News
News
X

Bigg Boss 6 Telugu: ప్రేమ పిపాసిని ఎలిమినేట్ చేసిన బిగ్‌బాస్? మళ్లీ మెరీనా సేఫ్?

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ నుంచి మరొక్క రోజులో మరో ఇంటి సభ్యుడు ఎలిమినేట్ కాబోతున్నాడు.

FOLLOW US: 
 
Bigg Boss 6 Telugu: ఈ వారం ఎలిమినేట్ అవుతుంది అనుకున్న కంటెస్టెంట్ మెరీనా లేదా వాసంతి అనుకున్నారు అంతా. ఎందుకంటే వీరిద్దరి ఆట మీద ఇంటి సభ్యులంతా కామెంట్లు చేస్తూనే ఉన్నారు. బిగ్ బాస్ కూడా ఎంటర్టైన్ చేయడం లేదంటూ వారిని హెచ్చరిస్తూనే ఉన్నారు. ఈ వారమైతే వాసంతి జైలుకి కూడా వెళ్లింది. కాబట్టి దాదాపు అందరూ మెరీనా లేదా వాసంతి వెళ్లిపోతారని ఫిక్స్ అయిపోయారు. కానీ ఇక్కడే బిగ్ బాస్ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడట.  వారిద్దరినీ కాకుండా ప్రేమి పిపాసి అర్జున్ కళ్యాణ్‌ను  ఎలిమినేట్ చేసినట్టు సమాచారం. 

శ్రీ సత్యకు ప్లస్
నిజానికి అర్జున్ కూడా ఇంట్లో ఆడిందేం లేదు, వచ్చిన రోజు నుంచి శ్రీసత్య చుట్టూ తిరగడం తప్ప. కానీ అర్జున్ వల్ల శ్రీసత్య మాత్రం హైలైట్ అయ్యింది. ఈ అమాయకుడిని ఉపయోగించుకుని తన ఓట్ల గ్రాఫ్ పెంచుకుంది శ్రీసత్య. ఆమె ఛీ కొట్టినా, పొమ్మన్నా కూడా ఆమె చుట్టూనే తిరుగుతూ, ఆమెను గెలిపిస్తూ తాను ఓడుతూ వచ్చాడు అర్జున్. అతని ఆట ప్రేక్షకులకు కూడా ఒక్కోసారి చాలా చికాకుగా అనిపించాయి. చివరికి వీడియో కాల్ ఆఫర్ వచ్చినప్పుడు కూడా తన తల్లిదండ్రులను మర్చిపోయి శ్రీసత్యకు అవకాశాన్ని ట్రాన్స్ ఫర్ చేయచ్చా? అని అడిగాడు బిగ్‌బాస్‌ని. ఆ క్షణం ప్రేక్షకులకు ‘ఇంత పిచ్చోడేంటి’ అనుకున్నారు. 

ముందు నుంచే ఇష్టం...
నిజానికి అర్జున్ కు బిగ్‌బాస్ కు రాకముందు నుంచే శ్రీసత్య అంటే చాలా ఇష్టమట. ఈ విషయం బిగ్ బాస్‌కు వెళ్లకముందు ఆయనిచ్చిన కొన్ని ఇంటర్య్వూలలో చెప్పాడు. అంతేకాదు ఇదే విషయాన్ని వాసంతి కూడా ఇంటి సభ్యులకు ఓసారి చెప్పింది. ఓ షూటింగ్ సమయంలో శ్రీసత్య అంటే ఇష్టమని చెప్పినట్టు తెలిపింది. అందుకే తనకు అర్జున్ మీద ఎలాంటి ఫీలింగ్స్ రావని చెప్పేసింది. మొత్తమ్మీద ఈ ప్రేమ పిపాసిని బిగ్ బాస్  బయటికి పంపించేస్తున్నట్టు తెలుస్తోంది. 

