అన్వేషించండి

Bigg Boss Telugu 6: టైటిల్ గెలవడానికి వచ్చేసిన నటుడు అర్జున్ కళ్యాణ్!

ఏడో కంటెస్టెంట్ గా నటుడు అర్జున్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు.

బుల్లితెరపై నెంబర్ వన్ రియాలిటీ షోగా దూసుకుపోతుంది బిగ్ బాస్(Bigg Boss). అన్ని భాషల్లో ఈ షో సూపర్ హిట్ అయింది. తెలుగులో కూడా ఈ షోకి మంచి గుర్తింపు వచ్చింది. ఇప్పటివరకు ఐదు సీజన్లను పూర్తి చేసుకుంది. అలానే ఈ ఏడాది ఓటీటీ వెర్షన్ తో ఆడియన్స్ ను ఎంటర్టైన్ చేయాలనుకున్నారు. హాట్ స్టార్ లో 24 గంటల కాన్సెప్ట్ తో ఈ షోని నడిపించారు. కానీ ఆశించిన స్థాయిలో ఓటీటీ వెర్షన్ క్లిక్ అవ్వలేదు.
 
ఇదిలా ఉండగా.. బిగ్ బాస్ సీజన్ 6 కోసం రంగం సిద్ధమైంది. సెప్టెంబర్ 4 నుంచి ఈ షోని మొదలుపెట్టారు. ఇప్పటివరకు నాలుగు సార్లు ఈ షోని హోస్ట్ చేసిన నాగార్జున ఇప్పుడు ఐదోసారి కూడా హోస్ట్ గా వ్యవహరించనున్నారు. ఈసారి మొత్తం 18 మంది కంటెస్టెంట్స్ కనిపించనున్నారు. ఆదివారం నాడు గ్రాండ్ గా షో మొదలైంది. ఇక కంటెస్టెంట్స్ ను ఒక్కొక్కరిగా నాగార్జున ఇంట్రడ్యూస్ చేస్తున్నారు.
 
ఏడో కంటెస్టెంట్ గా నటుడు అర్జున్ కళ్యాణ్ ఎంట్రీ ఇచ్చారు. 'అక్డి పక్డి' అంటూ బీట్ ఉన్న సాంగ్ కి మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చారు. ఇతడు 'ప్లే బ్యాక్', 'పెళ్లికూతురు పార్టీ' వంటి సినిమాల్లో నటించారు. స్టేజ్ పైకి వచ్చిన అర్జున్ ''నేను మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చా.. వైజాగ్ లో ఇంజనీరింగ్, అమెరికాలో ఎమ్మెస్ చేశా. న్యూయార్క్ ఫిలిం ఎకాడమీలో కోర్స్ చేశా. కొన్ని సినిమాలు చేశా. నాకు బిగ్ బాస్ మంచి ప్లాట్ ఫామ్ అవుతుందని భావిస్తున్నాను. ప్రేక్షకుల ప్రేమ గెలుచుకోవాలనుకుంటున్నాను. అలానే టైటిల్ గెలవాలనుకుంటున్నాను'' అంటూ చెప్పుకొచ్చారు. నాగ్ తో ట్రూత్ ఆర్ డేర్ ఆడుతూ.. 'సిట్యుయేషన్ ని బట్టి రియాక్ట్ అవుతానని నాగార్జునతో అన్నారు' అర్జున్. ఏదైనా సీక్రెట్ చెప్పమని నాగార్జున.. అర్జున్ ని అడిగారు. దానికి అతడు 'నాకొక బ్రేకప్ జరిగింది. ఆ సమయంలో చాలా డిప్రెషన్ లోకి వెళ్లిపోయా' అని చెప్పుకొచ్చారు. 
 
కంటెస్టెంట్స్ ని ఒక్కొక్కరినీ ఒక్కో కార్డు సెలెక్ట్ చేసుకోమని అడుగుతున్నారు నాగార్జున. నేహా సెలెక్ట్ చేసుకున్న కార్డు బ్లాక్ హార్ట్. దానికి అర్ధం ఏంటో తరువాత చెబుతానని అన్నారు నాగార్జున. 
 
