అన్వేషించండి

Bigg Boss 8 Telugu Day 10 Episode 11 Review: ఎమోషనల్ ఫూల్, కడుపు కొట్టిన బిగ్ బాస్! వాళ్లకి నో ఫుడ్-రాగి జావే గతి

Bigg Boss 8 Telugu Day 10 Episode 11 Review: బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం టాస్కులలో భాగంగా రేషన్ గొడవ మొదలయ్యింది. ఈ ఎపిసోడ్ లో ఆడి ఫుడ్ సాధించిన వారు కొందరైతే , ఆకలితో ఉండిపోయినవారు మరికొందరు.

 Bigg Boss 8 Telugu Day 10 Episode 11 Review:   బిగ్ బాస్ ఇంట్లో రెండో వారం టాస్కులు మొదలయ్యాయి. ఇక మూడు క్లాన్స్‌కు రేషన్స్‌ను సంపాదించే బాధ్యతల్ని చీఫ్‌‌ల మీద పెట్టాడు బిగ్ బాస్. ముందు స్టోరూంలోంచి సామాన్లను తెచ్చుకోమన్నాడు. పెద్ద క్లాన్ కావడంతో యష్మీకి ఎక్కువ టైం ఇచ్చాడు. ఇక నిఖిల్, నయనికి, యష్మీలు తమ తమ సామర్థ్యం మేరకు వస్తువులు తెచ్చుకున్నారు. కానీ వాటిని సొంతం చేసుకునేందుకు టాస్కులు పెట్టాడు. రెండు టాస్కులు ఇస్తానని, మూడు క్లాన్స్ నుంచి ఇద్దరే ఆ టాస్కులను గెలుస్తారు. ఓడిన ఆ ఒక్క క్లాన్‌కు రేషన్ ఉండదు. 

Read Also: అమ్మో బేబక్క వాచ్ ధర అన్నీ కోట్లా!? ఏ ప్లానెట్ నుంచి తెచ్చిన మెటలో తెలిస్తే ఫ్యూజులు ఔట్

అలా మొదటి టాస్క్.. లెమన్ పిజ్జాలో అద్భుతంగా ఆడి అభయ్, పృథ్వీలు టాస్కుని గెలుస్తారు. దీంతో యష్మీ క్లాన్ విన్ అవ్వడం.. యష్మీ సాధించిన సరుకులు మొత్తం ఆమె క్లాన్‌కు చెందాయి. ఇక రెండో టాస్క్‌లో కనిపెట్టు.. పరిగెత్తులో నయనిక విన్ అయింది. తనకు అన్యాయం జరిగిందంటూ సంచాలక్ యష్మీ మీద మణికంఠ ఫైర్ అయ్యాడు. పావుకిలో అంటే ఎగ్జాక్ట్‌గా ఎవ్వరూ తీసుకు రారు.. దానికి దగ్గర్లో ఉన్నది కన్సిడర్ చేయాలని మణికంఠ వాదించాడు. కానీ సంచాలక్ నిర్ణయం తుది నిర్ణయం అని యష్మీ కాస్త ఎక్స్ ట్రా చేసింది.

అవతర ఆరుగున్నారని.. అక్కడ మణికంఠకు పాయింట్ ఇస్తే టై అవుద్దని.. ఆరుగురు పస్తులుండాల్సి వస్తుందని.. ఇవతల ఇద్దరే ఉన్నారు కదా? అని అలా నిర్ణయం తీసుకుందట యష్మీ. అలా చివరకు నయనిక టీం విన్ అయింది. వారికి రేషన్ వచ్చింది. నిఖిల్, మణికంఠలకు రేషన్ కట్ అయింది. వాళ్లకి రాగి పిండి ఇచ్చాడు. దాంతోనే వారమంతా గడపమని అన్నాడు. అయితే ఈ రేషన్‌ను కాపాడుకోవాల్సి ఉంటుందని బిగ్ బాస్ హింట్ ఇచ్చాడు. అంటే ఆ రేషన్‌ను దొంగిలించుకోవచ్చని చెప్పకనే చెప్పేశాడు.

