అన్వేషించండి
Sreerama Chandra: 'నీకోసం' - శ్రీరామచంద్ర కొత్త సాంగ్ విన్నారా?
ఓ పక్క సినిమాల్లో పాటలు పాడుతూనే మరోపక్క ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటారు శ్రీరామచంద్ర.

'నీకోసం' - శ్రీరామచంద్ర కొత్త సాంగ్ విన్నారా?
ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర ఇండస్ట్రీలో తనకంటూ ఓ గుర్తింపు సంపాదించుకున్నారు. సింగర్ గా ఎన్నో హిట్స్ సాంగ్స్ పాడారు. బిగ్ బాస్ సీజన్ 5లో కంటెస్టెంట్ గా పాల్గొన్నారు. టాప్ 5 వరకు చేరుకొని తన ఫ్యాన్ ఫాలోయింగ్ మరింత పెంచుకున్నారు. ప్రస్తుతం శ్రీరామ్ 'ఆహా'లో టెలికాస్ట్ అవుతోన్న ఇండియన్ ఐడల్ తెలుగుకి యాంకర్ గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ షో చివరి దశకు చేరుకుంది.
ఇదిలా ఉండగా.. ఓ పక్క సినిమాల్లో పాటలు పాడుతూనే మరోపక్క ప్రైవేట్ ఆల్బమ్స్ చేస్తుంటారు శ్రీరామచంద్ర. తాజాగా ఆయన 'నీకోసం' అంటూ సాగే ఓ ఆల్బమ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఒక కాన్సెప్ట్ తో ఈ పాటను రూపొందించారు. ఈ పాటను పాడడంతో పాటు మ్యూజిక్ డైరెక్టర్ గా కూడా పని చేశారు శ్రీరామచంద్ర. ఆయన పాటు అనిల్ రోహిత్ కూడా వర్క్ చేశారు.
అల రాజు, కదిరి నాగమణి ఈ పాటకు లిరిక్స్ అందించారు. స్వైప్ అప్ ప్రొడక్షన్స్ సంస్థ మ్యూజిక్ వీడియోను రూపొందించింది. యూట్యూబ్ లో విడుదలైన ఈ మెలోడీ సాంగ్ కి నెటిజన్ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుంది. మరి మున్ముందు ఎన్ని వ్యూస్ ను రాబడుతుందో చూడాలి!
View this post on Instagram
మరిన్ని చూడండి
Advertisement
టాప్ హెడ్ లైన్స్
అమరావతి
జాబ్స్
రాజమండ్రి
అమరావతి
Advertisement
Advertisement
ట్రెండింగ్ వార్తలు
Advertisement


Nagesh GVDigital Editor
Opinion