Bigg Boss OTT Telugu: అతడితోనే బెస్ట్ మెమొరీస్ - బిందు మాధవి కామెంట్స్
బిందు మాధవి తన లైఫ్ లో ఓ లవ్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చింది.
ఒకప్పుడు హీరోయిన్ గా సినిమాలు చేసిన బిందు మాధవి.. ఇప్పడు బిగ్ బాస్ ఓటీటీ తెలుగులో కంటెస్టెంట్ గా పాల్గొంది. నిన్న జరిగిన ఓ టాస్క్ లో భాగంగా కంటెస్టెంట్స్ అందరూ తమ ఫస్ట్ లవ్ గురించి మాట్లాడారు. ఈ క్రమంలో బిందు మాధవి కూడా తన లైఫ్ లో ఓ లవ్ స్టోరీ ఉందని చెప్పుకొచ్చింది. తన తండ్రితో కానీ.. ఫ్రెండ్స్ తో కానీ రోజూ బ్యాడ్మింటన్ ఆడడం బిందు మాధవికి అలవాటు. తనకొక స్కూటీ ఉండేదట.
దాని మీదే రోజు బ్యాడ్మింటన్ ఆడడానికి వెళ్లేదట. అక్కడ ఒక అబ్బాయి రోజూ తన స్కూటీ మీద ఒక ఫ్లవర్ కానీ.. ఒక చిన్న బొమ్మ కానీ.. లెటర్ కానీ ఇలా ఏదొకటి వదిలేసి వెళ్లేవాడట. మొదటిసారి అలాంటి అనుభూతి కలగడంతో.. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానని.. తను ఎవరో తెలియకపోయినా.. రోజు బ్యాడ్మింటన్ ఆడి వచ్చిన తర్వాత ఈరోజు ఏం పెట్టి ఉంటాడని ఆసక్తిగా చూసేదాన్ని అంటూ చెప్పుకొచ్చింది బిందు మాధవి.
అలా మొదలైన పరిచయం అతడిపై ఇష్టంగా మారిందని.. మొత్తానికి ఒకరోజు తనను కలిశానని చెప్పింది. అప్పటివరకు సినిమాల్లో, ఊహల్లో ఊహించుకునేవన్నీ అతడితో ఎక్స్‌పీరియన్స్ చేశానని తెలిపింది. అతడితో మంచి బాండింగ్ ఉండేదని.. కానీ ఫస్ట్ లవ్ స్టోరీస్ చాలా వరకు బ్రేకప్ తోనే ఎండ్ అవుతుంటాయని.. తన విషయంలో కూడా అలానే జరిగిందని చెప్పింది.
అయితే తన లవ్ స్టోరీలో మంచి విషయమేమిటంటే.. తను ఇండిపెండెంట్ గా ఉండాలని నేర్పించింది అతడేనని స్పష్టం చేసింది. ఇప్పుడు అతడు వేరే వాళ్లతో ఉండొచ్చు కానీ.. తనకైతే మంచి మెమొరీస్ మిగిలాయని నవ్వుతూ చెప్పింది బిందు మాధవి.
Also Read: మా అక్కా? నేనా? బాయ్ ఫ్రెండ్ తో లేచిపోయింది ఎవర్రా? - శివాత్మిక ఫైర్
Also Read: హీరోయిన్ ఇంట్లో చోరీ, కొట్టిన్నర విలువ చేసే నగలు - డబ్బు మాయం
View this post on Instagram