Read Also: నా లవ్ బ్రేకప్ కు కారణం ఆవిడే... బిగ్ బాస్ యాష్మీ గౌడ షాకింగ్ కామెంట్స్

ఇక ఈ నిఖిల్ నామినేషన్ నాటి ఘటనల్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యాడు. ఇంట్లో ఉండాలనిపించడం లేదని, తన వల్ల కావడం లేదని బాధపడ్డాడు. కానీ ప్రేరణ మాత్రం నిఖిల్‌కు పాజిటివ్ మాటలు చెప్పి ఉత్తేజ పర్చింది. ఇక నిఖిల్ మరోసారి నయనిక వద్ద బాధపడుతూ కనిపించాడు. ఎమోషనల్ ఫూల్ అని నయనిక అనేసింది. బాధను బయటపెడితే.. ఎమోషన్‌ను బయటపెడితే ఒక బాధ.. పెట్టకపోతే ఇంక బాధ అంటూ నిఖిల్ కాస్త కన్నీరు కార్చేశాడు. మరో వైపు సీత ఏదో మాట అనేసిందని విష్ణుప్రియ బాధపడింది.

మణికంఠ ఇంట్లోని రేషన్‌ను దొంగతనం చేయాలని ఫిక్స్ అయ్యాడు. కానీ నిఖిల్ మాత్రం అలా ఆడేందుకు సిద్ద పడలేదు. కానీ ఇంట్లో రేషన్ విషయంలో దొంగతనాలు జరిగాయి. మరి మున్ముందు ఈ రేషన్ గురించి ఇంట్లో ఏం జరుగుతుందో చూడాలి. మొత్తానికి బిగ్ బాస్ మాత్రం నిఖిల్, మణికంఠ కడుపు కొట్టినట్టు అనిపిస్తుంది.

మరిన్ని చూడండి
Advertisement

టాప్ హెడ్ లైన్స్

Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Advertisement
Advertisement
Advertisement
ABP Premium

వీడియోలు

కశ్మీర్‌లో మంచు చూశారా? డ్రోన్ విజువల్స్బ్రెజిల్‌లోని జీసెస్ కాకినాడకు దగ్గర్లోహిందూ, ముస్లింలూ వెళ్లే ఈ చర్చి గురించి తెలుసా?Anji Khad Railway Cable bridge | దేశంలో రైల్వే కట్టిన తొలి కేబుల్ వంతెన | ABP Desam

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Chandrababu Meets Modi: ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
ప్రధానమంత్రి మోదీతో ఏపీ సీఎం చంద్రబాబు సమావేశం- చర్చించిన అంశాలు ఏంటంటే?
Tollywood  News: రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
రేపు సీఎం రేవంత్‌తో ఫిల్మ్‌ ఇండస్ట్రీ పెద్దల సమావేశం- బెనిఫిట్‌ షోలకు ఓకే చెబుతారా!
Sandhya Theatre Incident: శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
శ్రీతేజ్ కుటుంబానికి రూ.2 కోట్లు సాయం - చెక్కులు అందించిన పుష్ప 2 టీమ్
Kazakhstan Plane Crash: కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
కజకిస్తాన్‌లో కుప్పకూలిన విమానం, భారీగా ప్రాణ నష్టం - క్రాష్ అవుతున్న వీడియో వైరల్
Bumrah VS Ashwin: అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
అశ్విన్ ను సమం చేసిన బుమ్రా.. తాజా ఐసీసీ ర్యాంకింగ్స్ దుమ్ము రేపిన స్టార్ పేసర్.. కొత్త రికార్డు దిశగా బుమ్రా ప్రయాణం
Andhra Pradesh News: అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
అన్నదాతపై పగబట్టి అల్పపీడనం- వర్షాలకు నీట మునిగిన పంటలు
Hydra Commissioner Ranganath : త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
త్వరలోనే హైడ్రా యాప్.. జులై తర్వాత కట్టిన అక్రమ నిర్మాణాలు కచ్చితంగా కూల్చేస్తాం: రంగనాథ్‌
IRCTC Compensation : ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
ప్రైవేట్ ట్రైన్స్ లో ఆలస్యంపై పరిహారం చెల్లించే పద్దతికి IRCTC స్వస్తి
Embed widget