Bigg Boss 6 Telugu Episode 11: రాత్రిపూట దొంగాటలు ఆడిన గీతూ, ఈ వారం కెప్టెన్సీకి పోటీపడేది ఆ నలుగురు
Bigg Boss 6 Telugu: పగలే కాదు ఈరోజు రాత్రి కూడా ఆటలు ఆడారు బిగ్ బాస్ ఇంటి సభ్యులు.
Bigg Boss 6 Telugu: సిసింద్రీ టాస్క్ ఇంటి సభ్యులను కంటినిండా నిద్రపోనివ్వలేదు. నిద్రపోతున్న వారి నుంచి బొమ్మలను పడేసేందుకు ఇంటి సభ్యులు కొంతమంది ప్రయత్నించారు. గీతూ అయితే అదే పనిలో ఉంది. చేతులు లాగేస్తున్నాయి దొంగతనం చేయాలని అంటూ పిలిల్లి ఇంట్లో తిరుగుతూనే ఉంది. వాసంతి బొమ్మ పట్టుకుని పరిగెడుతుంటే కొంతమంది ఆమెను బయటికి వెళ్లకుండా అడ్డుకున్నారు. దీంతో వాసంతికి తిరిగి ఇచ్చేసింది బొమ్మ. ఇక శ్రీహాన్ నిద్రలో ఉండగా అతడి బొమ్మని తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పడేసింది. శ్రీహాన్ కూడా తెల్లవారుజామున నిద్రలేసి ఎవరి బొమలు దొరుకుతాయా అని చూశాడు. చివరికి అర్జున్ బొమ్మ దొరకడంతో లాస్ట్ అండ్ ఫౌండ్ స్థానంలో పెట్టాడు.
గీతూ బొమ్మ కూడా...
స్టోర్ రూమ్ లో గీతూ తన బొమ్మను దాచి బాత్రూమ్ కు వెళ్లింది. అయితే బొమ్మపైన తన పేరున్న డ్రెస్సును తొలగించింది. రేవంత్ కు ఆ బొమ్మ దొరికింది. వెంటనే దాన్ని తీసుకుని లాస్ట్ అండ్ ఫౌండ్ లో పడేశాడు. అయితే గీతూ మాత్రం తన పేరు బొమ్మపై లేదని, అది ఎవరిదైనా కావచ్చు, ఓసారి ఆలోచించు అని కెప్టెన్ బాలాదిత్యకు చెప్పింది. తరువాత బాలాదిత్య బొమ్మ డ్రెస్సు విప్పేసి, గీతూ పేరున్న డ్రెస్సు వేసింది. చివరకు బాలాదిత్య ఆ బొమ్మను తీసుకుని తన డ్రెస్సును మళ్లీ వేసుకున్నాడు. శ్రీహాన్ లాస్ట్ అండ్ ఫౌండ్ లో డ్రెస్సు లేకుండా ఉన్న గీతూ బొమ్మకు, ఆమె పేరున్న డ్రెస్సు వేశాడు. వేసి ‘అయ్యో గీతూ బొమ్మ కూడా వచ్చేసిందే’ అంటూ కామెడీ చేశాడు. గీతూ విషయంలో టిట్ ఫర్ టాట్ చేశారు శ్రీహాన్, రేవంత్.
ఫైమాకు ఇచ్చేశాడు...
ముందు టాస్క్ లో రేవంత్ ను కావాలని ఓడించింది ఫైమా. గీతూ కూడా అలాగే చేసింది. గీతూకు పగతీర్చేసుకున్నాడు రేవంత్. ఆయనే ఆమె బొమ్మను తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ ప్లేసులో పడేశాడు. ఇప్పుడు ఫైమా వంతు వచ్చింది. రింగు లోపల కింగు టాస్కులో ఫైమా, ఆరోహి, కీర్తి, ఇనయా ఆడారు. ఇందులో ఫైమా తప్పుగా ఆడడంతో ఆమెను డిస్ క్వాలిఫై చేశాడు సంచాలక్ గా ఉన్న రేవంత్. అదే సమయంలో అభినయశ్రీ ఆమె బొమ్మను తీసి లాస్ట్ అండ్ ఫౌండ్ లో పడేసింది. ఇంకేముంది ఫైమాకు రివేంజ్ స్టోరీ చూపించేశారు. ఫైమా ఏడ్చుకుంటూ కూర్చుంది. రింగు లోపల కింగులో ఇనయా గెలిచింది.
ఇది రాజ్ టైమ్
రెండో ఆటలో కోన్స్ అండ్ స్కూప్స్ అరేంజ్ చేసే టాస్కు ఇచ్చారు. ఇందులో ఇరయా సంచాలక్ గా వ్యవహరించింది.ఇందులో రాజ శేఖర్ విన్నర్ అయ్యారు. అయితే ఈ టాస్కులో సంచాలక్‌గా వ్యవహరించిన ఇనయాను కొంతమంది తప్పుబట్టారు. ఇక రెండో ఆటలో ఆర్జే సూర్య గెలిచాడు. దీంతో చివరికి కెప్టెన్సీ పోటీదారులుగా చంటి, ఇనయ, సూర్య, రాజ్ లు కెప్టెన్సీ పోటీదారులుగా మారారు. ఈ నలుగురిలో వచ్చే వారానికి కెప్టెణ్ అయ్యేది ఎవరో మరి.
Also read: అయ్యో గీతూ బొమ్మ కూడా వచ్చేసిందే, పగ తీర్చుకున్న రేవంత్, ప్రోమో అదిరింది
Also read: చేయి లాగేస్తోంది దొంగతనం చేయాలని, అర్థరాత్రి గలాటా చేసిన గీతూ