Bigg Boss Tamil 8 promo: ‘బిగ్ బాస్’ హోస్ట్ గా విజయ్ సేతుపతి- క్రేజీగా ఆకట్టుకుంటున్న సీజన్ 8 ప్రోమో!
బిగ్ బాస్ తమిళ్ 8వ సీజన్ కు విజయ్ సేతుపతి హోస్టుగా వ్యవహరిస్తున్నారు. కమల్ హాసన్ తప్పుకోవడంతో ఆయన స్థానంలో విజయ్ సేతుపతి వచ్చారు. తాజాగా ఈ షోకు సంబంధించి విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటున్నది.
Bigg Boss Tamil 8 New Promo: బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు. అన్ని భాషల్లోనూ ఈ షో మంచి ప్రజారదణ దక్కించుకుంది. విమర్శలు సంగతి ఎలా ఉన్నా, సూపర్ రేటింగ్స్ సాధిస్తున్నది. సెప్టెంబర్ 1న తెలుగులో బిగ్ బాస్ 8వ సీజన్ ప్రారంభం అయ్యింది. మొత్తం 14 మంది కంటుస్టెంట్లు 7 జంటలుగా హౌస్ లోకి అడుగు పెట్టారు. తొలివారంలో బేబక్క ఎలిమినేట్ కాగా, ప్రస్తుతం హౌస్ లో 13 మంది ఉన్నారు. అటు తమిళంలోనూ త్వరలో బిగ్ బాస్ షో ప్రారంభం కాబోతోంది. ఇప్పటి వరకు తమిళ బిగ్ బాస్ కు కమల్ హాసన్ హోస్టుగా చేయగా, కొద్ది రోజుల క్రితమే ఆయన ఈ షో నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ప్రస్తుత 8వ సీజన్ కు నటుడు విజయ్ సేతుపతి హోస్టుగా వ్యహరిస్తున్నారు.
ఆకట్టుకుంటున్న బిగ్ బాస్ ప్రోమో
స్టార్ విజయ్ ఛానల్ లో లో తమిళ బిగ్ బాస్ షో టెలీకాస్ట్ కానుంది. అక్టోబర్ 6 నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అవుతుందని ప్రోమోలో వెల్లడించారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదల అయ్యింది. సూటు, బూటు ధరించి విజయ్ సేతుపతి స్టైలిష్ లుక్ లో కనిపించారు. ఈ ప్రోమోలో విజయ్ అన్ని వర్గాల ప్రజలకు అభిప్రాయాలను తెలుసుకుని బిగ్ బాస్ హోస్టుగా ప్రేక్షకుల ముందుకురాబోతున్నట్లుగా చూపించారు. తాజాగా విడుదలైన ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ప్రేక్షకుల నుంచి ఈ షోకు మంచి క్రేజ్ లభిస్తోంది.
View this post on Instagram
భారీ మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్న విజయ్
తొలిసారి బిగ్ బాస్ షోకు హోస్టుగా వ్యవహరిస్తున్న విజయ్ పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ తీసుకుంటున్నారు. మొత్తం 100 రోజుల పాటు కొనసాగే ఈ షోలో ఆయన శని, ఆదివారాలు కనిపించనున్నారు. వీటికి గాను ఆయన ఏకంగా రూ. 60 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి విజయ్ ఒక్కో సినిమాకు రూ. 15 నుంచి రూ. 20 కోట్లు తీసుకుంటారు. బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం ఆయనకు రెగ్యలర్ రెమ్యునరేషన్ తో పోల్చితే మూడు రెట్లు అధికంగా ఇస్తున్నారు. కమల్ హాసన్ హోస్టుగా ఉన్నప్పటి కంటే విజయ్ సేతుపతి షోకు మరింత క్రేజ్ తీసుకొస్తారని భావిస్తున్నారు. అందుకే ఆయనకు పెద్ద మొత్తంలో రెమ్యునరేషన్ ఆఫర్ చేశారు.
వరుస సినిమాలతో ఫుల్ బిజీ
విజయ్ సేతుపతి వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ‘మహారాజ’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆయన, బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. వెట్రిమారన్ దర్శకత్వంలో చేసిన ‘విడుదలై 2’ మూవీ రిలీజ్ కు రెడీ అవుతోంది. మరోవైపు ‘గాంధీ ట్యాక్స్’ అనే సినిమాలోనూ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కొనసాగుతోంది. ఇప్పుడు బుల్లితెర షో బిగ్ బాస్ కు హోస్టుగా చేస్తున్నారు.