Bigg Boss 6 Telugu: కీర్తి చెప్పిన సామెతలో తామే కుక్కలమని ఫీలైపోతున్నా శ్రీసత్య, శ్రీహాన్ - వీరికి సామెతలు కూడా అర్థం కావన్నమాట
Bigg Boss 6 Telugu: ఇంట్లో శ్రీహాన్, శ్రీసత్య ఓవర్ యాక్షన్ స్టార్లుగా మారిపోయారు. అందుకే వీరికి నిబ్బా నిబ్బి అనే నిక్ నేమ్‌లు కూడా వచ్చేశాయి.
Bigg Boss 6 Telugu: ఏదైనా సామెత చెప్పారంటే అది కేవలం ఒక ఉదాహరణగా చెబుతారు. టైమ్ బాగోలేనప్పుడు ‘అరటి పండు తిన్నా పన్ను విరుగుద్ది’ అంటారు. అందులో అరటి పండు ఎవరు? పన్ను ఎవరు? అంటే చెప్పడం కష్టం. అది పరిస్థితులకు అద్ధం పట్టేలా ఉండే సామెత.కానీ కీర్తి రెండు మూడు వారాల క్రితం చెప్పిన సామెతలో కుక్కలం తామే అంటూ శ్రీహాన్, శ్రీసత్య తెగ ఫీలైపోతున్నారు. తామే ఆ విషయాన్ని హైలైట్ చేసుకుంటూ ప్రేక్షకులకు చిరాకు తెప్పిస్తూ... నెటిజన్ల చేత ‘అవును మీరే కుక్కలు’ అని తిట్టించుకునేంత వరకు వచ్చారు.
రెండు మూడు వారాల క్రితం మెరీనా, కీర్తి కూర్చుని మాట్లాడుకుంటున్నారు. మెరీనా గీతూని ఉద్దేశించి ఎవరినైనా టార్గెట్ చేస్తే వారినే పదేపదే విసిగిస్తుంది అంది. ఆ సమయంలో గీతూ చుట్టూ శ్రీసత్య, శ్రీహాన్, ఇలా కొంతమంది ఉన్నారు. అప్పుడు మెరీనాతో కీర్తి ‘కన్నడలో ఓ సామెత ఉంది. కుక్కలు అరిస్తే దేవలోకానికి వచ్చే నష్టమేమీ లేదు అని దానర్థం’ అని చెప్పింది. వీకెండ్లో నాగార్జున ఆ సామెత గురించి కామెడీగా మాట్లాడారు. అంతే అక్కడ ఎపిసోడ్ ముగిసింది.
ఈ వారం శ్రీసత్య అదే విషయాన్ని ఎత్తి కీర్తి నామినేషన్లలో, నామినేషన్ తరువాత కూడా గొడవ పెట్టుకుంది. కీర్తి ‘నేను మిమ్మల్ని కుక్కలు అని అనుంటే మీ కాళ్లు పట్టుకుని క్షమాపణ చెబుతా’ అంది. ఆ తరువాత శ్రీహాన్ కూడా కెప్టెన్సీ కంటెండర్ల టాస్కులో అదే విషయాన్ని కీర్తి దగ్గర ప్రస్తావించాడు. ఆమెను ఇమిటిటే చేస్తూ, తన వెకిలి వేషాలు వేస్తూ ప్రేక్షకులను కూడా విసిగించాడు. తన ఫ్యాన్స్ బయట కీర్తిని ఆడేసుకుంటారేమో అంటూ అతి చేష్టలు చేశాడు. నిజానికి బయట కీర్తిని ఎవరూ ఆడుకోవడం లేదు. నిబ్బా స్టార్ అంటూ ట్రోలింగ్ మొదలైపోయింది. ఇలాంటి అతి ఓవర్ యాక్షన్, అతి కాన్ఫిడెన్స్‌తోనే గీతూ బయటికి వెళ్లిపోయింది. కంటెంట్ కోసం అయినా శ్రీసత్య, శ్రీహాన్‌లను చివరి వరకు ఉంచుతారు బిగ్ బాస్ టీమ్.
కుక్క అంశంలో ఈ వీకెండ్లో నాగార్జున ఏమైనా క్లారిటీ ఇస్తారేమో చూడాలి. లేకపతే మేమే కుక్కలం అంటూ శ్రీహాన్, శ్రీసత్య ఇద్దరూ సెల్ఫ్ క్రెడిట్ ఇచ్చేసుకుంటున్నారు. కీర్తి మాత్రం తాను ఎవరి పేరు చెప్పలేదని, కేవలం సామెత మాత్రమే చెప్పానని అంది. నిజానికి ఆమె ఆరోజు సామెత మాత్రమే చెప్పింది. శ్రీహాన్, శ్రీసత్య పేర్లు కూడా ఎత్తలేదు.
శ్రీసత్య, ఆదిరెడ్డితో కూర్చుని మాట్లాడుతూ ఈ వారం కీర్తి వెళ్లిపోతుందనిపిస్తోంది అంటూ జోస్యం చెప్పింది. దానికి ఆదిరెడ్డి నాకు కూడా అలాగే అనిపిస్తోంది అన్నాడు. ఇందులో నిజమే ఉందనిపిస్తోంది మెరీనా లేదా కీర్తిలో ఒకరు వెళ్లే ఛాన్సు ఉంది. ఎక్కవగా అయితే మెరీనాకు ఉంది ఛాన్సు.
Also read: డైట్ కోసం నీరు తాగడం తగ్గించారా? అందుకే ఆ హీరో స్పృహ తప్పాడు, నీరు తగ్గితే ఏమవుతుందంటే