Bigg Boss 9 Telugu : రీతూని సేవ్ చేయడానికి బిగ్ బాస్ మాస్టర్ ప్లాన్ ? ఛాన్స్ తన్నుకుపోయిన ఫ్లోరా... గేమ్ ఛేంజర్ శ్రీజ... తుస్సుమన్పించిన భరణి సీక్రెట్
Bigg Boss 9 Telugu Today Episode - Day 17 Review : బిగ్ బాస్ సీజన్ 9 ఎపిసోడ్ 18లో టాస్కులో దుమ్మురేపారు కంటెస్టెంట్స్ శ్రీజ, ఫ్లోరా. రీతూని సేవ్ చేయడానికి బిగ్ బాస్ చేసిన ప్రయత్నం బెడిసి కొట్టింది.

బిగ్ బాస్ హౌస్ లో మంగళవారం నుంచి ఎమోషనల్ ఎపిసోడ్ నడుస్తున్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే బిగ్ బాస్ ఇచ్చిన యాపిల్ టాస్క్ లో బ్లూ సీడ్ వచ్చిన వారికి బజర్ మోగించే టాస్క్ పెట్టి, ఒక్కొక్కరికి ఇంటి నుంచి వచ్చిన సందేశాన్ని అందిస్తున్నారు బిగ్ బాస్. కానీ దాన్ని అందుకోవాలంటే హౌస్ మేట్స్ మూల్యం చెల్లించాలి అంటూ బ్యాటరీని డౌన్ చేస్తూ వస్తున్నారు. అలా బజర్ మోగించి, 25% బ్యాటరీని తగ్గిస్తూ, ఇమ్మాన్యుయేల్ ఇంటి నుంచి ఫ్యామిలీ ఫోటోను అందుకున్న సంగతి తెలిసిందే. తాజా ఎపిసోడ్ లో తనూజ బజర్ మోగించి, మూడు ఆప్షన్స్ లో 25 శాతం బ్యాటరీని ఉపయోగించుకుని చెల్లి, మేనకోడలు రాసిన లెటర్ ను అందుకుంది.
సింపతీ గేమ్ మొదలెట్టిన సంజన
నెక్స్ట్ సంజన, ప్రియా, సుమన్ టాస్క్ లో మిగలగా, బజర్ విషయంలో కన్ఫ్యూజన్ మొదలైంది. ముందుగా సంజన హ్యాండ్ పెట్టింది, కానీ ప్రియా బజర్ మోగించింది. శ్రీజ ముందు సంజన పేరు చెప్పి, తరువాత ప్రియానే బజర్ కొట్టింది అంటూ ఫ్లిప్ అయ్యింది. దీంతో ప్రియా తనకు ఈ ఛాన్స్ తీసుకోవడం ఇష్టం లేదని చెప్పేసింది. కానీ శ్రీజ మొండి పట్టుదలతో ప్రియాకి ఇస్తానని చెప్పింది. చివరకి ప్రియా కన్ఫెషన్ రూమ్ లోకి వెళ్ళి 40 పర్సెంట్ బ్యాటరీతో తల్లి లెటర్ తీసుకుంది. అంతలోనే కిచెన్ లో రచ్చ మొదలైంది. కిచెన్ లో సంజన కావాలనే వాటర్ బాటిల్ పెట్టారు అంటూ హరీష్ ఫైర్ అవ్వడం వివాదానికి దారి తీసింది.
ఈ గ్యాప్ లో సంజన సింపతీ గేమ్ మొదలు పెట్టింది. సుమన్ ఆ ఛాన్స్ ఆమెకే ఇస్తానని చెప్పినా కూడా సంజన కావాలనే బజర్ మోగించలేదు. కానీ బ్యాటరీ తక్కువగా ఉండడంతో భరణి సీక్రెట్ బాక్స్ ను ఓపెన్ చేసేలా చేస్తేనే, సుమన్ కు ఇంటి నుంచి వచ్చిన మెసేజ్ అందుకోవచ్చు అని చెప్పారు. మరో ఆప్షన్ ఇవ్వకపోవడంతో సుమన్ విషయాన్నీ భరణికి చెప్పి రిక్వెస్ట్ చేశారు. అయితే సంజన ఈ విషయంలో కన్విన్స్ చేయడంతో భరణి తన లాకెట్ ఓపెన్ చేశాడు. "ఫ్యామిలీ వీక్ లో దాన్ని ఓపెన్ చేద్దామని అనుకున్నా. వీళ్ళిద్దరికీ మాట ఇచ్చాను అందుకే వాయిస్ రైజ్ చేయట్లే. వాళ్ళిద్దరూ కొత్త జీవితాన్ని ఇచ్చారు. ఇందులో అమ్మా, గురువు ఉన్నారు. ఇదే మంచి అకేషన్ అని ఫీల్ అవుతున్నా" అని చెప్పారు. సంజనకు కూడా అవకాశం రావాలని సుమన్ శెట్టి 10 శాతం బ్యాటరీ మిగిలేలా ఫ్యామిలీ ఫోటో ఆప్షన్ తీసుకున్నారు. కానీ సుమన్ తో పర్లేదు అని చెప్పిన సంజన... పక్కకెళ్లి తనకు ముందే ఛాన్స్ ఇస్తానని చెప్పి సుమన్ బజర్ కొట్టాడని, తాను హౌజ్ లో ఒంటరిని అయిపోయానని బాధ పడుతూ సింపతీ గేమ్ స్టార్ట్ చేసింది. అయితే ఆమెకు ఎలాగైనా బిగ్ బాస్ ఛాన్స్ ఇస్తారనే ధీమాతోనే సంజన ఆ నిర్ణయం తీసుకున్నట్టుగా కన్పిస్తోంది.
రీతూని సేవ్ చేసే ప్రయత్నం
చివరగా యాపిల్ లో బ్లాక్ సీడ్స్ వచ్చిన ఫ్లోరా, రీతు చౌదరి, శ్రీజలకు బాస్కెట్ లో బాల్ అనే టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో విన్ అయితే నామినేషన్ నుంచి సేవ్ అయ్యే ఇమ్యూనిటీ పవర్ ను పొందొచ్చు అని బిగ్ బాస్ వెల్లడించారు. ఇందులో ఆశ్చర్యకరంగా శ్రీజ గేమ్ ఛేంజర్ గా మారగా, ఫ్లోరా విన్ అయ్యింది. సంజనా సంచాలకే గా వ్యవహరించింది. శ్రీజ, రీతూ ఈ టాస్క్ లో కుస్తీ పడి దుమ్మురేపారు. కానీ వాళ్ళిద్దరూ కాకుండా ఇందులో గెలిచి, ఇమ్యూనిటీ సాధించిన ఫ్లోరా ఈ వారం నామినేషన్ నుంచి సేవ్ అయ్యింది. అయితే బయట ఫ్లోరా ఓటింగ్ పరంగా టాప్ లో ఉంది. శ్రీజ అసలు నామినేషన్స్ లో లేనే లేదు. దీంతో ఈ ఇమ్యూనిటీ టాస్క్ ను రీతూని సేవ్ చేయడానికి బిగ్ బాస్ ప్లాన్ చేసినట్టు కన్పించింది.





















