Bigg Boss 8 Episode 103: అవినాష్, గౌతమ్‌ల ఇన్స్పిరేషనల్ జర్నీ... ఇద్దరినీ ఏడిపించిన బిగ్ బాస్ - మిడ్‌నైట్ నిఖిల్‌కు టీ ఇవ్వమని ఆదేశం
Bigg Boss Telugu Season 8: 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' డే 103 ఎపిసోడ్ ఎమోషనల్ గా సాగింది. అవినాష్, గౌతమ్ లకు ఒక్కొక్కరిగా పిలిచి, హౌస్ లో వాళ్ళ జర్నీని చూపించారు బిగ్ బాస్.
![Bigg Boss 8 Episode 103: అవినాష్, గౌతమ్‌ల ఇన్స్పిరేషనల్ జర్నీ... ఇద్దరినీ ఏడిపించిన బిగ్ బాస్ - మిడ్‌నైట్ నిఖిల్‌కు టీ ఇవ్వమని ఆదేశం Bigg Boss 8 Telugu Episode 103 Day 102 written review Bigg Boss shown inspirational journey of Avinash and Gautham Bigg Boss 8 Episode 103: అవినాష్, గౌతమ్‌ల ఇన్స్పిరేషనల్ జర్నీ... ఇద్దరినీ ఏడిపించిన బిగ్ బాస్ - మిడ్‌నైట్ నిఖిల్‌కు టీ ఇవ్వమని ఆదేశం](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/12/12/a4d602ba15f8780ceb558db90d367a8c17340251827691106_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'బిగ్ బాస్ తెలుగు సీజన్ 8' ఫైనల్ కి చేరుకున్న సంగతి తెలిసిందే. మరో మూడు రోజుల్లో విన్నర్ ఎవరు అనేది తేలిపోనుంది. తాజాగా బిగ్ బాస్ 8 ఎపిసోడ్ 103 ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం హౌస్ లో టాప్ 5 కంటెస్టెంట్స్ నిఖిల్, ప్రేరణ, నబిల్, అవినాష్, గౌతమ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈరోజు ఎపిసోడ్లో హౌస్ మేట్స్ ఒక్కొక్కరికి బిగ్ బాస్ సర్ప్రైజ్ ఇచ్చారు.
గౌతమ్ కి బిగ్ బాస్ సర్ప్రైజ్
బిగ్ బాస్ ముందుగా గార్డెన్ ఏరియాలో గౌతమ్ బిగ్ బాస్ ప్రయాణాన్ని తెలిపే విధంగా ఫోటోలు, ఆల్బమ్ లను ఏర్పాటు చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. అందులో బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ ఆడిన టాస్క్ లతోపాటు ప్రతి క్షణాన్ని క్యాప్చర్ చేశారు. "మొదట్లో గంగవ్వ ఎవరు ఉన్నా లేకపోయినా ఇంట్లో నువ్వు చివరి వరకు ఉంటావు" అన్నదని గౌతమ్ గుర్తు చేసుకున్నారు. "లైఫ్ లో గట్టిగా సపోర్ట్ చేసింది అన్నయ్య" అంటూ ఫ్యామిలీ వీక్ లో తన అన్నయ్య హౌస్ లోకి వచ్చిన ఫోటోను చూస్తూ చెప్పాడు. "బలవంతుడితో ఎలాగైనా గెలవగలం... కానీ మొండోడితో గెలవలేమన్న విషయం మీకు తెలుసా ?" అంటూ మొదలుపెట్టి బిగ్ బాస్ హౌస్ లో గౌతమ్ పడ్డ కష్టాన్ని చూపించారు. "పర్ఫెక్ట్ ప్లేయర్ గా మిమ్మల్ని మీరు మలుచుకున్న తీరు ప్రశంసనీయం. మిమ్మల్ని చూసి ఇంట్లోని బలమైన కంటెస్టెంట్స్ కూడా ఆలోచనలో పడ్డారు. స్త్రీల పట్ల మీకున్న గౌరవం మీ ఆటలో, మాటల్లో స్పష్టంగా కనిపించింది. ఇంట్లోకి అడుగు పెట్టినప్పుడు శారీరకంగా బలంగా ఉంటే ఇక్కడ సరిపోదు అనే విషయం మీరు తెలుసుకున్నారు. బుద్ధిబలం, భుజబలంతో ఒక యోధుడిలా పాదరసంలా ముందుకు కదిలారు.
