X

Bigg Boss 5 Telugu: సిరి-కాజల్ పై యానీ మాస్టర్ ఫైర్.. డ్రామా క్వీన్ అంటూ కామెంట్స్..

హౌస్ మేట్స్ అందరూ కూడా నిన్నటి నామినేట్ ప్రాసెస్ గురించి చర్చించుకున్నారు.

FOLLOW US: 

హౌస్ మేట్స్ అందరూ కూడా నిన్నటి నామినేట్ ప్రాసెస్ గురించి చర్చించుకున్నారు. శ్రీరామ్ 'యాక్టర్స్' మీద చేసిన కామెంట్ హాట్ టాపిక్ అయింది. సన్నీ తనను కావాలనే బెదిరిస్తున్నాడంటూ ప్రియాంక దగ్గర వాపోయింది ప్రియా. ఆ తరువాత శ్రీరామ్.. యానీ మాస్టర్ ను ఎందుకు నామినేట్ చేశావ్ అని విశ్వను అడిగాడు. 'ఛాన్స్ వస్తే ఆమెని నామినేట్ చేయాలని చాలా రోజులుగా చూస్తున్నానని' విశ్వ అన్నాడు. 

తెల్లవారుజామున శ్వేతా.. కాజల్, షణ్ముఖ్ లను తిడుతూ.. రవి, యానీ మాస్టర్, ప్రియాల ముందు మాట్లాడింది. శ్వేతా అరుస్తూ మాట్లాడడంతో ఆమెని కూల్  ప్రయత్నం చేశారు. ఆ తరువాత 'బ్రేకప్‌ బ్రో.. బ్రదర్‌, సిస్టర్‌ల బ్రేకప్‌ చరిత్రలో ఇదే తొలిసారి అనుకుంటా' అంటూ కాజల్ శ్రీరామ్ తో చెప్పింది. 'ఐన్‌స్టీన్‌ లాజిక్ అర్ధం చేసుకోవడానికైనా ప్రయత్నం చేయొచ్చు కానీ వీళ్ల నామినేషన్లని అర్ధం చేసుకొనే ప్రయత్నం చేయలేం. అవి అర్ధం కావు' అంటూ షణ్ముఖ్.. జెస్సీతో అన్నాడు. సన్నీ.. హామీదను ఇమిటేట్ చేస్తూ ఫన్ చేశాడు. డైనింగ్ టేబుల్ దగ్గర యానీ మాస్టర్ మాటలకు అందరూ పడిపడి నవ్వారు.  ,

Also read:  నా రాజీనా'మా' వెనుక లోతైన అర్థం ఉంది, త్వరలోనే చెబుతా అంటూ ప్రకాశ్ రాజ్ ట్వీట్..

'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ':

'బీబీ బొమ్మల ఫ్యాక్టరీ' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో టీమ్ మొత్తాన్ని నాలుగు గ్రూపులుగా డివైడ్ చేశారు. రెండు గ్రూపులకు మ్యానేజర్ గా కాజల్ ను, మరో రెండు గ్రూపులకు మ్యానేజర్ గా సిరిని నియమించారు. అలానే కాజల్, సిరి సంచాలకులుగా వ్యహరిస్తారని చెప్పారు. ఈ గేమ్ లో చివరకు ఎవరిదగ్గరైతే ఎక్కువ యాక్సెప్ట్ చేసిన బొమ్మలుంటాయో ఆ గ్రూపుల నుంచి కెప్టెన్సీ కంటెండర్లను ఎన్నుకుంటారు. 

బొమ్మల కోసం హౌస్ మేట్స్ ఒకరితో మరొకరు గొడవ పడడం, బొమ్మలు చింపేయడం వంటివి చేశారు. జెస్సీ-శ్వేతా ఒకరిపై మరొకరు పడి మరీ గొడవపడ్డారు. ఆ తరువాత శ్వేతా.. ఈరోజు బరాబర్ గుంజుతా అంటూ లోబో, రవిలతో చెప్పింది. టాస్క్ ఫిజికల్ గా వెళ్తే నేను ఎక్స్ట్రీమ్ అయిపోతా అంటూ రవితో అన్నాడు షణ్ముఖ్.  

