X

Bigg Boss 5 Telugu: సన్నీ ఫన్ మాములుగా లేదు.. కాజల్ డబ్బు కొట్టేసిన రవి..

కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ ని బీబీ హోటల్ గా మార్చేశారు.రవిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు.

FOLLOW US: 

హౌస్ మేట్స్ కి కేక్ పీస్ పంపించిన బిగ్ బాస్ 'ఇది తినే అర్హత మీలో ఏ ఒక్కరికి ఉంది..?' అంటూ దానిపై క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అది చూసిన రవి.. క్వశ్చన్ మార్క్ పెట్టారు కాబట్టి ఆయనకి ఆన్సర్ కావాలి అని అనేలోపు.. ఒకటి కాదు, మూడు క్వశ్చన్ మార్క్స్ అని యానీ మాస్టర్ అమాయకంగా అన్నారు. దానికి శ్రీరామ్ ఫన్నీగా.. 'మీరు గ్యాప్ అబ్సర్వ్ చేయలేదు.. గ్యాప్ కూడా ఉంది' అంటూ వెటకారంగా అన్నాడు. రవి ఏమో క్వశ్చన్ మార్క్ కూడా ఉల్టా సి ఉంది అని ఫన్నీగా అనగా.. 'అవును కదా' అంటూ యానీ అనడం కామెడీగా ఉంది. 


Also Read: కత్తితో పొడుచుకోబోయిన కంటెస్టెంట్.. షాక్ లో హౌస్ మేట్స్..


'ఈ తొక్కలో డిస్కషన్ ఏంటో అర్ధం కావట్లేదు.. తీసి లటుక్కున తినేయనా..?' అని సన్నీ అనగా.. తినెయ్ అని కాజల్ చెప్పింది. ఇక యానీ మాస్టర్, శ్రీరామ్ ఆ కేక్ ముక్క చుట్టూ ఏముందా అని వెతకడం మొదలుపెట్టారు. ఆ తరువాత యానీ తను కెప్టెన్ అని తనకు తినే అర్హత ఉందని చెప్పగా.. సరే తినండి అంటూ సన్నీ అన్నాడు. దానికి ఆమె హౌస్ అందరూ కలిసి నిర్ణయించుకుంటే బెటర్ అని చెప్పింది. వెంటనే ప్రియాంక.. 'నాకు మానస్ కి ఇవ్వాలని ఉందని' కామెంట్ చేసింది. దానికి సన్నీ.. 'నువ్ అన్నీ ఆయనకు ఇచ్చుకో.. అన్నీ మానస్ కి మానస్ కి.. అక్కడ జైల్లో నేను కూడా ఉన్నాను. కనపడలేదా నీకు..?' అని ఫన్నీగా అనగా.. హౌస్ మేట్స్ అందరూ నవ్వేశారు. 


ఆ తరువాత సీక్రెట్ రూమ్ లో ఉన్న జెస్సీని ఆ కేక్ తినడానికి అర్హులెవరో చెప్పమని బిగ్ బాస్ అడగ్గా.. రవి పేరు చెప్పాడు. రాత్రి వరకు హౌస్ మేట్స్ ఆ కేక్ గురించి చర్చించుకుంటూనే ఉన్నారు. సన్నీ ఆ కేక్ తనకే కావాలని పట్టుబట్టాడు. ఫైనల్ గా కెప్టెన్ యానీ మాస్టర్ తనే తింటానని చెప్పింది. అయినప్పటికీ ఆ విషయాన్ని పట్టించుకోకుండా తెల్లవారుజామున సన్నీ కేక్ తీసుకొని తినేశాడు. 'ఇప్పుడేం పంచాయితీ జరుగుతాడో ఏంటో' అంటూ టెన్షన్ పడ్డాడు. యానీ మాస్టర్ వచ్చి సన్నీని ప్రశ్నించగా.. ఆకలేసింది తినేశానని చెప్పాడు. ఈ విషయంలో యానీ మాస్టర్ ఫైర్ అయింది. 'నమ్మకాన్ని బ్రేక్ చేశాడంటూ' రవి దగ్గర చెప్పింది యానీ. 


బీబీ హోటల్.. 
కెప్టెన్సీ పోటీదారుల టాస్క్ కోసం బిగ్ బాస్ హౌస్ ని బీబీ హోటల్ గా మార్చేశారు.రవిని కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచిన బిగ్ బాస్ సీక్రెట్ టాస్క్ ఇచ్చారు. ఈ టాస్క్ లో భాగంగా రవి నోటీస్ పీరియడ్ లో ఉన్న హౌస్ కీపింగ్ స్టాఫ్ గా కనిపించనున్నారు. హోటల్ స్టాఫ్ అతిథులకు ఇచ్చే సర్వీసెస్ కి ఆటంకం కలిగించడానికి ప్రయత్నించి.. అతిథులకు మిగతా స్టాఫ్ కంటే రవి పని అంటేనే ఎక్కువ నచ్చేలా చూసుకోవాల్సి ఉంటుంది. అదే అతడి సీక్రెట్ టాస్క్.   • షణ్ముఖ్ అండ్ శ్రీరామ్ - హోటల్ స్టాఫ్

  • యానీ మాస్టర్ - మ్యానేజర్ అండ్ రిసెప్షనిస్ట్..

