Perfume Tittle Song : 'పర్‌ఫ్యూమ్' కోసం భీమ్స్ టైటిల్ సాంగ్ - విడుదల చేసిన 'బిగ్ బాస్' భోలే షావలి
'బిగ్ బాస్ 7'తో వార్తల్లో నిలిచిన వ్యక్తి భోలే షావలి. సంగీత దర్శకుడు భీమ్స్ సిసిరోలియోతో కలిసి 'పర్‌ఫ్యూమ్' టైటిల్ సాంగ్ విడుదల చేశారు ఆయన.
Bheems Ceciroleo latest song in Perfume movie: భీమ్స్ సిసిరోలియో... వరుస విజయాల మీద ఉన్న సంగీత దర్శకుడు. 'మ్యాడ్' సినిమాతో ఈ మధ్య మంచి విజయం ఆయన ఖాతాలో పడింది. అంతకు ముందు 'బలగం', 'ధమాకా' వంటి సినిమాలకు ఆయన సూపర్ డూపర్ హిట్ పాటలు అందించారు. లేటెస్టుగా ఓ చిన్న సినిమా కోసం ఆయన టైటిల్ సాంగ్ కంపోజ్ చేశారు. పూర్తి వివరాల్లోకి వెళితే..
'పర్‌ఫ్యూమ్' కోసం భీమ్స్ సిసిరోలియో పాట!
చేనాగ్, ప్రాచీ థాకర్ జంటగా నటించిన సినిమా 'పర్‌ఫ్యూమ్'. జీడీ స్వామి దర్శకత్వం వహించారు. జె. సుధాకర్, శివ .బి, రాజీవ్ కుమార్ .బి, లావురి శ్రీనివాస్, రాజేంద్ర కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా) సంయుక్తంగా నిర్మించారు. శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్, మిత్రా మూవీ మేకర్స్, ఫరెవర్ ఫ్రెండ్స్ సంస్థలు ఈ చిత్రాన్ని తెరకెక్కించాయి. క్రైమ్ థ్రిల్లర్ చిత్రమిది. ఈ శుక్రవారం (నవంబర్ 24న) సినిమా విడుదల అవుతోంది. ఈ సందర్భంగా సినిమా టైటిల్ సాంగ్ విడుదల చేశారు.
'పర్‌ఫ్యూమ్' సినిమాలో పాటలు అన్నిటికీ అజయ్ సంగీతం అందించగా... ఆస్కార్ పురస్కార గ్రహీత, ప్రముఖ గేయ రచయిత చంద్రబోస్ సాహిత్యం అందించారు. టైటిల్ సాంగ్ (Perfume Movie Title Song)కు మాత్రం భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించగా... సురేష్ గంగుల సాహిత్యం అందించారు. పాటను వరం, కీర్తనా శర్మ ఆలపించారు. ఈ టైటిల్ సాంగ్ 'బిగ్ బాస్ 7' ఫేమ్ భోలే షావలితో పాటు భీమ్స్ సిసిరోలియో విడుదల చేశారు. సినిమాలో హీరో క్యారెక్టర్ బేస్ చేసుకుని ఈ సాంగ్ తెరకెక్కిందని సాహిత్యం వింటే అర్థం అవుతోంది. భీమ్స్ ఛానల్ లో పాట విడుదల చేశారు.
Also Read: విచిత్రకు టార్చర్ - హీరో పిలిస్తే గదికి వెళ్ళలేదని, నోరు విప్పిన 'బిగ్ బాస్' నటి!
''రెండేళ్ల క్రితం దర్శకుడు జేడీ నాకు ఈ ఐడియా చెప్పారు. ఎంతో మంది దగ్గరకు వెళ్లాం. కొందరికి కథే అర్థం కాలేదు. చివరకు, హీరో క్యారెక్టర్ నేను చేశా. సుచిత్రా చంద్రబోస్ గారు చేసిన సహాయం ఎప్పటికీ మరువలేను. స్మెల్లింగ్ అబ్‌సెషన్‌తో కూడిన కథను ఇంత వరకు ఇండియన్ స్క్రీన్ మీద చూడలేదు'' అని చేనాగ్ అన్నారు. కొత్త తరహా కథతో తెరకెక్కించిన ఈ సినిమా తప్పకుండా విజయం సాధిస్తుందని ఆశిస్తున్నట్లు దర్శకుడు జేడీ తెలిపారు.
Also Read: 'రానా నాయుడు 2' అప్డేట్ ఇచ్చిన వెంకీ - ఈసారి ఆ సీన్లు, బూతులు తగ్గుతాయా?
'పర్‌ఫ్యూమ్' చిత్రానికి ఛాయాగ్రహణం: రామ్ కె మహేష్, సంగీతం: అజయ్, సాహిత్యం: చంద్రబోస్, నృత్య దర్శకత్వం: సుచిత్ర చంద్రబోస్ - అన్న రాజ్, కూర్పు: ప్రవీణ్ పూడి, నిర్మాణ సంస్థలు: శ్రీమాన్ మూవీస్ ప్రజెంట్స్ - మిత్రా మూవీ మేకర్స్ - ఫరెవర్ ఫ్రెండ్స్, నిర్మాతలు: జె. సుధాకర్ - శివ బి - రాజీవ్ కుమార్ బి - శ్రీనివాస్ లావూరి - రాజేందర్ కనుకుంట్ల, శ్రీధర్ అక్కినేని (అమెరికా), కథ - స్క్రీన్ ప్లే - దర్శకత్వం: జేడీ స్వామి.