అన్వేషించండి

Bigg Boss 6 Telugu Episode18: కెప్టెన్సీ కంటెండర్లుగా ఆ నలుగురు? ఇనయాను లాగిపడేసిన దొంగలు, నేహాను కొట్టిన ఇనయ

Bigg Boss 6 Telugu: కెప్టెన్సీ కంటెండర్ల టాస్క్ చివరికి ఫిజికల్ గా మారింది, మొత్తానికి పూర్తయింది.

Bigg Boss 6 Telugu: కెప్టెన్సీ పోటీదారులను ఎంపిక చేసే పోటీ ‘అడవిలో ఆట’ జోరుగా సాగింది ఇంట్లో. పోలీసులు, దొంగలు, గీతూ అందరూ తమ తమ ఆటను ఆడారు. కానీ దొంగలు ఐక్యంగా ఆడకపోవడం వల్ల చివరికి వారే ఓడిపోయే అవకాశం కనిపిస్తోంది. పోలీసుల టీమ్ గెలిచినట్టు సమాచారం. అయితే చివరికి దొంగల టీమ్ నుంచి ఇద్దరు, పోలీసుల టీమ్ నుంచి ఒకరు, గీతూ... కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచినట్టు తెలుస్తోంది. ఇక ఎపిసోడ్ లో ఏమైందంటే..

రేవంత్ బొమ్మలు కొట్టేసి...
ఆరోహి, నేహా కలిసి రేవంత్ దాచుకున్న బొమ్మలను కొట్టేశారు. రేవంత్, ఆరోహి, నేహా దొంగల టీమే. అయితే వారు ఐక్యంగా ఆడలేదు. తన బొమ్మలు పోయాయని తెలిసి రేవంత్ నోటికి పనిచెప్పాడు. తన బొమ్మలు దాచిన వారికి సిగ్గు సెన్స్ ఉండాలి అంటూ అరిచాడు. ఇక గీతూ  మీ వాళ్లే తీశారు అని చెప్పింది గీతూ. ఎవరు తీశారో మాత్రం చెప్పలేదు. నేను పోలీసుల టీమ్ గెలిచేలా ఆడతా అంటూ అరిచాడు. ‘నీతి కబుర్లు, నీతి సూక్తులు చెప్పకూడదు’ అంటూ కోప్పడ్డాడు. అతని బొమ్మలను నేహా తీసి సుదీపకు ఇచ్చింది. సుదీప వాటిని దాచింది. 

నేహాను కొట్టి, ఆరోహిని తన్ని...
ఇనయ కాసేపు ఇంట్లో హడావుడి చేసింది. పోలీసుల అయిన ఆమె స్టోర్ రూమ్ లో రైడ్ కు వెళ్లింది. దొంగలు దాచిన బొమ్మలు కోసం వెతికింది. రైడ్ టైం ముగిసిన ఆమె అక్కడే ఉండడంతో దొంగలు ఈడ్చిపడేశారు. తోపులాట కాసేపు సాగింది. ఆ తోపులాటలో ఆమె తప్పించుకునే ప్రయత్నం చేసింది. ఆరోహిని కాలితో తన్నేసింది. నేహా చెంప మీద కొట్టేసింది. దీంతో నేహా చాలా బాధపడింది పెద్ద గొడవ చేసింది. ఇనయ తన డ్రెస్ ఎవరో లాగారంటూ అరిచింది. ఈ మధ్యలో గీతూ వచ్చి క్లాసులు తీసుకుంది. దొరికిందే ఛాన్సు అని ఇనయకు వ్యతిరేకంగా మాట్లాడింది. తప్పు మాటలు మాట్లాడుతున్నావ్, మాటలు మారుస్తున్నావు అంటూ వాదించింది. ఈ గొడవ కాసేపు గట్టిగానే సాగింది. గీతూ నుంచి బొమ్మలు కొట్టేయాలని దొంగల టీమ్ అనుకున్నా కూడా పెద్దగా ప్రయత్నించలేదు. గీతూ జోలికి ఎవరూ వెళ్లకపోవడం వల్ల ఆమె సులువైంది. బొమ్మలు కాపాడేందుకు సూర్యతో డీల్ కుదుర్చుకుని డబ్బులు ఇచ్చింది గీతూ. అలాగే శ్రీహాన్ తో కూడా డీల్ కుదుర్చుకుని డబ్బులు ఇచ్చింది.