  • రవి - ఉద్యోగాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించే హౌస్ కీపింగ్

  • మానస్, ప్రియాంక - హోటల్ కి వచ్చిన హనీమూన్ కపుల్

  • కాజల్ - హోటల్ ఓనర్ కి స్నేహితురాలు, తనకు చాలా యాటిట్యూడ్

  • సన్నీ -  ఒక కాంటెస్ట్ లో గెలిచి 2 నైట్స్, 3 డేస్ కోసం మొదటిసారి ఫైవ్ స్టార్ హోటల్ కి వచ్చిన గెస్ట్.

  • సిరి - ఎంతో గారాబంగా పెరిగిన డాన్ కూతురు. 


టాస్క్ మొదలైన తరువాత కాజల్.. షణ్ముఖ్ తో కుప్పిగంతులు వేయించింది. తరువాత రవి-షణ్ముఖ్-శ్రీరామ్ లతో మోజ్ రూమ్ లో ఉన్న బొమ్మల పోజులు పెట్టించింది కాజల్. యానీ మాస్టర్ దగ్గరకు వెళ్లి 'మీకెవరైనా చెప్పారా..? మీరు పిల్లిలా ఉంటారని' అంటూ ఫన్ చేశాడు సన్నీ. డాన్ కూతురి పాత్రలో సిరి.. షణ్ముఖ్ కి చుక్కలు చూపించింది. అతడితో సేవలు చేయించుకోవడం పాటు.. డాన్స్ చేయమని చెప్పింది. స్విమ్మింగ్ పూల్ లో ఉన్న వాటర్ ని చెంచా తీసుకొని కొలవమని చెప్పింది. 


ఆ తరువాత మానస్-ప్రియాంక హనీమూన్ కపుల్ గా హోటల్ కి వచ్చారు. వాళ్లతో సన్నీ మాట్లాడే ప్రయత్నం చేశాడు. మానస్ చనువు ఇచ్చాడు కదా అని.. ప్రియాంక అతడికి మరింత దగ్గరైపోయింది. దీంతో సన్నీ.. 'కొంచెం ఆమెతో జాగ్రత్తగా ఉండరా బాబు' అంటూ డైలాగ్ వేశాడు. ఇంతలో కాజల్ డబ్బులు కొట్టేశాడు రవి. దీంతో ఆమె నానా రచ్చ చేసింది. 


Also Read:  రంగమ్మత్తను మించి ద్రాక్షాయణి.. వామ్మో అందమైన అనసూయ ఇలా అయిపోయిందే...


Also Read: పెళ్లైందని మర్చిపోయారా… ఆమెతో రొమాన్స్ ఏంటి..


Also Read: సీక్రెట్ రూమ్ లో జెస్సీ.. రవికి వార్నింగ్ ఇచ్చిన షణ్ముఖ్


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Kajal Bigg Boss 5 Telugu Bigg Boss 5 Ravi Sunny bb hotel task

సంబంధిత కథనాలు

Bigg Boss 5 Telugu: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

Bigg Boss 5 Telugu: సన్నీ కాదు.. సిరి కాదు.. ఫస్ట్ ఫైనలిస్ట్ ఎవరంటే..?

Bigg Boss 5 Telugu: టాప్ 5 లో ఆ ముగ్గురూ కన్ఫర్మ్.. సిరి గెలిస్తే ఈక్వేషన్ మారుతుందా..?

Bigg Boss 5 Telugu: టాప్ 5 లో ఆ ముగ్గురూ కన్ఫర్మ్.. సిరి గెలిస్తే ఈక్వేషన్ మారుతుందా..?

Bigg Boss 5 Telugu: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా..?

Bigg Boss 5 Telugu: ఈ వారం ఆమె ఎలిమినేషన్ తప్పదా..?

Bigg Boss 5 Telugu: 'టికెట్ టు ఫినాలే' లాస్ట్ ఛాలెంజ్.. ఆ ఇద్దరు పోటీదారులెవరో..?

Bigg Boss 5 Telugu: 'టికెట్ టు ఫినాలే' లాస్ట్ ఛాలెంజ్.. ఆ ఇద్దరు పోటీదారులెవరో..?

Sunny Vs Shanmukh: అరె ఏంట్రా ఇది.. సిరి చేతిలో షణ్ముఖ్ భవిష్యత్? టైటిల్ రేసులో సన్నీ!

Sunny Vs Shanmukh: అరె ఏంట్రా ఇది.. సిరి చేతిలో షణ్ముఖ్ భవిష్యత్? టైటిల్ రేసులో సన్నీ!
SHOPPING
Kitchen Appliances
LAPTOP AND ACCESORIES
Mobiles Deal
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Samsung A73: శాంసంగ్ కొత్త 5జీ మొబైల్ వచ్చేస్తుంది.. 108 మెగాపిక్సెల్ కెమెరా కూడా!

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Jawad Cyclone: విశాఖకు 770 కి.మీటర్ల దూరంలో తుపాను... రేపు ఉదయం ఉత్తరాంధ్ర-ఒడిశా మధ్య తీరం దాటొచ్చు... ఏపీ విపత్తు నిర్వహణశాఖ ప్రకటన

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Govt FAQs on Omicron: ఒమిక్రాన్‌ వల్ల థర్డ్ వేవ్ వస్తుందా? టీకాలు పనిచేస్తాయా? ఇదిగో సమాధానాలు

Pushpa Trailer Tease: నోటిలో బ్లేడుతో అనసూయ... బన్నీ బైక్ స్టంట్

Pushpa Trailer Tease: నోటిలో బ్లేడుతో అనసూయ... బన్నీ బైక్ స్టంట్