అన్వేషించండి
Advertisement
Bigg Boss 5 Telugu: కాజల్ కి మిడిల్ ఫింగర్ చూపించిన లోబో.. శ్రీరామ్ తో గొడవకు దిగిన సిరి..
ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ లో కాజల్ పై రవి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యాడు. ఎందుకలా జరిగిందో ఇప్పుడు చూద్దాం!
నిన్న మధ్యలోనే ఆగిపోయిన డిస్కషన్ ఈరోజు శ్రీరామ్-షణ్ముఖ్ ల మధ్య కంటిన్యూ అయింది. ముందుగా శ్రీరామ్ 'నువ్ విన్నావా అసలు నేనేం అన్నానో' అని అనగా.. 'తను నా ఫ్రెండ్.. నేను స్టాండ్ తీసుకుంటా' అని బదులిచ్చాడు షణ్ముఖ్. ఇక్కడ అందరూ అందరికీ ఫ్రెండ్సే అని శ్రీరామ్ అనగా.. 'బట్ నా రూల్ బుక్ లో విన్నరే మాట్లాడాలని లేదు' అని షణ్ముఖ్ యాటిట్యూడ్ తో అన్నాడు. 'నీ రూల్ లో పెట్టుకో.. పనికొస్తది.. 26 ఏళ్లకు ఏం అవసరం లేదని అనుకోకు.. నేను ఇంతే నా రూల్స్ ఇంతే అని అనకు..' అంటూ శ్రీరామ్ ఫైర్ అవ్వగా.. షణ్ముఖ్ వెటకారంగా నవ్వాడు.
మెచ్యూరిటీకి మించి మాట్లాడకు..
ఇంతలో సిరి కూడా శ్రీరామ్ పై విరుచుకుపడింది. 'పార్టిసిపేషన్ లేదని ఎందుకు అంటున్నావ్ అని' అతడిని ప్రశ్నించింది. దానికి శ్రీరామ్.. 'మెచ్యూరిటీకి మించి మాట్లాడకు..' అంటూ కామెంట్ చేశాడు. అదే సమయంలో యానీ మాస్టర్ వచ్చి.. 'పని మొత్తం నేనే చేస్తున్నానని చెప్పడం కరెక్ట్ కాదని' సిరితో అనగా.. ఆమె ఏదో చెప్పడానికి ప్రయత్నిస్తే.. 'నువ్ మాట్లాడితే మజాక్.. నేను మాట్లాడితే రజాక్..' అంటూ స్టేట్మెంట్ ఇచ్చింది. దీంతో సిరి అసహనానికి గురై సైలెంట్ గా ఉండిపోయింది.
Also Read:'ఆహా'లో బాలయ్య టాక్ షో.. నిజమెంత..?
కాజల్ పై రవి ఫైర్..
ఆ తరువాత ఈరోజు డిన్నర్ కి ఏం చేస్తున్నారని రవి, లోబోలను అడిగింది కాజల్. వాళ్లు ఏదో లిస్ట్ చెప్తుండగా.. ''నిన్న గొడవ జరిగింది దేనికి అంటే.. రవి, ఇంకా లోబో వాష్ రూమ్‌లో నుంచి లేచి, డిన్నర్‌లోకి రావడానికి'' అని సరదాగా ఆటపట్టించింది కాజల్. అది రవికి రెచ్చగొట్టినట్లుగా అనిపించింది. లోబో పరోక్షంగా కాజల్ కి మిడిల్ ఫింగర్ చూపించాడు.
అదే విషయాన్ని కాజల్ హౌస్ మేట్స్ తో చర్చిస్తుండగా.. 'నాకు అలా ఎవరైనా చూపిస్తే కట్ చేసి పారేస్తా' అంటూ ప్రియాంక చెప్పింది. ఇంతలో అక్కడకి రవి, లోబో వచ్చారు. 'నేను సరదాగా అన్నాను' అని కాజల్ చెప్పగా.. 'నీకు సరదానేమో, అవతలి వ్యక్తికి కాదు, అది తెలుసుకోకుండా ఎలా వస్తారు.. నా నోట్లో నుంచి తప్పుడు మాటలు వస్తాయేమో అని కంట్రోల్ చేసుకుంటున్నా..' అంటూ రవి మండిపడ్డాడు. ఈ క్రమంలో కాజల్, రవి ఒకరిపై మరొకరు అరుచుకుంటూ మాట్లాడారు. 'నాకు లోబో మిడిల్ ఫింగర్ చూపించడం నీకు ప్రాబ్లెమ్ కాదు కదా' అని రవిని ప్రశ్నించింది కాజల్. ఈ మొత్తం ఇష్యూని శ్రీరామ్ పరిష్కారించడానికి ప్రయత్నిస్తుండగా.. 'ఇంటికి పెద్దాయన ఈ మ్యాటర్ సెటిల్ చేస్తున్నాడు' అంటూ జెస్సీ దగ్గర సెటైర్ వేసి నవ్వుకున్నాడు షణ్ముఖ్.
కెప్టెన్సీ టాస్క్..
'రాజ్యానికి ఒక్కడే రాజు' అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో రవి, సన్నీలు రాకుమారులుగా మారి.. సింహాసనం గెలుచుకోవాలి. హౌస్ మేట్స్ అందరూ ప్రజలుగా ఉంటారు. ఏ రాకుమారుడికైతే ప్రజల మద్దతు దొరుకుతుందో వారే రాజుగా ఎంపికవుతారు. ఈ క్రమంలో బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చారు.
మట్టిలో మహాయుద్ధం..
రాకుమారులకు సంబంధించిన వ్యక్తులు మట్టిలో మల్లయుద్ధం చేయాల్సి ఉంటుంది. దీంతో ఇద్దరు రాకుమారులు తమ తమ రాజ్యాల నుంచి ఆటకు ఎవరిని పంపించాలా..? అని చర్చుకుంటూనే ఉన్నారు. ఇంతలో కొందరు ప్రజలు నిధిలో ఉన్న నాణేలను దొంగిలించడం మొదలుపెట్టారు. రవికి సపోర్ట్ చేస్తోన్న విశ్వ.. ఈ దొంగతనం విషయంలో సీరియస్ అయ్యాడు. 'చేతకాని వాళ్లు చేసే చిల్లర పనులివి..' అంటూ ఫైర్ అయ్యాడు.
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
క్రికెట్
ఆంధ్రప్రదేశ్
ఇండియా
సినిమా
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement
Sadhguru is a Yogi, mystic, visionary and authorYogi, mystic, visionary and author
Opinion