ఇక ఈసారి అబ్బాయిల నెంబర్ కంటే అమ్మాయిలే ఎక్కువ మంది హౌస్ లో కనిపించబోతున్నారు. ఎప్పటిలానే ఈసారి కూడా బిగ్ బాస్ హౌస్ ని చాలా కొత్తగా డిజైన్ చేశారు. మొత్తం 18 మంది పోటీదారులు కాబట్టి ఈసారి షో 100 రోజులకు పైగానే ఉండే ఛాన్స్ ఉంది. మధ్యలో డబుల్ ఎలిమినేషన్స్ కూడా ఉంటాయి. ఇక టాస్క్ ల విషయానికొస్తే.. బిగ్ బాస్ హిందీ వెర్షన్ నుంచి కొన్ని టాస్క్ లను సీజన్ 6 కోసం తీసుకోబోతున్నారని సమాచారం. గత సీజన్లలో కూడా టాస్క్ లకు సంబంధించి ఇలానే చేశారు. 

టాప్ హెడ్ లైన్స్

Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: ఇద్దరు ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: అపూర్వ, చరణ్‌ ఎలిమినేట్.. ఐదుగురు వైల్డ్‌కార్డ్స్‌ ఎంట్రీ! అందరి టార్గెట్ ఆ లవ్‌బర్డ్సే!
Bigg Boss Season 10 Today Episode: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: రోహిత్‌ని బయటకు పంపేయాలంటోన్న ఇంటి సభ్యులు! నాగ్ ఇచ్చిన వార్నింగ్స్‌ ఇవే!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ఎపిసోడ్: పవర్ వాడి నామినేషన్స్ నుంచి సేవ్ అయిన ఝాన్సీ! డేంజర్ జోన్‌లో రోహిత్! కెప్టెన్ సుధీర్!
Bigg Boss Season 10 Today Promo: బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!
బిగ్‌బాస్ సీజన్ 10 టుడే ప్రోమో: అపూర్వని బయటకు పంపేసిన ఇంటి సభ్యులు! ఇంట్లో దోమగా మారిపోయిన ముకేశ్!

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Vijayawada Durga Temple: విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
విజయవాడ దుర్గమ్మ దసరా ఉత్సవాల వేళ చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ మార్పు
Deputy CM Pawan Kalyan: 2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
2024లో జనసేన చాలా త్యాగం చేసింది, స్థానిక ఎన్నికల్లో మమ్మల్ని గెలిపించండి: పవన్ కళ్యాణ్
Software Engineer Suicide: ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
ముఖానికి కవర్ చుట్టుకుని, హీలియం గ్యాస్ పీల్చి సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ సూసైడ్.. హైదరాబాద్‌లో ఘటన
Air Fryer : ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
ఎయిర్ ఫ్రైయర్ మొదటిసారి ఉపయోగిస్తుంటే తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. చేయకూడని తప్పులుఇవే
Abhishek World Record: సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
సూర్యకుమార్ ఆల్‌టైమ్ రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ .. టీ20ల్లో వేగవంతమైన 2000 పరుగులతో సరికొత్త చరిత్ర
Tiger Rescue Operation: దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
దేచర్ల క్వారీలో పెద్దపులి ప్రత్యక్షం.. డ్రోన్ల సాయంతో బంధించేందుకు అటవీ శాఖ రెస్క్యూ ఆపరేషన్
IndiGo Flight Emergency Landing: విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
విమానంలో పేలిన పవర్ బ్యాంక్! శంషాబాద్‌లో ఇండిగో ఫ్లైట్ ఎమర్జెన్సీ ల్యాండింగ్‌
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Small Hybrid Cars: ఇక చిన్న కార్లలోనూ హైబ్రిడ్ టెక్నాలజీ.. దాని వల్ల మైలేజ్ పెరుగుతుందా ?
Embed widget