరువాత నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేసింది. ఇక మహేష్.. ముమైత్, మిత్రాశర్మలను నామినేట్ చేశాడు. హమీద.. తనను నామినేట్ చేసిన అషురెడ్డి, అజయ్ లను నామినేట్ చేసింది. ఇక నటరాజ్ మాస్టర్.. స్రవంతి తనపై పెర్సనల్ ఎటాకింగ్ చేస్తుందని, ఈ హౌస్ లో గేమ్ ఆడేవాళ్లే ఉండాలని కారణం చెప్పి నామినేట్ చేశాడు. అలానే బిందుని నామినేట్ చేశాడు. ఈ సమయంలో బిందు, నటరాజ్ మాస్టర్ గొడవపడ్డారు. యాంకర్ శివ.. మిత్రాను నామినేట్ చేయడంతో ఇద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది. మిత్రా గట్టిగట్టిగా అరుస్తూ రెచ్చిపోయింది. ఆ తరువాత మహేష్ విట్టాను నామినేట్ చేశాడు.
ముమైత్ ఖాన్.. మహేష్, మిత్రా శర్మలను నామినేట్ చేసింది. ఇక మిత్రాశర్మ.. మహేష్, శివలను నామినేట్ చేసింది. బిందు మాధవి.. నటరాజ్ మాస్టర్ ని నామినేట్ చేస్తూ.. అతడు మాట మీద నిలబడడం లేదని చెప్పింది. ఆ తరువాత అషురెడ్డిని నామినేట్ చేసింది. ఫైనల్ గా అఖిల్.. బిందు మాధవిని నామినేట్ చేస్తూ.. ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతుంటుందని చెప్పాడు. ఆ తరువాత మిత్రాశర్మని నామినేట్ చేశాడు.
ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి నామినేట్ అయిన కంటెస్టెంట్స్ ఎవరంటే.. మిత్రాశర్మ, నటరాజ్ మాస్టర్, మహేష్ , అషురెడ్డి, హమీద, బిందు, శివ, అజయ్, స్రవంతి, ముమైత్.
Also Read: నామినేషన్స్ హీట్ - అజయ్, అషులతో హమీద గొడవ
Which is hotter? The fire pit or the fire among the housemates? 🔥🔥
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) April 4, 2022
watch the fiery episode at 9PM exclusively on @DisneyPlusHS! #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/6YhchDy5Mz
Bigg Boss OTT Winner: బిగ్ ఓటీటీ ఫినాలే - గెలిచేదెవరు?
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ ఎలిమినేషన్ - టాప్ 7 కంటెస్టెంట్స్ ఎవరెవరంటే?
Bigg Boss OTT Telugu: ఆయన మాటలంటే నీ సంస్కారం ఏమైంది? బిందుని ప్రశ్నించిన నాగ్!
Bigg Boss OTT Telugu: నటరాజ్ మాస్టర్ తో అఖిల్ ఫైట్ - రచ్చ మాములుగా లేదు!
Anasuya In Bigg Boss: ‘బిగ్ బాస్’ హౌస్లోకి అనసూయ, పూర్తిగా చంద్రముఖిలా మారిపోయిన నటరాజ్ మాస్టర్!
Begumbazar Honour Killing : బేగంబజార్ పరువు హత్య కేసు, కర్ణాటకలో నలుగురు నిందితులు అరెస్టు
Pawan Kalyan : ఓట్లు చీలనివ్వకుండా బీజేపీని ఒప్పిస్తా, పొత్తులపై పవన్ క్లారిటీ
Love Horoscope 21 May :ఈ రాశి ప్రేమికులు శుభవార్త వింటారు, ప్రపోజ్ చేస్తారు
Rajiv Gandhi Death Anniversary : రాజీవ్ గాంధీ హత్యతో వైజాగ్ కు సంబంధం, ఆఖరి నిముషంలో విమానం రెడీ!