Bigg Boss OTT Telugu: నామినేషన్స్ లో పన్నెండు మంది, ఎలిమినేట్ అయ్యేదెవరో?
ఆదివారం నాడు జరిగిన ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. ఇక సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి.
బిగ్ బాస్ ఓటీటీ వెర్షన్ మూడో వారంలోకి ఎంటర్ అయింది. ఆదివారం నాడు జరిగిన ఎలిమినేషన్ లో శ్రీరాపాక బయటకొచ్చేసింది. ఇక సోమవారం నాడు నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. ఈ క్రమంలో హౌస్ మేట్స్ మధ్య వాదనలు గట్టిగానే జరిగాయి.
ఎవరెవరు ఎవరిని నామినేట్ చేశారంటే..?
- తేజస్వి - అరియనాను నామినేట్ చేస్తూ.. తన వెనుక గోతులు తవ్వుతుందని కామెంట్ చేసింది. అలానే బిందుని నామినేట్ చేసింది.
- ఆర్జే చైతు - తేజస్వి, మిత్రాలను నామినేట్ చేశాడు. తేజస్వి డామినేటెడ్ గా ఉంటుందని.. మిత్రాకి మంచి చెప్తున్నా తీసుకోలేకపోతుందని కారణాలు చెప్పాడు.
- మహేష్ విట్టా - అజయ్, నటరాజ్ మాస్టర్ లను నామినేట్ చేశాడు. తనకు సపోర్ట్ గా నిలుస్తారనుకున్న నటరాజ్ మాస్టర్ తనకు వరస్ట్ ట్యాగ్ ఇచ్చారంటూ ఫీల్ అయ్యాడు.
- అషురెడ్డి - మహేష్ విట్టా, మిత్రాలను నామినేట్ చేసింది.
- యాంకర్ శివ - నటరాజ్ మాస్టర్ తనను వెటకారంగా కామెంట్స్ చేస్తున్నారని అతడిని నామినేట్ చేశాడు. అలానే అఖిల్ ని నామినేట్ చేశాడు. ఈ విషయంలో అఖిల్, శివల మధ్య ఆర్గ్యుమెంట్ జరిగింది.
- హమీద - స్రవంతి, అజయ్ లను నామినేట్ చేసింది.
- అజయ్ - హమీద, మహేష్ విట్టాలను నామినేట్ చేశాడు.
- నటరాజ్ మాస్టర్ - శివని నామినేట్ చేస్తూ.. అతడికి నక్క, తొండ అని ట్యాగ్ లు ఇచ్చారు. బిందు మాధవి నామినేట్ చేశాడు
- సరయు - స్రవంతి, అజయ్ లను నామినేట్ చేసింది.
- అనిల్ - మహేష్ విట్టా, మిత్రాలను నామినేట్ చేశాడు. ఈ క్రమంలో మహేష్ తో అనిల్ కి చాలా పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది.
- అరియనా - తేజస్వి, మిత్రాలను నామినేట్ చేసింది.
- మిత్రా - శివ, ఆర్జే చైతులను నామినేట్ చేసింది.
- అఖిల్ - శివ, ఆర్జే చైతులను నామినేట్ చేశాడు. ఈ విషయంలో చైతుకి అఖిల్ మధ్య గొడవ జరిగింది.
ఈ వారం హౌస్ నుంచి బయటకు వెళ్లడానికి నామినేట్ అయిన సభ్యులు.. మిత్రా, శివ, చైతు, తేజస్వి, అజయ్, స్రవంతి, అఖిల్, మహేష్, హమీద, నటరాజ్, అరియానా, బిందు.
It's all RED in the house 💔🔫. Ee vaaram #BiggBoss house nunchi evaru nominate ayyaro teluskondi exclusively @DisneyPlusHS lo!#BiggBossTelugu #BiggBossNonStop@EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/0sLtGxEfFN
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 14, 2022
Atu 🥵 spicy moments ayithe inko vaipu teepi abhiprayalu 🥰! #BiggBoss intlo anni dorkutayi. Chudandi 9 PM ki #BiggBossNonStop @DisneyPlusHS lo!#BiggBossTelugu @EndemolShineIND @iamnagarjuna pic.twitter.com/69czIhXni3
— DisneyPlus Hotstar Telugu (@DisneyPlusHSTel) March 14, 2022