మీరు కాస్త ప్రేమను కోరుకున్నప్పుడు అది దొరకకపోయినా, హౌస్ లో మానవ సంబంధాలు లేవని, అన్ని ప్రేక్షకుల కోసమే చేస్తున్నారు అని ఎన్ని మాటలు అన్నా... అవన్నీ ఆటలో భాగమేనని మీకు తెలుసు. ఫైనలిస్ట్ గా నిలిచి చివరి మజిలీ చేరుకున్నారు. గొప్ప కలలు కనడానికి ధైర్యం కావాలి. వాటిని నెరవేర్చుకోవడానికి అచంచల కృషి అవసరం " అంటూ గౌతమ్ బిగ్ బాస్ ప్రయాణాన్ని చూపించారు. దీంతో గౌతమ్ ఎమోషనల్ అయ్యారు. "తల్లిదండ్రులకు మించిన దేవుళ్ళు లేరు. వాళ్ళ కోసం బ్రతకండి" అంటూ ప్రేక్షకులకు తన మెసేజ్ ఇచ్చిన గౌతమ్ బిగ్ బాస్ కూడా కూడా థాంక్స్ చెప్పారు. ఇక అర్థరాత్రి నిఖిల్ ను టీ అడిగారు బిగ్ బాస్.
అవినాష్ అందరికన్నా ఐశ్వర్యవంతుడు
ఆ తర్వాత అవినాష్ కోసం అద్భుతమైన సెటప్ ని ఏర్పాటు చేయడంటో ఆయన ఎంట్రీ ఇచ్చి మురిసిపోయాడు. వైల్డ్ కార్డు ఎంట్రీ గా వచ్చి తర్వాత అతనికి సంబంధించిన గుర్తులు అన్నింటిని చూసి సంతోషపడ్డాడు. తను ఫస్ట్ ఫైనలిస్ట్ కావడానికి కారణమైన ఎవిక్షన్ షీల్డ్ ని చూసి నబిల్ కు థాంక్స్ చెప్పాడు అవినాష్. అనంతరం బిగ్ బాస్ అవినాష్ జర్నీ గురించి మాట్లాడుతూ "తెలియని సముద్రం భయాన్ని పెంచితే, తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. మీ అంచనాలే కాదు ప్రేక్షకులు మీ నుంచి ఆశించే విషయాలు కూడా. విజయవంతంగా మీరు ఈదగలరనే వారి నమ్మకం ఈరోజు మీరు ఈ స్థాయిలో నిలిచి, ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మీ చుట్టూ ఉండే ఉష్ణోగ్రత తనకు తానే కొన్ని డిగ్రీలు కోల్పోతుంది. ఎన్ని డిగ్రీలు పొందిన వారికి వస్తుంది చెప్పండి... నవ్వుకున్న బలం అదే కదా.
Also Read: నిఖిల్ విన్నర్ అవుతాడా? రన్నరా? 'బిగ్ బాస్ 8' హౌస్‌లోని అతని గేమ్‌లో ప్లస్, మైనస్ లేంటి?
ఇంట్లో కొందరే మీ స్నేహితులు అయినా అందరూ మీ ఆప్తులే. వారందరూ నవ్వు మీకిచ్చిన బంధువులే. మీ భార్యకి ఎంతో ఇష్టమైనప్పటికీ మీ ఉంగరాల జుట్టును ఆట మీద ఉన్న ప్రేమ కోసం త్యాగం చేశారు. ఫినాలేకి అతి చేరువలో ఉన్న సమయంలో ఓటు అప్పీల్ వదులుకోవడానికి ఎదుటివారి అవసరాన్ని అర్థం చేసుకునే మంచి మనసు, ధైర్యం ఉండాలి. అవన్నీ మీ సొంతమని నిరూపించారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమెడియన్ అన్నా, మీ కామెడీ రుచించలేదని నిందించినా మీరు కృంగిపోకుండా ధీటుగా సమాధానం ఇచ్చారు . ఈసారి అవినాష్ జస్ట్ కమెడియన్ మాత్రమే కాదు... అన్ని చేయగలిగే కంప్లీట్ ఎంటర్టైనర్ గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు. ఈ ప్రపంచంలో అన్ని అనారోగ్యాల నుంచి ఉపశమనం ఇచ్చే దివ్య ఔషధం నవ్వు ఒక్కటే. ఆ నవ్వుని పంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు" అంటూ అవినాష్ జర్నీని చూపించారు. అవినాష్ దాన్ని చూసి ఎమోషనల్ అయ్యాడు. ఆ తర్వాత బిగ్ బాస్ హౌస్ మేట్స్ కి బర్గర్ ట్రీట్ ఇచ్చారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)