అన్వేషించండి

Actress Divi: నా కళ్ల ముందే ఆ చావు చూశా - అప్పుడే సినిమాల్లోకి రావాలి అనుకున్నా: దివి

Divi: బిగ్ బాస్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముద్దుగుమ్మ దివి.. వరుస సినిమాలతో సత్తా చాటుతోంది. తాజాగా ఆమె హీరోయిన్ గా నటించిన ‘లంబసింగి‘ చిత్రం ప్రేక్షకులు ముందుకు వచ్చింది.

Actress Divi About Emotional incident: తెలుగు రియాలిటీ షో బిగ్ బాస్ ద్వారా బాగా పాపులర్ అయ్యింది అచ్చ తెలుగు అమ్మాయి దివి. ఆ తర్వాత సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టింది. వచ్చిన అవకాశాలను చక్కగా వినియోగించుకుంటోంది. హీరోయిన్ గా, సహాయ నటిగా సత్తా చాటుతోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ హీరోయిన్ గా నటించిన ‘లంబసింగి‘ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్చి 15న థియేటర్లలో విడుదలైంది. ఈ చిత్రంలో భరత్ రాజ్ హీరోగా నటించాడు. నవీన్ గాంధీ దర్శకత్వం వహించారు. ఈ చిత్రాన్ని కాన్సెప్ట్ ఫిల్మ్ బ్యానర్ పై ఆనందర్ తన్నీరు, దర్శకుడు కల్యాణ్ రామ్ నిర్మించారు. తొలి షో నుంచే ఈ మూవీ మంచి టాక్ సంపాదించుకుంది. దివి నటన, దర్శకుడు కథ నడిపిన విధానంపై ప్రశంసలు దక్కుతున్నాయి.

ఆ చావుతో హీరోయిన్ కావాలి అనుకున్నాను- దివి

ఇక ‘లంబసింగి‘ సినిమా ప్రమోషన్ లో భాగంగా దివి వరుస ఇంటర్వ్యూలు ఇస్తోంది. ఇందులో భాగంగా తన కెరీర్ తో పాటు పలు వ్యక్తిగత విషయాలను వెల్లడిస్తోంది. తాను నటిగా మారడానికి ఓ బలమైన కారణం ఉందని వెల్లడించింది. తనకు నచ్చిన వ్యక్తి కళ్ల ముందే చనిపోవడంతో సినిమాల్లోకి రావాలనే నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. “నేను సినిమాల్లోకి రాక ముందు ఓ అబ్బాయిని ఇష్టపడ్డాను. కొద్ది రోజుల్లోనే ఇద్దరం ప్రేమలో పడ్డాం. మేం ఇద్దరం లవ్ లో ఉన్నాం అనే విషయం మా ఇద్దరి ఇళ్లలో కూడా తెలుసు. నా బాయ్ ఫ్రెండ్ కు ఓ తమ్ముడు ఉన్నాడు. అతడు నాతో చాలా ఫ్రెండ్లీగా ఉండేవాడు. ఇద్దరం బాగా అల్లరి చేసే వాళ్లం. చిన్న పిల్లల మాదిరిగా ఉండేవాళ్లం. కానీ, తను అనుకోకుండా చనిపోయాడు. నా కళ్ల ముందు ప్రాణాలు విడిచాడు. ఆ ఘటనను చూసి తట్టుకోలేకపోయాను. అప్పుడే సినిమాల్లోకి రావాలని అనుకున్నాను. ఏమీ సాధించకుండా చనిపోకూడదు అనుకున్నాను. నటిగా రాణించాలనే ఆలోచన వచ్చింది. అనుకున్నట్లుగానే సినిమాల్లోకి వచ్చాను. ఆ తర్వాత నేను ప్రేమించిన అబ్బాయితో లవ్ ముందుకు సాగలేదు. అతడు పెళ్లి చేసుకున్నాడు. ప్రస్తుతం హ్యాపీగా ఉన్నాడు. ఇద్దరం విడిపోయాక, మళ్లీ కొంత మంది దగ్గరైనా నాకు సెట్ కారని అర్థం అయ్యింది. చాలా మంది స్వార్థంతోనే బతుకుతున్నారు. నేను అనుకున్న లక్షణాలు ఉన్న అబ్బాయి దొరకలేదు” అని దివి వెల్లడించింది.   

