అన్వేషించండి

Bigg Boss 6 Telugu: అందుకేనా ఇనయా సూర్యను వదిలి శ్రీహాన్‌ను పొగుడుతోంది - నాగార్జున వాయింపు మామూలుగా లేదు

Bigg Boss 6 Telugu: ఈ వారం వీకెండ్ ఎపిసోడ్ లో నాగార్జున ఇంటి సభ్యుల పట్ల కాస్త కోపంగానే ఉన్నట్టున్నారు.

Bigg Boss 6 Telugu: వీకెండ్లో నాగార్జున షో కోసం ఎదురు చూసే వారు ఎంతోమంది. ఈ వారం మరీ ఎదురుచూశారు. ఎందుకంటే ఇంటి సభ్యులు ఆట వరస్ట్ గా ఉండడంతో వారికి నాగ్ ఏ విధంగా క్లాస్ తీసుకుంటారో చూడాలన్నది వారి ఆశ. అయితే నాగార్జున అంత కటువుగా మాట్లాడలేదు కానీ, ఇంటి సభ్యుల పట్ల కాస్త కోపంగానే ఉన్నట్టు కనిపించారు. వారందరితో కాస్త పుల్ల విరుపుగానే మాట్లాడారు. ముఖ్యంగా రేవంత్ ఈ వారం బలైపోయాడు. అతడిని పదే పదే పప్పు పప్పు అంటూ నాగార్జున శిక్ష వేస్తూనే ఉన్నారు. రేవంత్‌ని సరిగా మాట్లాడనివ్వలేదు కూడా. ఇక రెండో ప్రోమోలో ఏముందంటే...

ఇనయా ఎందుకిలా మారింది?
కీర్తి ఒసేయ్ రాములమ్మలో విజయశాంతి క్యారెక్టర్ ఓ టాస్కులో భాగంగా చేసిన సంగతి తెలిసిందే. రాములమ్మ పాత్ర గురించి సూర్యనే కీర్తికి చెప్పి నటించేలా చేశాడు. అదే విషయాన్ని నాగార్జున మాట్లాడారు. ‘రాములమ్మ పాత్ర విషయంలో కీర్తికి సాయం చేసింది ఎవరు’ అని అడిగారు నాగార్జున. సూర్య అని చెప్పింది కీర్తి. మరి ఇనయాకు సూర్య ఎందుకు హెల్ప్ చేయలేదు అని అడిగారు నాగ్. దానికి ఇనయా ‘మీ టీమ్ వాళ్లెవరూ చెప్పలేదా నీకు’ అని సూర్య అన్నాడని చెప్పింది. దానికి నాగార్జున ‘అందుకేనా శ్రీహాన్‌ను పొగడడం మొదలుపెట్టావా?’ అని అడిగారు. 

మోస్ట్ అన్‌డిజర్వింగ్ ఎవరు?
ఇంట్లో ఉండడానికి మోస్ట్ డిజర్వింగ్ ఎవరు అని అడిగితే ఇంటి సభ్యులు ఎవరు పేర్లు చెప్పారో ప్రోమోలో చూపించలేదు. కానీ ఎవరు ఇంట్లో అన్‌డిజర్వింగ్ అని అడిగితే మాత్రం ఎక్కువ మంది మెరీనా పేరు చెప్పారు. గీతూ అయితే ‘కలిసి ఆడమన్నప్పుడు విడివిడిగా ఆడారు, విడివిడి ఆడమంటే కలిసి ఆడుతున్నారు’ అంటూ చెప్పింది.   

వాసంతి మాట్లాడుతూ వందశాతం కష్టపడ్డానని, అందుకే జైలుకు వెళ్లానని అంది. దానికి నాగార్జున జైలుకు వెళితే మోస్ట్ డిజర్వింగ్ అని నీ ఫీలింగా అని అడిగారు. దీంతో ప్రోమో ముగిసింది. ఈ వారం నిజం చెప్పాలంటే గీతూ కూడా పెద్దగా ఆడింది లేదు, ఆదిరెడ్డి కూడా ఆడింది లేదు. అయినా ఎందుకో వీరిద్దరి జోలికి పోరు నాగార్జున.  ఈ వారం ఆడినవారిలో వాసంతి ఉంది. కానీ ఎంటర్టైన్మెంట్ టాస్కులో పేలవగా ఆడింది. ఈమె మాత్రమే దాదాపు ఒకరిద్దరూ తప్ప అందరూ అలాగే ఉన్నారు. అయినా వాసంతి మాత్రమే టార్గెట్ అయింది. కాబట్టి ఈమె కచ్చితంగా ఈ వారం ఎలిమినేట్ అయ్యే అవకాశం తక్కువే.

