Bigg Boss 5 Telugu: కెప్టెన్ గా విశ్వ.. ఫైర్ అయిన ఉమాదేవి.. దీప్తి వీడియో చూసి ఎమోషనల్ అయిన షణ్ముఖ్..
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం కెప్టెన్సీ టాస్క్ సాగుతూనే ఉంది.
బిగ్ బాస్ హౌస్ లో ఈ వారం మొత్తం కెప్టెన్సీ టాస్క్ సాగుతూనే ఉంది. 'పంతం నీదా నాదా' టాస్క్ లో ఇంటి సభ్యులందరూ మూడో లెవెల్ కి చేరుకున్నారని.. వారందరికీ 'అగ్గిపుల్లా.. మజాకా' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఈ టాస్క్ లో Team Eagle గెలిచింది. ఆ తరువాత హౌస్ లో శ్వేతా పుట్టినరోజు వేడుకలు జరిపారు. టీవీలో శ్వేతా ఇంటి సభ్యులు విషెస్ చెప్పిన వీడియోను ప్లే చేశారు.ఇక రెండు రోజులుగా జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్.. 'పంతం నీదా నాదా..'లో ఎక్కువ ఫ్లాగ్స్ సాధించి Team Eagle విజేతలుగా నిలవడంతో వారికి శుభాకాంక్షలు చెప్పాడు బిగ్ బాస్.
మానస్-లహరి ట్రాక్..
ఆ తరువాత రాత్రి లహరి గిన్నెలు క్లీన్ చేస్తుండగా.. మానస్ వెళ్లి మాటలు కలిపాడు. కాసేపు తమ ఫేవరెట్ కలర్స్ గురించి మాట్లాడుకొని.. గుడ్ నైట్ చెప్పుకుంటూ హగ్ చేసుకున్నారు. లహరి తన మైక్ తీసేసి కొన్ని సెకన్ల పాటు మానస్ ని హగ్ చేసుకొనే ఉంది. ఉదయం లేవగానే మళ్లీ ఇద్దరూ కలిసి ముచ్చట్లు పెట్టుకున్నారు. శ్వేతా చేయి నొప్పిగా ఉందని చెప్పడంతో ఆమె చేతిని పట్టుకొని మసాజ్ చేశాడు మానస్.
కెప్టెన్ గా విశ్వ.. ఫైర్ అయిన ఉమాదేవి..
Team Eagle కెప్టెన్సీ టాస్క్ కి అర్హులుగా మారారు. గేమ్ కి కెప్టెన్ గా వ్యవహరించిన శ్రీరామచంద్రను టీమ్ లో బెస్ట్ ప్లేయర్స్ నలుగురిని సెలెక్ట్ చేసి చెప్పమని అడగ్గా.. యానీ మాస్టర్, విశ్వ, హమీద, ప్రియాంక ల పేర్లు చెప్పారు. వీరికి 'కొడితో కొట్టాలిరా.. కొబ్బరికాయ కొట్టాలి' అనే టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్.
ఈ టాస్క్ లో నలుగురు పోటీదారుల ముందు నాలుగు బీకర్స్ ఉంచారు. ఫైనల్ బజర్ మోగేసరికి ఎవరి బీకర్స్ లో ఎక్కువ కొబ్బరినీళ్లు ఉంటాయో వాళ్లే విన్నర్స్. అంటే హౌస్ మేట్స్ ఎవరిని విన్నర్ ని చేయాలనుకుంటున్నారో వాళ్లే ఈ టాస్క్ లో విజేతలయ్యేలా టాస్క్ డిజైన్ చేశారు. హౌస్ మేట్స్ తాము సపోర్ట్ చేయాలనుకున్న కంటెస్టెంట్స్ బీకర్స్ ను కొబ్బరికాయలు కొట్టి ఆ నీళ్లతో నింపాల్సి ఉంటుంది. ఇందులో విశ్వ బీకర్ త్వరగా ఫిల్ అవ్వడంతో అతడే విన్నర్ గా నిలిచాడు. అయితే ఎలాంటి డిస్టర్బన్స్ లేకుండా టాస్క్ అయిపోయిందని ఉమాదేవి కాసేపు తన వెర్షన్ వినిపించింది. కాంప్రమైజ్ అయిపోయి గేమ్ ఆడితే ఇంక బిగ్ బాస్ హౌస్ లో ఎందుకని.. ఇంట్లో కూర్చొని ఆడుకోవచ్చంటూ మండిపడింది.
