అన్వేషించండి

Bigg Boss 7 Day 15 Updates: ‘బిగ్ బాస్’ ఈ వారం నామినేషన్స్‌లో ఆ ఏడుగురు, చివర్లో పెద్దాయన అదిరిపోయే ట్విస్ట్!

బిగ్ బాస్ సీజన్ 7లో మూడోవారం నామినేషన్స్ ముగిశాయి. అందులో ఆ ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నారు.

బిగ్ బాస్ సీజన్ 7లో మూడో వారం నామినేషన్స్ ముగిశాయి. నామినేషన్స్‌కు సంబంధించి విడుదలయ్యే ప్రోమోల్లో ఉన్నంత మజా.. ఎపిసోడ్‌లో ఉండదు అని చాలామంది ప్రేక్షకులు భావిస్తూ ఉంటారు. నేడు (సెప్టెంబర్ 18న) ప్రసారమయిన ఎపిసోడ్ చూస్తుంటే అదే అనిపిస్తోంది. ప్రోమోలో నామినేషన్స్ వాడివేడిగా సాగినట్టు అనిపించినా.. ఎపిసోడ్‌లో మాత్రం కొందరి మధ్య మాత్రమే వాగ్వాదాలు జరిగాయి. ముఖ్యంగా దామిని, ప్రియాంక, శుభశ్రీ, యావర్.. ఈ ఎపిసోడ్‌కు హైలెట్‌గా నిలిచారు. నామినేషన్స్ ముగిసిన తర్వాత ఎవరెవరు నామినేట్ అయ్యారో బిగ్ బాస్ ప్రకటించారు. ఆ తర్వాత ఒక మంచి ట్విస్ట్ కూడా ఇచ్చారు.

వారి టార్గెట్ శుభశ్రీ..

బిగ్ బాస్ సీజన్ 7లో మూడో వారం నామినేషన్స్‌లో ఏడుగురు కంటెస్టెంట్స్ ఉన్నారు. వారే శుభశ్రీ, గౌతమ్, ప్రియాంక, దామిని, యావర్, రతిక, అమర్‌దీప్. శుభశ్రీ విషయానికొస్తే.. తను చాలావరకు ఇంటి పనుల్లో యాక్టివ్‌గా ఉండడం లేదని పలువురు కంటెస్టెంట్స్.. తనను నామినేట్ చేయడానికి ముందుకొచ్చారు. ఈ కారణానికి శుభశ్రీ అసలు ఒప్పుకోలేదు. తాను కూడా పనిచేస్తున్నానని వాదించడం మొదలుపెట్టింది. ముందుగా అమర్‌దీప్ వచ్చి ఈ కారణంతో నామినేట్ చేయడంతో తనతో వాగ్వాదానికి కూడా దిగింది. ఆ తర్వాత దామిని కూడా తనను కావాలని టార్గెట్ చేస్తుందంటూ వ్యాఖ్యలు చేసింది. 

గత వారం జరిగిన టాస్క్ అనేది ఈ వారం పలువురు కంటెస్టెంట్స్.. నామినేషన్స్‌లో నిలబడేలా చేసింది. ముఖ్యంగా గౌతమ్ కృష్ణ, రతికకు అయితే అదే కారణం వల్ల నామినేషన్స్ పడ్డాయి. టీమ్ మాట వినకుండా మొండిగా ఉందని రతికను నామినేట్ చేశారు కంటెస్టెంట్స్. గౌతమ్ వల్లే టీమ్ మధ్య వివాదాలు వచ్చాయనే కారణంతో తనకు నామినేషన్స్ పడ్డాయి. ఇక రతిక, గౌతమ్‌లు కూడా ఒకరినొకరు ఇదే కారణంతో నామినేట్ చేసుకున్నారు. ప్రియాంక విషయానికొస్తే.. తను గేమ్ సరిగా ఆడలేదని కొందరు నామినేట్ చేశారు. ప్రిన్స్ యావర్ మాత్రం ప్రియాంక యాటిట్యూడ్ బాగా లేదంటూ తనను నామినేట్ చేశాడు. అమర్‌దీప్ ప్రవర్తన నచ్చలేదని తనను కూడా నామినేషన్స్‌లో పెట్టారు కంటెస్టెంట్స్.

