అన్వేషించండి

Bigg Boss: బిగ్ షాక్ - బిగ్‌బాస్ కంటెస్టెంట్‌పై పోలీస్ కేసు, ఆ కామెంట్సే కొంపముంచాయ్

బిగ్ బాస్‌ రియాలిటీ షోలో ఒక మాట జారే ముందు వందసార్లు ఆలోచించాలి. కానీ అలా ఆలోచించలేక ఒక కంటెస్టెంట్ కష్టాలపాలయ్యింది.

బిగ్ బాస్ అనే రియాలిటీ షోలో కంటెస్టెంట్స్ మాట్లాడే మాటల విషయంలో చాలా జాగ్రత్తలు వ్యవహరించాలి. 24 గంటలు వందల కెమెరాలు వారిని, వారు మాట్లాడే  మాటలను, వారి ప్రవర్తనే కవర్ చేస్తుంటాయి. అందుకే ప్రతీ విషయంలో కంటెస్టెంట్స్ ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. ఒకటికి పదిసార్లు చేసే ముందు ఆలోచించాలి. అలా జాగ్రత్త వ్యవహరించకుండా ఒక సామాజిక వర్గంపై కామెంట్స్ చేయడం వల్లే బిగ్ బాస్ కంటెస్టెంట్‌పై కేసు ఫైల్ అయ్యింది. భోవి అనే సామాజిక వర్గంపై కన్నడ బిగ్ బాస్‌లో నోరుపారేసుకున్నందుకు తనిషా కుప్పాండ అనే కంటెస్టెంట్‌పై కర్ణాటక పోలీసులు ఎఫ్‌ఐఆర్ ఫైల్ చేశారు. 

అట్రాసిటీస్ కేసు నమోదు

షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ (అట్రాసిటీస్) యాక్ట్‌పై తనిషా కుప్పాండపై కుంబల్గోడూ పోలీస్ స్టేషన్‌లో ఎఫ్‌ఐఆర్ ఫైల్ అయ్యింది. కుంబల్గోడూ అనే ప్రాంతం బెంగుళూరు సరిహద్దుల్లో ఉంటుంది. అఖిల కర్ణాటక భోవీ కమ్యూనిటీకి రాష్ట్ర ప్రెసిడెంట్ అయిన పీ పద్మ.. తనిషాపై కేసు పెట్టడానికి ముందుకొచ్చారు. తనిషా కుప్పాండతో పాటు కలర్స్ కన్నడ ఛానెల్‌ పేరు కూడా ఎఫ్‌ఐఆర్‌లో నమోదయ్యింది. నవంబర్ 8న టెలికాస్ట్ అయిన బిగ్ బాస్ కన్నడ ఎపిసోడ్‌లో మరొక కంటెస్టెంట్ అయిన ప్రతాప్ అలియాస్ డ్రోన్ ప్రతాప్‌ను ‘వడ్డా’ అని సంబోధించింది తనిషా. ఇదే విషయాన్ని పద్మ ఎఫ్‌ఐఆర్‌లో తెలిపారు.

భోవీ కమ్యూనిటీనే టార్గెట్

వడ్డా అనేది భోవీ కమ్యూనిటీలో ఒక భాగమే. అంటే ఇన్‌డైరెక్ట్‌గా సామాజిక వర్గాన్ని తనిషా దూషించిందని కొందరు ప్రేక్షకులు ఫీల్ అవుతున్నారు. అయితే ఇలా భోవీ కమ్యూనిటీపై బిగ్ బాస్ కన్నడలో ప్రస్తావన రావడం ఇది మొదటిసారి కాదు అని పద్మ అన్నారు. ముందు సీజన్‌లో సిహీ కహీ చంద్రూ అనే కంటెస్టెంట్ కూడా ఇలాంటి ఒక పదజాలాన్నే ఉపయోగించి ఆ తర్వాత క్షమాపణలు తెలిపాడని పద్మ గుర్తుచేసుకున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ కన్నడలో 10వ సీజన్ నడుస్తోంది. చాలావరకు ఈ సీజన్‌లో కాంట్రవర్సీల వల్ల ఫేమస్ అయిన సెలబ్రిటీలే ఉన్నారని ప్రేక్షకులు అనుకుంటున్నారు. లేదా షోలోకి వచ్చిన తర్వాత కంటెస్టెంట్స్ కాంట్రవర్సీ క్రియేట్ చేస్తున్నారని అంటున్నారు.

