Bigg Boss 6 Telugu: తానే విన్నర్ అనే ఫీలింగ్‌లో ఆదిరెడ్డి, శ్రీసత్యతో శ్రీహాన్ పులిహోర కబుర్లు - ఇవేం లెక్కలు సామి
బిగ్ బాస్ మరో కొత్త గేమ్ మొదలుపెట్టాడు. అయితే ఈ గేమ్ లో ఆడనని అలాగే మొండిగా కూర్చున్నాడు ఆదిరెడ్డి.
ఈసారి బిగ్ బాస్ విన్నర్ ఎవరు అవుతారో కానీ వాళ్ళ ప్రైజ్ మనీకి బాగానే కోత పడేలా ఉంది. మొన్నటికి మొన్న ఖాళీ చెక్ ఇంటి సభ్యులందరికీ ఇచ్చి దాని మీద కొంత అమౌంట్ రాయమని చెప్పారు. ఎవరైతే ఎక్కువ ఎమౌంట్ వేస్తారో వాళ్ళు ఈ వారం నామినేషన్ల నుంచి సేవ్ అవుతారని అన్నారు. అయితే ఆ మొత్తం విన్నింగ్ ప్రైజ్ అయిన యాబై లక్షల నుంచి కట్ అవుతుందని బిగ్ బాస్ చెప్పారు. ఈ టాస్క్ లో రాజశేఖర్ గెలిచాడు. అందరి కంటే అధికంగా రాయడంతో అతను సేవ్ అయ్యాడు. ఈ వారం రాజ్ ఇమ్యూనిటీ పొందాడు.
ఇప్పుడు కూడా అలాంటిదే మరో కొత్త గేమ్ ఇంటి సభ్యులకి ఇచ్చారు బిగ్ బాస్. ఎవిక్షన్ ఫ్రీ పాస్ గెలుచుకునే పోటీ పెట్టారు. ఏ ముగ్గురు ఇంటి సభ్యులైతే ముందుగా బజర్ నొక్కి ఎవిక్షన్ ఫ్రీ పాస్ కొనుగోలు చేస్తారో వాళ్ళు పాస్ కోసం పోటీ పడే అవకాశం పొందుతారు. ఈ గేమ్ లో ఆదిరెడ్డి ఆడను అని పక్కన కూర్చున్నాడు. బిగ్ బాస్ ఒక టాస్క్ ఇచ్చినప్పుడు అందులో పాల్గొనాలి కదా అని ఇనయా చెప్తుంటే.. ఆదిరెడ్డి తాను ఆడకూడదు అనుకోవడం కూడా టాస్క్ అని విరుద్ధంగా మాట్లాడాడు. నువ్వు విన్నర్ కాకపోతే వేరే వాళ్ళ డబ్బులతో ఇక్కడ వన్ వీక్ ఉంటున్నావ్ అంటూ చెత్త లాజిక్ చెప్పాడు.
మొదట రూ.80 వేలు చూపించినప్పుడు ఫైమా బజర్ నొక్కడానికి ట్రై చేసింది. దీని గురించి ఆదిరెడ్డి ఫైమాకి సలహా ఇచ్చాడు. బిగ్ బాస్ ఆ పాస్ ఎప్పుడు ఇస్తారో తెలియదు. ఈ వారం నీకు ఆడియన్స్ ఓటు వెయ్యరు అని ఫైమాతో చెప్పాడు ఆదిరెడ్డి. అసలు ఈ గేమ్ లో ఉంటేనే కదా అంతకవరకు వెళ్ళేది అది ఎందుకు ఆలోచించడం లేదని రేవంత్ తోటి ఇంటి సభ్యులతో అన్నాడు. విన్నర్ తానే అన్నట్లు ఫీలై పోతున్నాడు ఆదిరెడ్డి. రెండో సారి బజర్ రేవంత్ నొక్కాడు. రూ.1,50,000 కనిపించినప్పుడు శ్రీహాన్ బజర్ నొక్కాడు. ఎందుకు నొక్కావ్ అని శ్రీసత్య అడుగుతుంది. ‘ఒక వీక్ అయినా నువ్వు నాతో ఉంటావ్ కదా, నువ్వు ఉన్న వాల్యూ రూ.1,50,000 అంటే అది తక్కువే కదా. నువ్వు నాతో ఉంటాను అంటే రూ.2,00,000 అమౌంట్ అయినా.. ఆ అమౌంట్ లో కట్ చేసినా ఒకే’ అని డైలాగ్ వేసేస్తాడు శ్రీహాన్. ఆ మాటకి శ్రీసత్య తెగ మురిసిపోతుంది.
ఇక ఈ వారం నామినేషన్లలో ఉన్న సభ్యులు ఎవరంటే..
1. రోహిత్
2. ఇనాయ
3. శ్రీహాన్
4. ఆదిరెడ్డి
5. రాజ్
6. రేవంత్
7. మెరీనా
8. శ్రీసత్య
9. కీర్తి
గత ఆదివారం బిగ్ బాస్ గ్లామర్ క్వీన్ వాసంతి ఎలిమినేట్ అయ్యింది. ఈ వారం ఎవరు అవుతారో అన్నదానిపై ఇంకా అంచనాలు వేయలేక పోతున్నాం. మెరీనా వెళ్లిపోయే ఛాన్సు అధికంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇంతవరకు మెరీనా ఆట కన్నా చక్కటి ప్రవర్తన, మాటతీరుతో వచ్చింది. ఇకపైనా బిగ్ బాస్ ఏం నిర్ణయం తీసుకుంటారో చూడాలి.