అన్వేషించండి

Bigg Boss Telugu 8 Day 15 Promo: చెత్త నామినేషన్లు... కిరాక్ సీత, యష్మి గౌడ, మణికంఠ మధ్య గొడవలతో హీటెక్కిన బిగ్ బాస్

Bigg Boss 8 Telugu Promo Today: బిగ్ బాస్ 8 తెలుగు డే 15కు సంబంధించిన మొదటి ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ ప్రోమోలో నామినేట్ వేయాలి అనుకున్న వారిపై చెత్తను వేసి, రీజన్ చెప్పాల్సి ఉంటుంది.

బిగ్ బాస్ సీజన్ 8 ఇప్పుడు 15వ ఎపిసోడ్ కు చేరుకుంది. ఈ వీకెండ్ శేఖర్ బాషా ఊహించని విధంగా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఇక ఎప్పటిలాగే సోమవారం ఉదయం 15వ రోజుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ చేశారు. అందులో చెత్త వేసి హౌస్ మేట్స్ ను నామినేట్ చేయాలంటూ బిగ్ బాస్ షాక్ ఇచ్చారు. ఈ సందర్భంగా హౌస్ మేట్స్ మధ్య జరిగిన ఆర్గ్యుమెంట్స్ తో బిగ్ బాస్ హౌస్ హీటెక్కింది. 

కిరాక్ సీత డామినేషన్ కామెంట్స్ 
ముందుగా ప్రోమోలో కిరాక్ సీత నామినేషన్ ప్రాసెస్ లో మొదలుపెట్టినట్టుగా చూపించారు. అందులో ఆమె డామినేటింగ్ వాయిస్ లాగా అనిపించింది అని చెప్పగా, యష్మి గౌడ "ఎవ్వరూ డామినేట్ చేయలేదు" అంటూ సమర్ధించుకుంది. అలాగే పృథ్వీ కూడా "నేను ఒక టీంలో ఆడినప్పుడు అవతలి టీంను ఎలాగైనా ఓడించాలని ఆడతాను" అని చెప్పగా, సీత "ఎవరైనా ఎగ్జామ్లో ఆన్సర్ రాస్తుంటే కమాన్ అంటే అది రైట్ అని, సైలెంట్ గా ఉంటే రాంగ్ అని అర్థమవుతుంది" అంటూ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. "గేమ్ ఆడుతున్నప్పుడు మాట్లాడొద్దని ఏమైనా రూల్ ఉందా" అంటే.. "ఇది జస్ట్ కామన్ సెన్స్" పృథ్వీ అంటూ సీత ఫైర్ అయ్యింది. ఆ తర్వాత పృథ్వీపై చెత్త వేసి సీత అతన్ని నామినేట్ చేసినట్టుగా చూపించారు ప్రోమోలో. 

Read Also : హౌజ్‌మేట్స్‌కి‌ బిగ్ ట్విస్ట్‌, ఎలిమినేషన్‌ని వారి చేతుల్లోనే పెట్టిన హోస్ట్‌,

నాగ మణికంఠ ఫేక్.. యష్మి గౌడ ఫైర్ 
ఆ తర్వాత నాగ మణికంఠ "ఎవరు గిన్నెలు కడుగుతున్నారు, ఎవరు కడగట్లేదు" అంటూ యష్మి గౌడతో గొడవ పడుతున్నట్టుగా ప్రోమోలో చూపించారు. అయితే యస్మి మధ్యలో కల్పించుకోవడంతో నాగ మణికంఠ సీరియస్ అయ్యాడు. "అది నీ పని అయినా కాకపోయినా అందులో కల్పించుకుంటావు" అంటూ మణికంఠ చెప్పడంతో, "ఒక ఫ్రెండ్ లాగా నువ్వు నా దగ్గరికి వస్తావు చూడు.. అన్నీ ఫేక్" అనేసింది. దీంతో నాగ మణికంఠతో సీరియస్ ఆర్గ్యుమెంట్ నడిచింది యష్మి గౌడకి. అలాగే నాగ మణికంఠ పృథ్వి మధ్య కూడా నామినేషన్ లో సీరియస్ గా గొడవ జరిగినట్టు చూపించారు. ఆ తర్వాత విష్ణు ప్రియ ప్రేరణను నామినేట్ చేసినట్టుగా చూపించగా, ఆమె "చాలామంది దేనికి సెన్సిటివ్ అవుతున్నారు, దేనికి సెన్సిటివ్ అవ్వట్లేదు నాకు తెలియట్లేదు" అంటూ తన బాధను వెళ్లగక్కింది. ఇక చివరిగా నాగ మణికంఠ పృథ్వి, యష్మి గౌడపై చెత్త వేసి నామినేట్ చేసినట్టుగా ప్రోమోలో కనిపించింది. అలాగే "నేను ఒక చెత్త బుట్టలోని బాటిల్ తీస్తే చాలా పెద్ద గొడవ అయింది. అందరూ నాపై చెత్త వేసి నామినేట్ చేయండి" అని చెప్పగానే, విష్ణు ప్రియ ఆమెను నామినేట్ చేసినట్టుగా చూపించారు. చూస్తుంటే ఈరోజుటి ఎపిసోడ్ నామినేషన్ పరంగా ఫుల్ సీరియస్ గా ఉండబోతుందని తెలుస్తోంది. ఈ వీకెండ్ అందరో కలిసి యష్మి గౌడ, పృథ్వీలనే టార్గెట్ చేసినట్టుగా ఉన్నారు. యష్మి, పృథ్వీ, ప్రేరణతో పాటు ఇంకెవరెవరు ఈ వీకెండ్ నామినేషన్ లిస్ట్ లో చేరతారో చూడాలి. 

