Bigg Boss 9 Telugu : బిగ్‌బాస్ డే 101 రివ్యూ... తనూజాకు తగ్గ వరుడు అతడే - ఏవీని చూసి ఎమోషనల్ అయిన ఇమ్మానుయేల్... సంజనా సిస్టర్ స్ట్రాంగ్ వార్నింగ్
Bigg Boss 9 Telugu Today Episode - Day 101 Review : బిగ్ బాస్ సీజన్ 9 డే 101 ఎపిసోడ్ లో టాస్క్ పెట్టడంతో పాటు ఇమ్మానుయేల్ జ్యోతిష్యుడిగా మారాడు. అలాగే ఇమ్మూ ఏవీని వేశారు బిగ్ బాస్.

100వ రోజు నన్ను లాస్ట్ టాస్క్ లో తనకు సపోర్ట్ చేయమని డెమోన్ తో డీల్ కుదుర్చుకుంది సంజన. వన్స్ మోర్ వన్ లాస్ట్ టైమ్ అంటూ 'తప్పిస్తే గెలుస్తారు' అనే టాస్క్ ఇచ్చారు. ఇతర ఇంటి సభ్యులు విసిరే బాల్స్ నుంచి తమ వెల్ క్రో జాకెట్ కు అతుక్కోకుండా చూసుకోవాలి. ఈ టాస్క్ లో అందరూ తననే టార్గెట్ చేయడంతో సంజన సేఫ్ ఆడిందని డెమోన్ సీరియస్ అయ్యాడు. డెమోన్, తనూజా, ఇమ్మూ, సంజన వరుసగా టాస్క్ నుంచి తప్పుకోగా, కళ్యాణ్ విన్ అయ్యాడు. ఈ టాస్క్ విన్నర్ కళ్యాణ్ కు ట్రీట్ గా బిగ్ బాస్ డెజర్ట్ పంపాడు.
ఇమ్మూ జ్యోతిష్యం - పడి పడి నవ్విన హౌస్ మేట్స్
101 వ రోజు "ఇమ్మాన్యుయేల్ మీరు జ్యోతిష్యుడిగా మారి ఇంటి సభ్యులకు జ్యోతిష్యం చెప్పాల్సి ఉంటుంది" అంటూ ఫన్ టాస్క్ పెట్టారు బిగ్ బాస్. సంజన చేయి పట్టుకుని మిడ్ వీక్ ఎలిమినేషన్ రేఖ, పోపు గొడవ, నామినేషన్ గొడవ అంటూ ఆమె వివాదాలు అన్నిటినీ వరుసగా చెప్పుకొచ్చాడు. "రేఖలేవిరా? వంట చేయడం వల్ల ఆ రేఖలన్నీ అరిగిపోయాయి. నీ ఫ్యూచర్ నీతో పాటు నీ పక్కనుండే వాళ్ళపై ఆధారపడి ఉంటంది. వాళ్ళు లేకపోవడం వల్ల ఇంకా బాగుంది ఫ్యూచర్. ఫైర్ స్టార్మ్ రాకముందే ఎలిమినేట్ అయ్యుంటే ఇంకా బాగుండేది. అక్క రేఖతో జాగ్రత్త. రెండు చేతులతో సంపాదిస్తావ్. అలాగే ఖర్చు పెడతావ్" అని డెమోన్ జాతకం చెప్పాడు.
"అందాల రాక్షసి. చెయ్యంటే ఇలాగే ఉండాలి. నీ భవిష్యత్తు నీ ముందే ఉంది. కానీ దేఖట్లేదు. ఇవన్నీ ఎంత చూస్తావు అంత ప్రేమ చూపిస్తావు. చిట్టి గుండె మీదే ఉంది ప్రాణం అంతా. కాఫీతో పాటు కాఫీ షాప్ లో వాడన్నా ఇష్టం. ఇది కళ్యాణ రేఖ. నీకు కాబోయే హస్బెండ్ కు సిక్స్ ప్యాక్ ఉండదు మంచి గుండె ఉంటుంది. అందరిలాగా లాంగ్ హెయిర్ ఉండదు. కామ్ అండ్ కంపోజ్డ్ గా ఉంటాడు. 10 మందిలో ఉంటే ఎప్పుడో ఒకసారే మాట్లాడతాడు" అంటూ తనూజాకు ముద్దిచ్చి మరీ పంపాడు. కళ్యాణ్ వంతు వచ్చేసరికి 'ఇదసలు చెయ్యేనా?' అంటూ బ్రహ్మానందం రేంజ్ లో కామెడీ చేశాడు ఇమ్మూ.
సంజనాకు సోదరి మెసేజ్
మోస్ట్ ఎనర్జిటిక్ పర్సన్ సంజనకు ఇవ్వడంతో, ఆమె సిస్టర్ నిక్కీ గల్రాని వీడియో మెసేజ్ ను చూపించారు. "పెళ్లి వల్ల ఫ్యామిలీ వీక్ లో రాలేదు. నువ్వు నాలుగైదు వారాల్లో బ్యాగు సర్దుకుని వచ్చేస్తావ్ అనుకున్నాము. ఇది నిజంగానే నీకు సెకండ్ లైఫ్. మేము ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాము. ఫినాలేకి ఆల్ ది బెస్ట్ చెప్పింది. ఇమ్మాన్యుయేల్ నా అక్క మీ అమ్మ కోపంలో అప్పుడప్పుడూ ఏదో అంటుంది. కానీ నువ్వంటే తనకు చాలా ఇష్టం. ఆమెను ఏడిపించావంటే నాకు కరాటే వచ్చు జాగ్రత్త" అని హెచ్చరించింది.
రాత్రి 9 గంటలకు ఇమ్మానుయేల్ కు గార్డెన్ ఏరియాలో సర్ప్రైజ్ ఇచ్చారు. "ప్రతీ ఒక్క ఎమోషన్ అనుభవంలోకి వస్తేనే జీవితం నిండుగా ఉంటుంది. బాధ, నిరాశ, ఓటమి అనే ఎమోషన్స్ నుంచి మనుషులు పారిపోవాలని చూస్తారు. కానీ సాధ్యం కాదు. అందుకే వాటి నుంచి తేరుకుని రెట్టింపు ఉత్సాహంతో ముందుకు వెళ్లడానికి మనుషులు కోరుకునేది ఆనందం. దాన్ని తన మన అనే బేధం లేకుండా అందరికీ పంచే వాళ్ళే ఎంటర్టైనర్స్. వీళ్లకు ఆడియన్స్ నుంచే కాకుండా దేవుడి నుంచి కూడా ఆశీస్సులు లభిస్తాయి. దానికి నిదర్శనమే మీ జర్నీ" ప్రేక్షకులను ఎలా ఎంటర్టైనర్ చేయాలన్నది ఈ ఇంట్లో మీకంటే బాగా ఎవ్వరికీ తెలీదు. మీ బుర్ర అంత షార్ప్ గా ఉన్నప్పుడు అక్కడ జుట్టు ఎలా ఉంటుంది చెప్పండి ? కానీ ఒక గొప్ప మనిషిగా ఎదిగేందుకు, ప్రేక్షకుల మనసు గెలుచుకోవడానికి జుట్టు, చదువు ఆడంబరాలు అక్కర్లేదు. మంచి వ్యక్తిత్వం కావాలి" అంటూ ఇమ్మూ ఏవీనీ వేశారు. "ఈ కట్టే కాలే వరకు ఎంటర్టైన్ చేస్తా" అంటూ కృతజ్ఞతలు చెప్పాడు ఇమ్మూ.





















