Bigg Boss 9 Telugu: బిగ్‌బాస్ డే 22 రివ్యూ... సంజన పోపు ఘాటుకు తనూజ అవుట్... డెమాన్‌ను అంతమాట అనేసిందేంటి? కూల్‌గా ఇచ్చిపడేసిన మాస్క్ మ్యాన్
Bigg Boss 9 Telugu Today Episode - Day 22 Review : ఇమ్యూనిటీ టాస్క్ లో ఈరోజు హౌస్ మేట్స్ కొత్త స్ట్రాటజీని ప్లే చేయడంతో పాటు గొడవలతో రచ్చ రచ్చ చేశారు. నేటి ఎపిసోడ్ విశేషాలు ఇవే.

బిగ్ బాస్ హౌజ్ లో దసరా సంబరాలు అలా పూర్తయ్యాయో లేదో ఇలా నామినేషన్ల రచ్చ మొదలైంది. 22వ రోజు, 23వ ఎపిసోడ్లో దివ్య వస్తువులు దొంగతనం చేసినందుకు పనిష్మెంట్ ఇస్తానని అన్నాడు కెప్టెన్ డెమాన్ పవన్. కానీ జైలుకు వెళ్లడానికి హౌస్ మేట్స్ ఒప్పుకోలేదు. అందులోనూ సంజన వాదించింది. "అతను అమ్మాయిల కేటగిరి, నేను అమ్మను కదా... అందుకే నాకు, నీకు సపోర్ట్ చేయట్లేదు" అంటూ ఫ్లోరాకు నూరి పోయింది. అలాగే "సంజనకు ఫ్లోరా బానిసలా మారింది" అంటూ డిస్కషన్ పెట్టుకున్నారు తనూజ, రీతూ, హరీష్. మరోవైపు ఇమ్మాన్యుయేల్, సంజన కలిసి డెమాన్ పై కారాలు మిరియాలు నూరారు.
సంజన పోపు... తనూజకు ఘాటు
సంజన వెల్లుల్లి కారం కావాలని అడగడంతో దివ్య, డెమాన్ ఒప్పుకోలేదు. ఫుడ్ మానిటర్ తనూజను పర్మిషన్ అడిగినప్పటికీ వాళ్ళు నో చెప్పడంతో సంజన మళ్ళీ మొదలెట్టింది. "నా ప్లేస్ కి వచ్చి వాయిస్ రైజ్ చేయొద్దు" అంటూ తనూజ ఫైర్ అయ్యింది. దీంతో "పర్మిషన్ అడిగినా కూడా తినడానికి భిక్ష అడగాలా" అంటూ కన్నీళ్లు పెట్టుకుంది సంజన. హీరో విలన్ కొట్టుకుని మధ్యలో కమెడియన్ ను బలి చేసినట్టు... సంజన "బిగ్ బాస్ కంటే ఎక్కువగా ఫీల్ అయ్యి జైళ్లో వేస్తానని అరుస్తావ్. కానీ పోపు విషయంలో మాత్రం మాట్లాడలేవు. ఎలాంటి కెప్టెన్ నువ్వు? నేను ఫుడ్ తినను" అంటూ నిరాహార దీక్ష మొదలెట్టింది.
నోరూ పారేసుకున్న సంజన
భరణి, డెమాన్, శ్రీజ... సంజనను కూల్ చేసే ప్రయత్నం చేశారు. హరీష్ "పక్కలో బల్లెం" అంటూనే ఒంటరిగా బాధ పడుతున్న సంజనాతో "మీకు నేనున్నాను, మాట్లాడాలి అనిపిస్తే మాట్లాడొచ్చు" అంటూ ఓదార్చే ప్రయత్నం చేశాడు. "బయట ఆ అమ్మాయికి ఫుడ్ పెట్టొద్దు అంటూ కెప్టెన్ అరిచాడు" అంటూ మళ్ళీ కుళాయి తిప్పేసింది సంజన. ఇమ్మాన్యుయేల్ మాత్రం "అమ్మ టెనెంట్స్ తోనే తింటుంది. కాబట్టి వాళ్ళకి చికెన్ పంపండి" అని బిగ్ బాస్ ను రిక్వెస్ట్ చేశాడు. కెప్టెన్ డెమాన్ తన కామెంట్స్ కు బాధపడిన సంజనకు వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. కానీ సంజన మాత్రం "నేను ఓనర్ని. శ్రీజ, తనూజ, రీతూ.అడిగి ఉంటే ఓకే చెప్పేవాడివి. నేను అడిగాను కాబట్టే అలా చేస్తున్నారు" అని మాటల తూటాలు పేల్చింది. ఫ్లోరా, సంజన కలిసి డెమాన్ పై అటాక్ చేశారు. "మీకు అమ్మాయిలే కన్పిస్తారు. కానీ నేను మమ్మీని కాబట్టి కనిపించట్లేదు" అంటూ నోరు పారేసుకుంది సంజన.
ఇమ్యూనిటీ టాస్క్ గెలిచిన సుమన్, తనూజ
నామినేషన్ నుంచి సేవ్ అవ్వడానికి "ఇమ్యూనిటీ స్టార్" టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో రెండు లెవెల్స్ ఉండగా, మొదటి రౌండ్ లో సుమన్ - దివ్య టీం మాత్రమే గెలిచింది. కళ్యాణ్ - రీతూ, భరణి - తనూజ, హరీష్ - ఫ్లోరా, శ్రీజ - రాము టీమ్స్ ఫౌల్ చేయడంతో డిస్క్వాలిఫై చేశారు సంచాలకే డెమాన్ పవన్. ఫస్ట్ రౌండ్ లో గెలిచిన దివ్య, సుమన్ కు రెండో లెవెల్ లో ఆడే వారిని సెలెక్ట్ చేసుకోవాలని ఆదేశించారు. ఈ ఇండివిడ్యూవల్ టాస్క్ లో ఫ్లోరా, తనూజను సెలెక్ట్ చేశారు వాళ్ళు. "వారధి కట్టు ఇమ్యూనిటీ పట్టు" అనే ఈ టాస్క్ లో ఇతర ఇంటి సభ్యుల సపోర్ట్ తో తనూజ, సుమన్ శెట్టి ఇమ్యూనిటీని గెలుచుకున్నారు.
సంజనకు మాస్క్ మ్యాన్ కౌంటర్
"4 రోజులైంది స్నానం చేసి... అతని దగ్గరకు వెళ్లాలంటేనే చచ్చాము. అలాగే ఫుడ్ వండాడు" అంటూ హరీష్ ను అసహ్యించుకున్న సంజన... మళ్ళీ ఇప్పుడు స్వయంగా హరీష్ ను వండమని అడిగింది. కానీ ఆయన మాత్రం "స్నానం చేసి 10 రోజులు అయ్యింది పర్లేదా ?" అంటూ కూల్ గా ఇచ్చి పడేశాడు. పైగా ఒళ్ళంతా స్ప్రే చేసుకున్నాడు. ఇక "తనూజ, దివ్య, డెమాన్ వండితే తినను" అంటూ మళ్ళీ సంజన రచ్చ మొదలు పెట్టడంతో... ఆ కష్టాలు ఎలా ఉంటాయో తెలియాలి అంటూ ఆమెకే కుకింగ్ మానిటర్ పోస్ట్ ఇచ్చేశారు.





