తేజ అటు.. అమర్‌దీప్ ఇటు..
దామిని, ప్రిన్స్ యావర్ మధ్య నామినేషన్స్ విషయంలో పెద్ద గొడవే జరిగింది. ఇద్దరూ.. ఒకరిలోని తప్పులను మరొకరు వేలెత్తి చూపిస్తూ.. వాగ్వాదానికి దిగారు. ఇక తేజ పద్ధతి బాలేదంటూ తనను కూడా కొందరు కంటెస్టెంట్స్ నామినేట్ చేశారు. అలా కంటెస్టెంట్స్ నామినేషన్స్ ముగిసే సమయానికి శుభశ్రీ, గౌతమ్ కృష్ణ, ప్రియాంక, దామిని, యావర్, రతిక, టేస్టీ తేజ లిస్ట్‌లో ఉన్నారు. కానీ అక్కడే బిగ్ బాస్ ఒక ట్విస్ట్ ఇచ్చారు. సందీప్, శివాజీ దగ్గర పవర్ అస్త్రాలు ఉన్నాయి కాబట్టి.. వారిద్దరూ కలిసి ఇప్పటికే నామినేషన్స్‌లో ఉన్న ఒక కంటెస్టెంట్‌ను సేవ్ చేయవచ్చు. సేఫ్ జోన్‌లో ఒక కంటెస్టెంట్‌ను నామినేట్ చేయవచ్చు అని బిగ్ బాస్ తెలిపారు. దీంతో నామినేషన్స్‌లో ఉన్న తేజను సేవ్ చేసి అమర్‌దీప్‌ను నామినేట్ చేశారు సందీప్, శివాజీ. పవర్ అస్త్రా కోసం అవకాశం ఇచ్చినా కూడా అమర్‌దీప్ ఓడిపోయాడని కారణం చెప్పాడు సందీప్. దానికి ఇద్దరు కలిసి టార్గెట్ చేసినట్టుగా ఉందని అమర్‌దీప్ వ్యాఖ్యలు చేశాడు.

Also Read: ఆ ఇద్దరు నా కొడుకును రారా పోరా అంటూ అమర్యాదగా ప్రవర్తిస్తున్నారు: కన్నీళ్లు పెట్టుకున్న పల్లవి ప్రశాంత్ తండ్రి

Join Us on Telegram: https://t.me/abpdesamofficial

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
Bigg Boss 10 Promo : ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
ఈసారి ఆటే సవాల్ - దశావతారం గేమ్ స్ట్రాటజీస్... బిగ్ బాస్ సీజన్ 10 ప్రోమో వచ్చేసింది
Eknadh Harika: బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
బుల్లితెర పాపులర్ కపుల్ ఏక్ నాథ్, జయ హారిక.. రియల్ లైఫ్, బిగ్ బాస్ ఎంట్రీ విశేషాలు
Bigg Boss Agnipariksha 2 : కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్
కంటెస్టెంట్స్‌ను హర్ట్ చేస్తున్నారా? - అగ్నిపరీక్షలో ఉప్పల్ బాలు వివాదంపై బిందు మాధవి రియాక్షన్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
NTR Health Update : ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
ఎన్టీఆర్‌కు ఫిజియోథెరపీ - లేటెస్ట్ హెల్త్ అప్డేట్ ఏంటంటే?
Chinnareddy Politics: 48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
48 ఏళ్ల రాజకీయ జీవితం నాశనం, జీవన్‌రెడ్డిలా కాంగ్రెస్ పార్టీపై తిరగబడతా!: చిన్నారెడ్డి
Galle Rain Threat: టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
టీమిండియా 462కి ఆలౌట్.. తొలి ఓవ‌ర్లోనే సిరాజ్ పంజా..గాలే డే త్రీలో వ‌రుణుడి ముప్పు త‌ప్ప‌దా..!
Sanathnagar MCRTIMS: సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
సనత్‌నగర్ టిమ్స్‌ నేడు ప్రారంభం! ప్రత్యేకతలు ఏంటో తెలుసా?
The Red Bag: పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
పీవీఆర్ ఐనాక్స్ పిక్చర్స్ చేతికి 'రెడ్ బ్యాగ్'... ప్రసాద్ బెహరా సినిమా రిలీజ్ ఎప్పుడంటే?
రూ.18 లక్షల నుంచే కొత్త 7 సీటర్‌ EV!.. MG Hector Tomahawk‌పై భారీ అంచనాలు!
కవరింగ్‌ లేకుండానే కనిపించిన MG కొత్త EV.. 530km రేంజ్‌తో వస్తున్న Hector Tomahawk!
Kidney Health : కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
కిడ్నీలను దెబ్బతీసే ఫుడ్స్ ఇవే.. మూత్రపిండాల సరిగ్గా పనిచేయాలంటే వీటిని తినడం తగ్గించండి
APPSC Group 1 Scam: గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
గ్రూప్-1 అక్రమాలపై సిట్ ఉచ్చు.. విచారణ ఐఏఎస్, ఐపీఎస్‌లతో ఆగుతుందా.. రాజకీయ పెద్దల వద్దకూ వెళ్తుందా?
Embed widget