బొమ్మలు యాక్సెప్ట్ చేసే విషయంలో సిరి-యానీ మాస్టర్ కి మధ్య గొడవ జరిగింది. ముందుగా యానీ మాస్టర్ 'నేను యాక్సెప్ట్ చేయను.. నేను గొడవ చేస్తా' అంటూ కాజల్-సిరిలతో చెప్పగా.. 'మీకెవరూ ఏం చెప్పొద్దూ.. సంచాలక్ గా మేం చూసుకుంటాం' అంటూ సిరి అరుచుకుంటూ వెళ్లిపోయింది. దీంతో యానీ మాస్టర్ ఫైర్ అయింది. 'నేను అంత రూడ్ కాదు.. నువ్ నన్ను అలా బ్లేమ్ చేయలేవు.. నాకు డ్రామాలు ఆడడం రాదు.. నేను డ్రామా క్వీన్ కాదు' అంటూ మండిపడింది. 'ఇప్పుడు నా చేతుల్లో గేమ్ ఉంది.. నేను ఆడతాను' అంటూ సిరి.. 'నాకు ముందొకటి వెనకొకటి మాట్లాడడం రాదు' అంటూ యానీ మాస్టర్ మాటల యుద్ధానికి దిగారు. కాజల్.. సిరికి సపోర్ట్ చేయడంతో ఆమెపై కూడా మండిపడింది యానీ మాస్టర్. ఎంత జెన్యూన్ గా ఆడిన ఏదొకటి అంటారని నాకు తెలుసంటూ సిరి.. కాజల్ తో చెప్పుకుంది. ఆ తరువాత షణ్ముఖ్ వచ్చి సిరి-కాజల్ లతో మాట్లాడు. ఎవరెన్ని మాటలన్నా.. సైలెంట్ గా ఉండు అంటూ సలహా ఇచ్చాడు షణ్ముఖ్. 

ఆ తరువాత సన్నీ-మానస్ లతో డిస్కషన్ పెట్టింది యానీ మాస్టర్. 'ఈరోజు తరువాత నుంచి నేను కాజల్ మొహం కూడా చూడను' అంటూ యానీ చెప్పగా.. 'పొరపాటున కనిపిస్తే' అంటూ కామెడీ చేశాడు సన్నీ. 

ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి
Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 Siri Yani Master

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ''అభయహస్తం'' దక్కెదెవరికి... కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మళ్లీ  రచ్చ రచ్చే...

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో ''అభయహస్తం'' దక్కెదెవరికి... కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ మళ్లీ రచ్చ రచ్చే...

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సిరి, షణ్ముక్ చదవకుండా మిస్సైన లెటర్స్ ఇవే...

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఇంట్లో సిరి, షణ్ముక్ చదవకుండా మిస్సైన లెటర్స్ ఇవే...

Bigg Boss 5 Telugu: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..?

Bigg Boss 5 Telugu: ఈ వారం ఎవరెవరు నామినేట్ అయ్యారంటే..?

Bigg Boss 5 Telugu: ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Bigg Boss 5 Telugu: ప్రియా రెమ్యునరేషన్ ఎంతో తెలుసా..?

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఎమోషనల్ గేమ్.. తట్టుకోలేక ఏడ్చేసిన హౌస్ మేట్స్..

Bigg Boss 5 Telugu: బిగ్ బాస్ ఎమోషనల్ గేమ్.. తట్టుకోలేక ఏడ్చేసిన హౌస్ మేట్స్..
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Prabhas: మళ్లీ ముంబైకు ప్రభాస్... రాముడికి టాటా చెప్పిన తర్వాతే!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Romantic Badass Trailer: దుమ్మురేపుతున్న ‘రొమాంటిక్’ బదాస్ ట్రైలర్.. ఊపిచ్చే డైలాగులతో రచ్చ!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Beating the Groom: వరుడిని చితకొట్టాలి.. వధువుపై ఉమ్మేయాలి.. ఎట్టెట్టా? ఇది వాళ్ల ఆచారమట!

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు

Sleeping Bus: ఫుడ్ పెట్టి జోల పాడే ‘స్లీపింగ్ బస్సు’, కుంభకర్ణులకే ప్రత్యేకం... ప్రపంచంలోనే తొలి సర్వీసు