Bigg Boss OTT Telugu: అషు, అఖిల్ సేఫ్ - తండ్రిని తలచుకొని ఏడ్చేసిన అఖిల్
అషురెడ్డి, అఖిల్ లకు సేఫ్ అని వచ్చింది. అదే సమయంలో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు.
బిగ్ బాస్ ఓటీటీ తెలుగు వెర్షన్ మొదలై రెండు వారాలవుతోంది. మొదటి వారంలో ముమైత్ ఖాన్ ఎలిమినేట్ కాగా.. ఈ వారం ఎలిమినేట్ అవ్వడానికి మొత్తం పదకొండు మంది కంటెస్టెంట్స్ నామినేట్ అయ్యారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ కానున్నారో కాసేపట్లో తెలియనుంది. ఆదివారం నాడు ఎప్పటిలానే గ్రాండ్ ఎంట్రీ ఇచ్చేశారు నాగార్జున.
ముందుగా హౌస్ మేట్స్ లో కొంతమందికి క్లాస్ పీకారు నాగార్జున. ఆ తరువాత నామినేషన్ లో ఉన్న వారితో ఒక టాస్క్ ఆడించారు. ఇందులో అషురెడ్డి, అఖిల్ లకు సేఫ్ అని వచ్చింది. అదే సమయంలో అఖిల్ ఎమోషనల్ అయ్యాడు. ఎందుకు డల్ గా ఉంటున్నావని నాగార్జున అడగ్గా.. తన తండ్రి బాగా గుర్తొస్తున్నాడని చెప్పాడు అఖిల్. కొన్ని రోజుల క్రితమే అఖిల్ తండ్రికి బ్రెయిన్ స్ట్రోక్ రావడంతో మెమరీ కోల్పోయారట.
ఇప్పుడు అతడికి ఎలా ఉందోనని టెన్షన్ గా ఉందని చెప్పాడు అఖిల్. తన తండ్రి కోసం ఈ షోకి వచ్చానని.. నాల్గో సీజన్ లో కప్పు గెలిచి వస్తానని చెప్పానని.. కానీ గెలవలేదని అన్నాడు అఖిల్. ఈసారి తన తండ్రి కోసం కప్పు గెలుస్తానని చెప్పాడు.
ఆ తరువాత హౌస్ మేట్స్ తో ఓ గేమ్ ఆడించారు నాగార్జున. తమకు నచ్చినవాళ్లకి రెడ్ రోజ్ ఇవ్వాలని, నచ్చనివారికి బ్లాక్ రోజ్ ఇవ్వాలని చెప్పారు. ముందుగా బిందు.. రెడ్ రోజ్ అజయ్ కి, బ్లాక్ రోజ్ మిత్రాకి ఇచ్చింది. శివ.. బ్లాక్ రోజ్ నటరాజ్ మాస్టర్ కి, రెడ్ రోజ్ అషురెడ్డికి ఇచ్చాడు.
అరియానా.. రెడ్ రోజ్ అఖిల్ కి, బ్లాక్ రోజ్ మహేష్ కి ఇచ్చింది. ఆర్జే చైతు.. రెడ్ రోజ్ అనిల్ కి, మిత్రాకి బ్లాక్ రోజ్ ఇచ్చాడు. నటరాజ్ మాస్టర్.. తేజస్వికి రెడ్ రోజ్, బిందుకి బ్లాక్ రోజ్ ఇచ్చారు. శ్రీరాపాక.. శివకి రెడ్ రోజ్, మిత్రాకి బ్లాక్ రోజ్ ఇచ్చింది. అషురెడ్డి.. అఖిల్ కి రెడ్ రోజ్, బ్లాక్ రోజ్ శివకి ఇచ్చింది. మహేష్ విట్టా.. శివకి రెడ్ రోజ్, నటరాజ్ మాస్టర్ కి బ్లాక్ రోజ్ ఇచ్చాడు.
The countdown begins - 6pm is almost here! Who are safe? Who is eliminated?! All will be revealed!
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 13, 2022
Don't forget to tune in for #SundayFunday exclusively on @DisneyPlusHS#BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/IGI88vzPPZ