కన్నడతో పాటు తమిళ సినిమాల్లో..

ఇన్‌స్టాగ్రామ్‌లో యాక్టివ్‌గా ఉండే తనిషా కుప్పాండ.. పలు కన్నడ మాత్రమే కాకుండా తమిళ సినిమాల్లో కూడా చిన్న చిన్న పాత్రల్లో కనిపించింది. ఈ ఏడాది కూడా ‘సాండ్రితార్’ అనే తమిళ చిత్రంలో కనిపించింది తనిషా. అంతే కాకుండా ‘ఉండేనామా’ అనే కన్నడ చిత్రంలో కీలక పాత్రలో కనిపించింది. ఇంతలోనే తనకు బిగ్ బాస్ ఆఫర్ వచ్చింది. బిగ్ బాస్ రియాలిటీ షోలో ఇప్పటివరకు తన గ్లామర్‌తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న తనిషాపై అట్రాసిటీస్ కేసు ఫైల్ అవ్వడం అనేది బిగ్ బాస్‌లో తన జర్నీపై మాత్రమే కాకుండా తన సినీ కెరీర్‌పై కూడా ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉందని కన్నడ ప్రేక్షకులు భావిస్తున్నారు. ప్రస్తుతం బిగ్ బాస్ కన్నడలో ఒక కంటెస్టెంట్‌గా వ్యవహరిస్తున్న సంతోష్ అలియాస్ వార్తూర్ సంతోష్ కూడా తాజాగా జైలు నుండి తిరిగొచ్చి షోలో అడుగుపెట్టాడు.

Also Read: ‘బిగ్ బాస్’లో ఎవిక్షన్ ఫ్రీ పాస్ టాస్క్ - అర్జున్‌పై యావర్ పైచేయి, ఆ ఛాన్స్ కొట్టేసినట్లేనా?

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సంధ్య థియేటర్‌లో తొక్కిసలాట, మహిళ మృతినాగచైతన్య శోభితా వెడ్డింగ్ వీడియో వైరల్బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు అరెస్ట్ఎమ్మెల్యే కౌశిక్‌ రెడ్డిని అరెస్ట్ చేసిన పోలీసులు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Andhra Microsoft: అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
అమరావతి దగ్గర 25 ఎకరాల భూమి కొన్న మైక్రోసాఫ్ట్ - క్యాంపస్ పెట్టేస్తున్నారా ?
Pushpa 2 Stampede: సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
సంధ్య థియేటర్ వద్ద తొక్కిసలాట ఘటన - అల్లు అర్జున్ టీమ్‌పై కేసు నమోదు
Ycp MP Vijassai Reddy: కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
కేవీ రావు, చంద్రబాబుపై పరువునష్టం దావా వేస్తా - వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
Devendra Fadnavis: మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడణవీస్ - డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ శిందే, పవార్, కొలువుదీరిన కొత్త ప్రభుత్వం
PSLV C59: పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
పీఎస్ఎల్‌వీ సీ59 ప్రయోగం సక్సెస్ - నింగిలోకి దూసుకెళ్లిన రాకెట్, శాస్త్రవేత్తల సంబరాలు
Indiramma Illu APP: ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
ఏఐ టెక్నాలజీతో తెలంగాణలో ఇందిరమ్మ లబ్ధిదారుల ఎంపిక- మొదటి రెండు విడతల్లో వీళ్లకే ప్రాధాన్యత
Minsiter Gottipati Ravikumar: 'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
'ప్రజలపై భారం తగ్గించేలా విద్యుత్ కొనుగోళ్లు' - అధికారులకు మంత్రి గొట్టిపాటి రవికుమార్ కీలక ఆదేశాలు
Special Trains: శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
శబరిమల వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్ - మరో 28 ప్రత్యేక రైళ్లు, అడ్వాన్స్ బుకింగ్ ఎప్పటినుంచంటే?
Embed widget