Read Also : శేఖర్ భాషా మెరుపుల్, విష్ణు ప్రియ అరుపుల్... బిగ్ బాస్ హౌస్‌లో ‘చిత్రం విచిత్రం’

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Telugu 10 Agnipariksha: బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 అగ్నిపరీక్ష.. సీనియర్ల నుంచి వైరల్ స్టార్స్ వరకు.. ప్రొబబుల్ లిస్ట్ ఇదే!
Thanuja Puttaswamy: మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
మాకు లేని బాధ మీకెందుకు? - ట్రోలర్స్‌పై తనూజ ఫైర్... పవన్ సాయి వర్సెస్ ముద్ద మందారం - అసలు ఏమైందంటే?
Bigg Boss 10: బిగ్‌బాస్ 10 కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
బిగ్‌బాస్ కోసం మంచిర్యాల యువకుడి పాదయాత్ర! అవకాశం ఇవ్వాలని నాగార్జునకు రిక్వస్ట్‌!
Aishwarya Sindogi: బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు
బిగ్ బాస్ బ్యూటీకి వేధింపులు... కంప్లైంట్‌తో ఎఫ్ఐఆర్ నమోదు

వీడియోలు

Minor Apologises to PM Modi | పీఎంపై వ్యాఖ్యలకు క్షమాపణ కోరిన మైనర్
Modi on abuses by youth | ఆవేదన చెందా కానీ కోపంలేదు 'దారి తప్పిన వారిని సరైన దారిలో నడిపిద్దాం
Jasprit Bumrah Fitness Cleared For Tests | ఫిట్‌నెస్ టెస్ట్ పాసైన జస్ప్రీత్ బుమ్రా
Serial Actress Vandana Gollu Real Life Story | బుల్లితెర నటి వందన గొల్లు రియల్ లైఫ్ స్టోరీ
Will Shami Play World Cup 2027? | గంగూలీ ప్లాన్ రిపీట్ చేయనున్న గిల్ ?

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Telangana Police Jobs 2026: తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
తెలంగాణ పోలీస్ ఉద్యోగాల భర్తీ- దరఖాస్తుల తేదీలు, పోస్టుల పూర్తి వివరాలు
PM Modi At Bhogapuram Airport: ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
ఉత్తరాంధ్ర ప్రగతికి నూతన శకం.. స్వర్ణాంధ్ర విజన్‌కు మైలురాయి భోగాపురం ఎయిర్‌పోర్ట్: ప్రధాని మోదీ
YSRCP Leaders Absconding: పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
పరారీలో వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ ఇన్‌ఛార్జులు - ముస్తఫా, చింతాడ రవికుమార్‌లపై నాన్-బెయిలబుల్ కేసులు!
Godavari River Overflow: భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
భద్రాచలం వద్ద గోదావరి ఉగ్రరూపం.. మూడో ప్రమాద హెచ్చరిక జారీ - పూర్తిగా నిలిచిన రాకపోకలు
The Hundred League Hug: భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
భారత్ పాక్ క్రికెటర్ల వైరల్ హగ్.. ఫాతిమా సనాకి షేక్ హ్యాండ్ ఇచ్చిన భార‌త మ‌హిళా స్టార్ క్రికెట‌ర్!
Pawan Kalyan onTiger Death: రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
రాచర్ల అడవుల్లో పెద్దపులి మృతిపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం.. సమగ్ర విచారణకు ఆదేశం
Revanth Reddy Criminal Waste Remarks: రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
రేవంత్ రెడ్డి క్రిమినల్ వేస్ట్ కామెంట్స్ కలకలం - కాక్రోచ్ తరహాలో క్రిమినల్ వేస్ట్ పార్టీ ఆవిర్భవిస్తుందా?
PM Modi On CJP Protest: నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
నన్ను, చనిపోయిన నా తల్లిని దూషించారు.. వారిని క్షమించి వదిలేద్దాం- సీజేపీ నిరసనపై ప్రధాని మోదీ
Embed widget