ఈ వారం నామినేషన్లలో గీతూ, సూర్య తప్ప అందరూ ఉన్నారు. అయితే ఈసారి డేంజర్ జోన్లో ఉన్నది ఇనయా, మెరీనా అని సమాచారం. వీరిద్దరిలో మెరీనాను ఎలిమినేట్ చేసే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే ఇనయా ఉంటే ఎప్పుడోసారి కంటెంట్ వస్తుంది. మెరీనా వల్ల వచ్చే కంటెంట్ సున్నా అనే చెప్పాలి. ఆమె ఎలిమినేట్ అయినా పెద్దగా ఒరిగేదేమీ లేదు. 

Also read: పప్పూ నువ్వు కూర్చో - రేవంత్‌కి నాగార్జున చేతిలో మూడినట్టే ఉంది ఈసారి

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Winner Wedding: తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
తమిళ నటుడిగా బిగ్ బాస్ విన్నర్ పెళ్లి... సింపుల్‌గా గురువాయూర్ టెంపుల్‌లో!
Uppal Balu Navdeep: ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
ఎవడెవడో ఏదేదో అంటాడు... ఉప్పల్ బాలు కాంట్రవర్సీపై నవదీప్ రియాక్షన్
Shiva Srishti Vyakaranam: మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
మోడలింగ్ నుంచి బిగ్ బాస్ 10 తెలుగు అగ్నిపరీక్ష వరకు.. శివ సృష్టి వ్యాకరణం గురించి ఆసక్తికర విషయాలు
Bigg Boss Agnipariksha 2 : 'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్
'మీరు ట్రాన్స్ కదా?' - ఆ కామెంట్స్‌పై నెటిజన్స్ ఫైర్... ఉప్పల్ బాలుకు నెట్టింట పెరుగుతున్న సపోర్ట్

వీడియోలు

India vs Sri Lanka 1st Test Day 2 Highlights | గాలే టెస్టులో దంచికొట్టిన పడిక్కల్
Sunil Gavaskar Questions Players Fitness | టీమిండియా ఫిట్‌నెస్‌పై గవాస్కర్ షాకింగ్ కామెంట్స్
Bigg Boss Agnipariksha Uppal Balu | అగ్నిపరీక్షపై ఉప్పల్ బాలు సంచలన వ్యాఖ్యలు
Jadeja Comments On His Batting Position | బ్యాటింగ్ స్థానాలపై జడేజా తీవ్ర అసంతృప్తి
Anupama Parameswaran about Her Best Friend | అనుపమ పరమేశ్వరన్ షాకింగ్ కామెంట్స్

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Nimmala Ramanaidu: 2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
2027 జూలై వరకు తాగునీటికే మొదటి ప్రాధాన్యత: మంత్రి నిమ్మల రామానాయుడు
Satyendar Jain Arrest: ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
ఢిల్లీ జల్ బోర్డ్ టెండర్ల కుంభకోణం.. మాజీ మంత్రి సత్యేంద్ర జైన్ అరెస్ట్- బీజేపీపై కేజ్రీవాల్ ఆగ్రహం
AP Cabinet Decisions: స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
స్థానిక ఎన్నికల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు సహా ఏపీ క్యాబినెట్‌ కీలక నిర్ణయాలివే
CM Revanth Reddy: మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
మహారాష్ట్రలో ఛత్రపతి శివాజీ ఎలాగో.. తెలంగాణలో సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్: సీఎం రేవంత్ రెడ్డి
National Sports Awards: గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
గాయ‌త్రీ , శ్రీకాంత్ లకు అర్జున అవార్డు.. మొత్తం 17 మందికి ఈ పురస్కారాలు, ఈసారి ఎవరికీ దక్కని ఖేల్ రత్న అవార్డు..  
India Dominates Galle Test:  విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
విజ‌యంపై క‌న్నేసిన భార‌త్, లంక ముందు 372 రన్స్ భారీ టార్గెట్.. ఛేజింగ్‌లో తేలిపోయిన ప్రత్యర్థి
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Maruti Alto K10 నుంచి Baleno వరకు.. కార్ల ధరలు పెంచిన మారుతి కంపెనీ
Congress Politics: వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
వివాదాస్పద కాంగ్రెస్ నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది: మహేష్ కుమార్ గౌడ్
Embed widget