బుధవారం నాడు ఆట ముగిసింది. ఎపిసోడ్ పూర్తయ్యేసమయానికి శ్రీహాన్ వద్ద 14000 దాకా డబ్బులు ఉన్నాయి. ఇక గీతూ దగ్గర 25 బొమ్మలతో పాటూ, 15800 డబ్బులు ఉన్నాయి. సూర్య దగ్గర 10100 క్యాష్ ఉంది. ఇక పోలీసుల టీమ్ లో శ్రీ సత్య దగ్గర గోల్డెన్ కలర్ కొబ్బరి బోండాం ఉండడం వల్ల ఆమె కూడా కెప్టెన్సీ కంటెండెర్ అయ్యే ఛాన్సు ఉంది. ఇక క్యాష్ అధికంగా ఉన్న శ్రీహాన్, సూర్య, గీతూ కూడా కెప్టెన్సీ కంటెండెర్లు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంది. రేపటి ఎపిసోడ్ లో ఎవరెవరు అయ్యారో బిగ్ బాస్ ప్రకటిస్తారు. 

Also read: నువ్వరిస్తే అరుపులే నేనరిస్తే మెరుపులే - ఓవర్ అవుతున్న గీతూ, ఫిజికల్ అయిపోయిన టాస్క్

Also read: దొంగల టీమ్‌లో ఉండి పోలీసుల టీమ్‌ను గెలిపిస్తానన్నా రేవంత్, కారణం ఏంటో తెలుసా?

టాప్ హెడ్ లైన్స్

Maremma OTT : మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
మూడు ఓటీటీల్లో రవితేజ సోదరుని కుమారుని మూవీ - పాన్ ఇండియా భాషల్లో మారెమ్మ
Ravi Teja Thulabharam : ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
ఇరుముడి తర్వాత రవితేజ 'తులాభారం' - ఈ జానర్ ఎవరూ ఊహించలేరు... మోత మోగిపోద్దంతే!
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
This Week Theatrical Releases : ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?
ఈ దసరాకు మస్త్ ఎంటర్టైన్మెంట్ - ఒకే రోజు థియేటర్లలో మూడు సినిమాలు... మరి మీ ఛాయిస్ ఏంటి?

వీడియోలు

West Bengal Bypoll Results BJP Landslide Victory | బెంగాల్ పోరులో బీజేపీ క్లీన్ స్వీప్ - ముస్లిం ఓటు బ్యాంక్‌లో కమలం సంచలనం
Elephant Drona Recovers Broken Leg Fibreglass Casting Treatment | కాలిగాయానికి ఫైబర్‌గ్లాస్ కట్టు.. కోలుకున్న ద్రోణ ఏనుగు
India players Catch Drops vs WI 2nd T20 | క్యాచ్ డ్రాప్ వల్ల గెలిచే మ్యాచ్ పోయిందా ?
India vs West Indies 2nd T20 | వెస్టిండీస్‌తో రెండో టీ20లో ఘోర ఓటమి
Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

ఫోటో గ్యాలరీ

వ్యక్తిగత కార్నర్

అగ్ర కథనాలు
టాప్ రీల్స్
Supreme Court On CJP Protest: శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
శాంతియుత నిరసనకారులను టచ్ చేయొద్దు.. ఆంక్షలపై కేంద్రం, ఢిల్లీ పోలీసులకు సుప్రీంకోర్టు ఆదేశాలు
Elon Musk Targets Mukesh Ambani: అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు.. ఇష్యూపై కేంద్రం క్లారిటీ
అంబానీని మరోసారి టార్గెట్ చేసి ఎలాన్ మస్క్.. స్టార్‌లింక్ ఖరీదైనదైతే భయమెందుకని ప్రశ్నలు
Gold Smuggling: హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
హైదరాబాద్‌కు తరలిస్తుండగా విశాఖలో రూ.9 కోట్ల బంగారం సీజ్, ఇద్దరి అరెస్ట్
RT78 Movie : వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
వివేక్ ఆత్రేయతో రవితేజ కొత్త మూవీ తులాభారం - క్లాప్ కొట్టిన శ్రీవిష్ణు
Durga Idol Immersion: దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
దుర్గామాత విగ్రహ ప్రతిష్ఠాపనపై వివాదం... పూజలకు ముందే అమ్మవారి విగ్రహం నిమజ్జనం
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
ఎలక్ట్రిక్ కార్ రూపంలో వస్తున్న Volkswagen ID Tiguan.. 600 కి.మీ రేంజ్ ఇచ్చే SUV ఫీచర్లు
Hyderabad Crime News: పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
పెళ్లి పేరుతో నమ్మించి పలుమార్లు లైంగిక దాడి.. ఖైరతాబాద్ డీఐ బాలస్వామి అరెస్ట్
Action Thriller OTT : ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
ఓటీటీలోకి దుల్కర్ సల్మాన్ కొత్త మూవీ - స్టైలిష్ యాక్షన్ థ్రిల్లర్ ఎప్పుడు, ఎందులో స్ట్రీమింగ్ అంటే?
Embed widget