రాత్రికి రాత్రే నన్ను సినిమా నుంచి తొలగించారు- దివి

ఇక సినిమా పరిశ్రమలోకి అడుగు పెట్టిన తొలినాళ్లలో అవకాశాల కోసం చాలా కష్టపడాల్సి వచ్చిందని దివి వెల్లడించింది. ఆఫర్ల కోసం ఎన్నో ఆఫీసుల చుట్టు తిరిగినట్లు తెలిపింది. ఎన్నో ఆడిషన్స్ ఇచ్చినా, అవకాశం ఇస్తామని ఇవ్వలేదని చెప్పింది. కొంత మంది ముఖం మీదే నువ్వు సినిమాలకు పనికి రావు అని చెప్పారని ఆవేదన వ్యక్తం చేసింది. సినిమాల్లో అవకాశాల కోసం ఇంత కష్టపడాలా? అని ఎన్నోసార్లు ఏడ్చానని చెప్పుకొచ్చింది. కొన్ని సినిమాల్లో సెలెక్ట్ చేసి, రాత్రికి రాత్రే మార్చిన సంఘటనలూ ఉన్నాయని తెలిపింది. రవితేజ సినిమాలో అవకాశం వచ్చిందని, మరో 5 రోజుల్లో షూటింగ్ ఉందనగా తన స్థానంలో మరొకరిని తీసుకున్నారని దివి ఆవేదన వ్యక్తం చేసింది.   

Read Also: రాజకీయాలు, భక్తి వ్యాపారాలు, ప్రేమలు - చిన్న సినిమా పాటలో పెద్ద సెటైర్ వేసిన చంద్రబోస్!

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

సప్తవర్ణ శోభితం, శ్రీపద్మావతి అమ్మవారి పుష్పయాగంఅడిలైడ్ టెస్ట్‌లో ఓటమి దిశగా భారత్బాత్‌రూమ్‌లో యాసిడ్ పడి విద్యార్థులకు అస్వస్థతఏపీలో వాట్సప్ గవర్నెన్స్, ఏందుకో చెప్పిన చంద్రబాబు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Ind Vs Aus 2nd Test: గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
గులాబీ గుచ్చుకుంది- అడిలైడ్ టెస్టులో భారత్ ఘోర పరాజయం, సిరీస్ సమం చేసిన ఆసీస్
Pawan Kalyan: అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
అల్లు అర్జున్ భుజాలపై గన్ పెట్టి, పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ!
Telangana Mother Statue: కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
కేసీఆర్ వ్యూహాత్మక తప్పిదం - రేవంత్ రాజకీయం - తెలంగాణ తల్లి విగ్రహంతో మార్కులు కొట్టేశారా?
Palnadu Road Accident: దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
దైవ దర్శనానికి వెళ్లొస్తుంటే తీవ్ర విషాదం- చెట్టును ఢీకొన్న కారు, నలుగురి దుర్మరణం
Rohini: విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
విష్ణుప్రియకు అతనితో కనెక్షన్ ఉందని... కన్ఫర్మ్ చేసిన రోహిణి - బిగ్ బాస్ 8 ఎగ్జిట్ ఇంటర్వ్యూ
Andhra Politics: టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
టీడీపీలో చేరికల సైడ్ ఎఫెక్టులు - వైసీపీని ఖాళీ చేయాలనుకు నిపార్టీలో చిచ్చు పెట్టుకుంటున్నారా ?
Natwar Lal: తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
తాజ్‌మహల్‌నే మూడుసార్లు అమ్మేసిన కేటుగాడు - నట్వర్ లాల్ గురించి విన్నారా?
Telugu TV Movies Today: ‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
‘ఆర్ఆర్ఆర్’, ‘పుష్ప’ to చిరంజీవి ‘ఇంద్ర’, ‘గాడ్ ఫాదర్’, ‘వినయ విధేయ రామ’ వరకు - ఈ ఆదివారం (డిసెంబర్ 8) టీవీల్లో అదిరిపోయే సినిమాలు
Embed widget