By: ABP Desam | Updated at : 10 May 2022 09:42 PM (IST)
ఈ వారం నామినేషన్స్ లో ఉన్నది ఎవరంటే?
బిగ్ బాస్ నాన్ స్టాప్ షోలో సోమవారం నాడు నామినేషన్స్ మొదలయ్యాయి. నిజానికి ప్రతివారం ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దరు హౌస్ మేట్స్ ని నామినేట్ చేసేవారు. అయితే ఈసారి ఒక్కొక్కరు ముగ్గురు చొప్పున నామినేట్ చేయాలని చెప్పారు బిగ్ బాస్. ఈ నామినేషన్ ప్రాసెస్ రెండు రోజులపాటు జరిగింది. ముందుగా బిందు మాధవి.. అఖిల్, నటరాజ్, మిత్రాలను నామినేట్ చేసింది. ఈ విషయంలో బిందు మాధవితో ఆ ముగ్గురికి గొడవ జరిగింది.
అరియనా.. మిత్రాశర్మ, అనిల్, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేసింది. ఈ క్రమంలో మిత్రాశర్మకి, అరియనాకి మధ్య మాటల యుద్ధం జరిగింది. అలానే నటరాజ్, అరియానాల మధ్య కాసేపు డిస్కషన్ జరిగింది. బాబా భాస్కర్, అరియనా, అఖిల్ లను నామినేట్ చేశాడు అనిల్. దీంతో వారు ముగ్గురూ అనిల్ తో ఆర్గ్యూ చేశారు.
మంగళవారం నాటి ఎపిసోడ్ లో నటరాజ్ మాస్టర్.. బిందు మాధవి, అరియనా, బాబా భాస్కర్ లను నామినేట్ చేశాడు. ఈ విషయంలో మళ్లీ బిందుకి, నటరాజ్ మాస్టర్ పెద్ద గొడవ జరిగింది. 'నెగటివిటీ కంప్లీట్‌గా ఉన్న ఓన్లీ వన్ పర్శన్ నువ్వు మాత్రమే' అని నటరాజ్ వ్యాఖ్యానించాడు. 'నీ సైడ్ నుంచి ఏమి వచ్చింది ఇన్ని రోజులు? పాజిటివిటీనా?' అని బిందు మాధవి ఎదురు ప్రశ్నించింది. 'ఇప్పటివరకు బిందు చేసినవన్నీ దొంగ నామినేషన్లే' అని కెమేరాల వైపు తిరిగి నటరాజ్ చెప్పాడు.
కెమెరాలకు ఎందుకు చెబుతున్నారని బిందు మాధవి అడిగితే.. 'నీ ఫేస్ చూడలేక కెమెరాలకు చెబుతున్నా. నీ కళ్లు ఎక్కడ బయటకు వచ్చేస్తాయో, నరాలన్నీ ఎక్కడ పగిలిపోతాయో అని భయమేసి.. నేను అటు చూస్తున్నా. శూర్పణక నీ టైమ్ ఆసన్నమైంది. ఇదిగో లక్ష్మణ బాణం. ఆడియన్స్ నీ ముక్కు కోస్తారు' అని నటరాజ్ కామెంట్ చేశారు. అఖిల్ కూడా బిందుని నామినేట్ చేయడంతో ఇద్దరూ చాలా సేపు వాదించుకున్నారు. బిందు బిహేవియర్ బాలేదని.. ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడుతుందని చెప్పుకొచ్చాడు. ఆ తరువాత అనిల్ రాథోడ్, యాంకర్ శివలను నామినేట్ చేశాడు.
యాంకర్ శివ.. మిత్రాశర్మను నామినేట్ చేయగా.. ఆమె అతడితో వాదించి వాదించి విసిగిపోయి.. ఐరన్ స్టాండ్ కి చేయి వేసి కొట్టుకుంది. దీంతో అఖిల్ పరిస్థితిని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాడు. ఆ తరువాత నటరాజ్ మాస్టర్, అఖిల్ లను నామినేట్ చేశాడు. బాబా భాస్కర్.. అనిల్, నటరాజ్ మాస్టర్, మిత్రాశర్మలను నామినేట్ చేశాడు. మిత్రాశర్మ.. అరియానా, యాంకర్ శివ, బాబా భాస్కర్ లను నామినేట్ చేసింది.
ఫైనల్ గా ఈ వారం హౌస్ మేట్స్ అందరూ నామినేషన్స్ లో ఉన్నట్లు బిగ్ బాస్ అనౌన్స్ చేశారు. ప్రస్తుతం హౌస్ లో ఎనిమిది కంటెస్టెంట్స్ (మిత్రా శర్మ, బాబా భాస్కర్, బిందు మాధవి, యాంకర్ శివ, అనిల్ రాథోడ్, నటరాజ్ మాష్టార్మ్ అరియనా, అఖిల్) ఉన్నారు. వీరంటూ ఇప్పుడు నామినేషన్స్ లో ఉన్నట్లే.
Also Read: 'మురారి' ప్లేస్‌లో 'మ మ మహేశా', ముందు 'కళావతి' నచ్చలేదు - మహేష్
"MIND YOUR LANGUAGE!"😡😡
— Disney+ Hotstar Telugu (@DisneyPlusHSTel) May 10, 2022
Breakdowns and Meltdowns in the Bigg Boss House! Watch the Bigg Boss Non-Stop episode at 9PM exclusively on @DisneyPlusHS #BiggBoss #BiggBossTelugu #BiggBossNonStop @EndemolShineIND pic.twitter.com/ae5oCxZTwh
Bigg Boss Telugu 7: దొంగలుగా మారిన ‘బిగ్ బాస్’ కంటెస్టెంట్లు - శోభాశెట్టి, యావర్ ఫైట్, చివాట్లు పెట్టిన పెద్దాయన!
Bigg Boss Captaincy Task: కన్నీళ్ళు పెట్టుకున్న యావర్, శోభా శెట్టి- కెప్టెన్సీ టాస్క్ లో అసలు ఏం జరిగింది?
Bigg Boss Season 7 Telugu: బిగ్ బాస్ 7లో మొదటి కెప్టెన్సీ టాస్క్ - శోభాశెట్టి చీటింగ్ గేమ్, శివాజీ ఫ్రస్ట్రేషన్
Bigg Boss: ‘బిగ్ బాస్’ విన్నర్పై ఆరోపణలు, ట్రోఫీ తిరిగి ఇచ్చేస్తానంటూ వీడియో
Subhasree: కచ్చితంగా తిడతారు, నేను చాలామందికి ఆ సలహా ఇవ్వను: శుభశ్రీ
Nandamuri Balakrishna: జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ - బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు
Smartphone: ప్రీమియం ఫోన్లపైకి మళ్లుతున్న భారత వినియోగదారులు - రూ.లక్ష దాటినా డోంట్ కేర్!
Constable Results: తెలంగాణ కానిస్టేబుల్ తుది ఫలితాలు విడుదల, ఇలా చెక్ చేసుకోండి
ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పిన కొరటాల - రెండు భాగాలుగా 'దేవర', రిలీజ్ ఎప్పుడంటే?
/body>