హమీదతో షణ్ముఖ్ ట్రాక్..
అనంతరం షన్నుకు హమీదాకు మధ్య లవ్ ట్రాక్ నడిపేందుకు రవి.. SD (షన్ను - దీప్తి) అక్షరాలతో ఉన్న షన్ను పిల్లలో H (హమీదా) కూడా చేర్చి.. SDH అని మార్చాలని షణ్ముఖ్‌తో అన్నాడు. హమీదా కూడా ఇంట్లో ఉన్నన్ని రోజులు SH (షన్ను - హమీద), బయటకు వెళ్లిన తర్వాత SD చేసుకో అంటూ హమీదా చెప్పడంతో ఒక్కసారిగా నవ్వేశారు. హమీదా షన్ను.. ‘‘రా.. చేయి పట్టుకో’’ అనడం, అది చూసి లహరీ ‘‘దీప్తీ ఇక్కడ కూడా ఒక కన్నేసి ఉంచండి’’ అనడం ఫన్నీగా ఉంది.
సింగిల్ బెడ్ కోసం పోటీ..
సింగిల్ బెడ్ ని దక్కించుకోవడం కోసం ఉమాదేవి, లోబోలకు ఒక టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. వారిద్దరిలో ఎవరు హౌస్ మేట్స్ ని బాగా ఎంటర్టైన్ చేస్తారో వాళ్లకు బెడ్ దక్కుతుందని చెప్పారు. ఈ క్రమంలో లోబో ఆటో డ్రైవర్ గా అవతారమెత్తాడు. ఇంతలో లోబో ఆటో ఎక్కడానికి ప్రియాంక వస్తుంది. సికింద్రాబాద్ వెళ్లాలని ఆటో ఎక్కుతుంది. అలా వీరిద్దరూ కలిసి ఆటోలో ప్రయాణిస్తూ ఫన్ క్రియేట్ చేశారు.
ఆ తరువాత ఉమాదేవి, సిరి కలిసి అత్తాకోడళ్లుగా ఓ టాస్క్ చేశారు. సిరిని పొగిడేస్తూ.. తన కొడుకుగా షణ్ముఖ్ పేరు చెబుతూ రచ్చ చేసింది ఉమాదేవి. అత్తాకోడళ్లు ఎక్స్ పెక్టేషన్స్ వర్సెస్ రియాలిటీ అంటూ సాగిన ఈ టాస్క్ చూసి హౌస్ మేట్స్ బాగా నవ్వుకున్నారు.
అయితే ఈ టాస్క్ లో ఉమాదేవి కంటే లోబో ఎక్కువగా నవ్వించడంతో అతడిని టాస్క్ విజేతగా ప్రకటించారు హౌస్ మేట్స్. దీంతో లోబోకి సింగిల్ బెడ్ దక్కింది.
షణ్ముఖ్ బర్త్ డే సెలబ్రేషన్స్..
షణ్ముఖ్ పుట్టిన రోజు సందర్భంగా హౌస్ మేట్స్ అందరూ కలిసి సెలబ్రేట్ చేశారు. షణ్ముఖ్ తల్లితండ్రులు, దీప్తి వీడియో మెసేజ్‌ను బిగ్ బాస్ టీవీలో చూపించారు. షణ్ముఖ్ కి 'ఐ లవ్యూ' చెబుతూ స్ట్రాంగ్ గా ఉండమని చెప్పింది దీప్తి. ఆమె వీడియో చూసిన వెంటనే ఎమోషనల్ అయిపోయాడు షణ్ముఖ్.