ఇప్పటికే ఆరుగురు...
బిగ్ బాస్ సీజన్ 6లో ఇప్పటివరకు ఆరుగురు ఎలిమినేట్ అయ్యారు. ఇప్పుడు ఏడో వ్యక్తిగా అర్జున్ బయటికి వెళ్లబోతున్నాడు. మొదటి వారం ఎవరినీ ఎలిమినేట్ చేయలేదు. రెండో వారం నుంచి షానీ సాల్మన్, అభినయ శ్రీ, నేహా చౌదరి, ఆరోహి, చలాకీ చంటి, సుదీప ఎలిమినేట్ అయ్యారు. త్వరలో ఆ జాబితాలో అర్జున్ కూడా చేరబోతున్నాడని తెలుస్తోంది. 

News Reels

ఈ వారం ఎలిమినేషన్లో గీతూ, సూర్య తప్ప మిగతా అందరూ ఉన్నారు. అందుకే ఈసారి ఎవరు బయటకు వెళతారో అంచనా వేయడం కూడా కష్టమైంది. మెరీనా - వాసంతిలలో ఒకరు వెళ్లిపోతారని హౌస్ సభ్యులు కూడా భావించారు. అర్జున్ కళ్యాణ్ ఎలిమినేషన్ ఇంటి సభ్యులకు కూడా షాక్ ఇవ్వడం ఖాయం. అర్జున్ వెళ్తే శ్రీసత్య ఎలా ఫీలవుతుందో తెలుసుకోవాలంటే రేపటి ఎపిసోడ్ వరకు ఆగి చూడాలి.

Also read: అందుకేనా ఇనయా సూర్యను వదిలి శ్రీహాన్‌ను పొగుడుతోంది - నాగార్జున వాయింపు మామూలుగా లేదు

Published at : 22 Oct 2022 07:49 PM (IST) Tags: Elimination Bigg Boss 6 Telugu Arjun Kalyan Bigg boss 6 Telugu Nagarjuna Biggboss Daily Updates

సంబంధిత కథనాలు

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Bigg Boss 6 Telugu: బిగ్ బాస్ ఇంట్లో మళ్ళీ ఏకాభిప్రాయం రచ్చ - 'వరస్ట్ డెసిషన్ ఆఫ్ ది సీజన్' అనేసిన ఆదిరెడ్డి

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Revanth Becomes Father:సింగర్ రేవంత్ ఇంట సంబరాలు, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన అన్విత

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

Bigg boss 6 Telugu: గుడ్డు జాగ్రత్త టాస్కులో శ్రీసత్యతో రేవంత్ వాదన - కొనసాగుతున్న టిక్కెట్ టు ఫినాలే రేస్

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Bigg Boss 6 Telugu: టిక్కెట్ టు ఫినాలే రేసులో కీర్తికి కోపం - కాలితో తన్నిన కార్తీక దీపం బ్యూటీ

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

Bigg Boss 6 Telugu Episode 88: ఫస్ట్ ఫైనలిస్టుగా ఆదిరెడ్డి? ఓటమిని తీసుకోలేకపోయిన రేవంత్

టాప్ స్టోరీస్

TS Govt : తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

TS Govt :  తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం, దివ్యాంగుల కోసం ప్రత్యేక మంత్రిత్వశాఖ

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

NRI Hospital Godava : ఎన్నారై ఆస్పత్రి డైరక్టర్ల మధ్య గొడవలే కొంప ముంచాయా ? ఈడీ, ఐటీ దాడుల వెనుక అసలేం జరిగింది ?

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Impact Player: ఐపీఎల్‌లో ‘ఇంపాక్ట్ ప్లేయర్’ రూల్ - ఒక ఆటగాడిని అదనంగా!

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?

Monster Movie Review : హానీ రోజ్‌తో లక్ష్మీ మంచు లిప్ లాక్, మోహన్‌లాల్‌తో ఫైట్ - 'మాన్‌స్టర్' ఎలా ఉందంటే?