Bigg Boss 6 Telugu Finale: బిగ్‌బాస్ ఫినాలే గెస్టు రవితేజ? డబ్బుల సూట్‌కేసుతో ఇంట్లోకి వెళ్లిన నిఖిల్, రవితేజ?
Bigg Boss 6 Telugu Finale: బిగ్ బాస్ స్పెషల్ గెస్టుగా రవితేజ హాజరయ్యారా? లేక వేరే వారు వస్తున్నారా?
Bigg Boss 6 Telugu Finale: బిగ్ బాస్ ఫినాలే అనగానే తారలు దిగివచ్చినట్టే అనిపిస్తుంది. ఎంతో మంది సినీ ప్రముఖులు బిగ్ బాస్ ఫినాలే కార్యక్రమానికి విచ్చేసి సందడి చేస్తారు. గతంలో చిరంజీవి స్పెషల్ గెస్టుగా హాజరైన సీజన్లు ఉన్నాయి. ఈసారి ఎవరు వస్తారనే దానిపై చాలా సస్పెన్సు ఉంది. కాగా అందిన సమాచారం మేరకు రవితేజ వచ్చాడని తెలుస్తోంది. అయితే ట్రోఫీ అందించే స్పెషల్ గెస్టా లేక ఇంట్లోకి వెళ్లే తారల్లో ఒకరా అనేది తెలియదు కానీ రవితేజ మాత్రం బిగ్ బాస్ హౌస్ కి వచ్చారు. అతనితో పాటూ శ్రీలీల కూడా వచ్చినట్టు తెలుస్తోంది. వీరిద్దరూ కలిసి నటించిన సినిమా ‘ధమాకా’. ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా వీరిద్దరూ వచ్చిన సమాచారం.
డబ్బు సూట్‌కేసుతో
టాప్ 5 లేదా టాప్ 4 కంటెస్టెంట్లు ఉన్నప్పుడు డబ్బుల సూట్ కేసుతో సెలెబ్రిటీలు ఇంట్లోకి వెళ్లారు. పదిలక్షల రూపాయలు లేదా అయిదు లక్షల ఇలా కొంత మొత్తాన్ని ఆఫర్ చేసి ఇంటి నుంచి ఎలిమినేట్ అవ్వమని అడుగుతారు. అలా ఈసారి నిఖిల్, రవితేజ ఇంట్లోకి డబ్బుల సూట్ కేసుతో వెళ్లినట్టు సమాచారం. షూటింగ్ కంప్లీట్ అయిపోయింది ఫినలే ఎపిసోడ్. ఎడిటింగ్ తరువాత ఈ రోజు సాయంత్రం టెలీకాస్ట్ చేయడమే మిగింది.
రేవంత్ విన్నర్?
బిగ్ బాస్ సీజన్ 6 విన్నర్ గా రేవంత్ నిలిచినట్టు సమాచారం. ఇక శ్రీహాన్ రన్నరప్ గా మిగిలాడని, ఆదిరెడ్డి మూడో స్థానంలో ఉన్నాడని తెలుస్తోంది. ఇక విన్నర్ మెటీరియల్ అనుకున్న రోహిత్ అయిదో స్థానానికే పరిమితం అయ్యాడని, కీర్తి నాలుగోస్థానంలో ఉందని తెలుస్తోంది. రేవంత్ విన్నర్ అని మొదట్నుంచి వినిపిస్తూనే ఉంది. ఇంకా విన్నర్ ని ప్రకటించక ముందే నా కొడుకుని విన్నర్ చేసినందుకు ధన్యవాదాలు అంటూ రేవంత్ తల్లి ఇప్పటికే కామెంట్ చేసింది. ఇలాంటి కొడుకే తనకు పుట్టాలని ఎప్పటికీ దేవుడిని కోరుకుంటానని కూడా చెప్పింది. అంతేకాదు రేవంత్ ఇంటి దగ్గర సంబరాలకు కూడా అంతా రెడీ చేసేశారు. రేవంత్ కూడా ఎప్పట్నించో తానే విన్నర్ అని చెప్పుకుంటూ వచ్చాడు. అంతేకాదు బిగ్ బాస్ కు వెళ్లడానికి ముందే విన్నర్ అయి తిరిగొస్తా అంటూ చాలా కాన్ఫిడెంట్ గా చెప్పాడ. ఇప్పుడు అదే నిజమైనట్టు తెలుస్తోంది.
ఫినాలే వేదికపై నాగార్జున ఇద్దరి కంటెస్టెంట్‌ల చేతులు పట్టుకుని నిల్చుని చివరకు విజేత చేతిని పైకెత్తుతాడు. అలా వేదికపై నిల్చుంది రేవంత్, శ్రీహాన్ అని తెలుస్తోంది. వీరిద్దరిలో రేవంత్ విన్నర్ అయినట్టు సమాచారం. ఇక శ్రీహాన్ రన్నర్‌గా మిగిలిపోయినట్టు తెలుస్తోంది. ఆదిరెడ్డి, రోహిత్, కీర్తి ఒక్కొక్కరిగా ఎలిమినేట్ అయి ముందే బయటికి వచ్చేశారు.
మిడ్ వీక్ ఎలిమినేషన్లో భాగంగా శ్రీసత్య బయటికి వచ్చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఆమె ఫైనల్ వరకు చేరకుండానే ఇంటి ముఖం పట్టింది. ఇనాయలాంటి గట్టి ప్లేయర్ ఫినాలేలో లేకపోవడం మాత్రం కాస్త ఆశ్చర్యమే.
Also read: అఖిల్ సార్ధక్, కాజల్, అషూరెడ్డి, మెహబూబ్ - ఇంట్లో సందడి చేసిన మాజీ కంటెస్టెంట్లు