Sivaji: శివాజీకి ఇద్దరు భార్యలు, ముగ్గురు పిల్లలా? మొదటిసారి నోరువిప్పిన బిగ్ బాస్ కంటెస్టెంట్
Bigg Boss Sivaji: బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా వచ్చిన శివాజీకి ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. అంతే కాకుండా తనకు ఒక కూతురు ఉందని, రెండో భార్య కూడా ఉందని వస్తున్న రూమర్స్‌పై శివాజీ స్పందించాడు.
Bigg Boss Sivaji Family: ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా, విలన్‌గా సినిమాలు చేశాడు శివాజీ. కానీ ఈ నటుడి పర్సనల్ లైఫ్ గురించి ప్రేక్షకులకు పెద్దగా తెలియదు. ఇక తను నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అవ్వడంతో కొన్నాళ్ల ఇండస్ట్రీకి దూరంగా కూడా ఉన్నాడు శివాజీ. ఇక అనుకోకుండా బిగ్ బాస్ రియాలిటీ షోలో కంటెస్టెంట్‌గా వచ్చి షాకిచ్చాడు. ఈ షోలో కంటెస్టెంట్‌గా వచ్చిన తర్వాత శివాజీ పర్సనల్ లైఫ్‌పై కూడా ఫోకస్ పెట్టారు ఆడియన్స్. తాజాగా ఆర్టిస్ట్, బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సమీర్.. శివాజీ పర్సనల్ లైఫ్ గురించి పలు షాకింగ్ విషయాలు బయటపెట్టాడు. వాటిపై శివాజీ ఘాటుగా స్పందించాడు.
దత్తత ఇచ్చాడేమో..
శివాజీకి ఇద్దరు కొడుకులు ఉన్న విషయం తెలిసిందే. అయితే కొడుకులతో పాటు తనకు ఒక కూతురు కూడా ఉందని బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సమీర్ ఓపెన్‌గా వ్యాఖ్యలు చేశాడు. ఇది విన్న ప్రేక్షకులు.. ఒకవేళ శివాజీకి రెండో భార్య ఉందేమో అంటే సోషల్ మీడియాలో చర్చలు మొదలుపెట్టారు. ఇక సమీర్ చేసిన వ్యాఖ్యలపై శివాజీ స్పందించాడు. సమీర్.. తనకు ఎవరినైనా దత్తత ఇచ్చాడేమో అని వ్యంగ్యంగా సమాధానమిచ్చాడు శివాజీ. సమీర్.. తనకు మొదటి నుంచి తెలిసిన వ్యక్తి కాదని, తనతో అంత క్లోజ్ కూడా కాదని బయటపెట్టాడు. తమ ఇద్దరి మధ్య కేవలం హాయ్, బై అనే రిలేషన్ మాత్రమే ఉందని చెప్పుకొచ్చాడు.
కలిసినప్పుడు అదే పని చేస్తా..
సమీర్ కుటుంబం గురించి తనకు, తన కుటుంబం గురించి సమీర్‌కు అంతగా తెలియదని శివాజీ తెలిపాడు. ఆయనతో అలా ఎవరైనా అని ఉండవచ్చని, అందుకే ఆయన అలాంటి స్టేట్‌మెంట్ ఇచ్చాడని అన్నాడు. ‘‘ఈసారి నాకు సమీర్ కలిసినప్పుడు ఫ్యామిలీ వివరాలు అన్ని చూపిస్తాను. అతనికి ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారు. అంతే కానీ నాకు కూతురు ఉంది అనేది నిజం కాదు. నాకు కూతురు ఉందని మాత్రమే కాదు.. ఇంకా చాలా మాట్లాడుకొని కూడా ఉండొచ్చు. నాకు మొదటి నుంచి జరిగేది ఇదే. నేనేంటో తెలియకుండా కామెంట్స్ చేస్తారు. వాళ్లది తప్పని నేను అనడం లేదు. నేనేంటో తెలియకుండానే అలాంటి కామెంట్స్ అన్నీ చేస్తుంటారు’’ అంటూ శివాజీ వాపోయాడు.
యూట్యూబ్‌లో అలాంటి థంబ్‌నెయిల్స్..
బిగ్ బాస్ హౌజ్‌లో కంటెస్టెంట్‌గా ఉన్న సమయంలో తనకు కాఫీ అంటే చాలా ఇష్టమని శివాజీ.. పలుమార్లు బయటపెట్టాడు. అంతే కాకుండా ఒకానొక సందర్భంలో తనకు కాఫీనే రెండో భార్య అని కూడా స్టేట్‌మెంట్ ఇచ్చాడు. దీంతో ఆ స్టేట్‌మెంట్‌ను పట్టుకొని యూట్యూబ్‌లో చాలా థంబ్‌నెయిల్స్ క్రియేట్ అయ్యాయని శివాజీ చెప్పుకొచ్చాడు. ‘శివాజీ రెండో భార్యను మీరు చూశారా’ అనే టైటిల్‌తో థంబ్‌నెయిల్‌ను క్రియేట్ చేసి, ఆ వీడియో ఓపెన్ చేసి చూస్తే చివర్లో కాఫీ చూపిస్తున్నారని అన్నాడు. ఇక బిగ్ బాస్‌లో కంటెస్టెంట్‌గా పాపులారిటీ సంపాదించుకున్న శివాజీ.. బయటికి వచ్చిన తర్వాత తను లీడ్ రోల్ చేసిన #90s అనే వెబ్ సిరీస్ విడుదలయ్యింది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా.. ఈ సిరీస్ గురించే చర్చలు నడుస్తున్నాయి. యంగ్ డైరెక్టర్ ఆదిత్య హాసన్.. ఈ సిరీస్‌ను బాగా హ్యాండిల్ చేశాడని చూసినవారంతా ప్రశంసిస్తున్నారు.
Also Read: రికార్డ్ స్థాయిలో ‘దేవర’ ఓటీటీ రైట్స్, మునుపెన్నడూ లేనంతగా!