Bigg Boss 5 Telugu: కన్నీళ్లతో శపథం చేసిన యానీ మాస్టర్, నెట్టుకుని కొట్టుకున్న సన్నీ-శ్రీరామ్, ఫైనల్ గా ఈ వారం కెప్టెన్ ఎవరంటే..
బిగ్ బాస్ హౌస్ హౌస్ లో ఏడోవారం కెప్టెన్సీ టాస్క్ పోటాపోటీగా కొనసాగింది. గ్రూపులుగా విడిపోయి కొట్టుకునే స్థాయివరకూ వెళ్లారు. ఈ వారం కెప్టెన్ ఎవరంటే...
52వరోజు హౌజ్ లో మానస్-ప్రియాంక్ సింగ్.. రవి గురించి డిస్కషన్ పెట్టుకున్నారు. కేవలం ఆడేందుకు మాత్రమే వచ్చిన రవితో ఎవ్వరూ స్నేహం చేసేందుకు సిద్ధంగా లేరన్నాడు మానస్. మరోవైపు బ్రహ్మ లేకపోతే సృష్టేలేదంటూ రవి..అర్థరాత్రి షణ్ముక్ ని ఆటపట్టించాడు.
53వ రోజు ''సూపర్'' మూవీలో సాంగ్ తో మొదలైంది. ఎగ్స్ గురించి సిరి-షణ్ముక్ తో కాజల్ డిస్కషన్ పెట్టింది. ఆ తర్వాత కాజల్ ఎగ్స్ ఇచ్చేందుకు సిద్ధపడినా సిరి వద్దని చెప్పేసింది. సడెన్ గా సిరి ముద్దుపెట్టి వెళ్లిపోవడంతో షణ్ముక్ కాసేపు షాక్ లో ఉండిపోయాడు. మళ్లీ యధావిధిగా షణ్ముక్-సిరి మధ్య చర్చ జరిగింది. సగం రోజులే అయ్యాయి ఇంకా సగం రోజులు హౌజ్ లో ఉండాలి ఆలోచించుకో అనడంతో సిరి ఫీలైంది.
Also Read: సమంత తన పెళ్లి ఫొటోలను డిలీట్ చేసిందా? ఆ వార్తల్లో నిజమెంతా?
ఈ వారం కెప్టెన్సీ టాస్క్ వెంటాడు-వేటాడు
థర్మాకోల్ బాల్స్ ఉన్న బస్తాలు ధరించి సర్కిల్లో తిరుగుతూ ఎవరి బస్తారు వాళ్లు కాపాడుకోవాలి. చివరికి ఏ పోటీదారుల బస్తాలో ఎక్కువ థర్మాకోల్ బాల్స్ ఉన్నాయో వాళ్లు కెప్టెన్ అవుతారు. శ్రీరామ్, షణ్ముక్, సన్నీ, సిరి, యానీ, మానస్ పోటీపడ్డారు. లైన్ క్రాస్ చేయడంతో ఫస్ట్ షణ్ముక్ ఔట్ అయిపోయాడు, శ్రీరామ్ ను సన్నీ బయటకు నెట్టేశాడు..వాళ్లిద్దరూ ఔట్ అనుకున్నారంతా. ఇంతలో జెస్సీని కన్ఫెషన్ రూమ్ కి పిలిచిన బిగ్ బాస్ గేమ్ రూల్స్ మరోసారి వివరించడంతో మళ్లీ గేమ్ రీ స్టార్ట్ చేశారు. ఆరుగురూ బరిలో దిగడంతో సన్నీ-శ్రీరామ్ దారుణంగా తోసుకున్నారు, కొట్టుకున్నారు. సన్నీ గేమ్ నుంచి బయటకు వెళ్లిపోయిన తర్వాత కూడా శ్రీరామ్ పెద్ద గొడవ పెట్టుకున్నాడు. సన్నీ ఇండిపెండెంట్ ప్లేయర్ అనుకున్నా, ఓడిపోయావ్ ఓడిపోయావ్ అంటూ రెచ్చగొట్టాడు. అదే టైమ్ లో మధ్యలో జెస్సీని ఇన్వాల్స్ చేసి మరింత గొడవ పెద్దది చేశాడు శ్రీరామ్.
Also Read: హాస్పిటల్‌లో రజినీకాంత్.. ఆందోళనలో అభిమానులు
సెకెండ్ రౌండ్ లో శ్రీరామ్ ఏకంగా మానస్ ని టార్గెట్ చేశాడు. శ్రీరామ్, మానస్ ఔట్ అని సంచాలక్ జెస్సీ చెప్పడంతో సన్నీ వాగ్వాదానికి దిగాడు. తన డెసిషన్ ఫైనల్ అని తేల్చిచెప్పాశాడు. థర్డ్ రౌండ్ లో జెస్సీ, షణ్ముక్, సిరి బరిలో దిగారు. ఇక్కడ యానీ మాస్టర్ విశ్వరూపం చూపించింది. సిరి, షన్ను కలిసి ఆడుతున్నారనే కోపంతో ఆనీ మాస్టర్ రచ్చ చేసింది. మీరంతా గ్రూపులుగా ఆడుతున్నారని, సింగిల్‌గా ఆడేవారు ఎలా గెలుస్తారంటూ తన థర్మాకోల్ సంచిని కిందపడేసింది. ఈ ఇంట్లో ఉన్నంతవరకూ కెప్టెన్ అవ్వనంటూ శపథం చేసింది. పక్కన వచ్చి నిల్చున్న సన్నీపై శివంగిలా లేచింది. నీకో గుంపుంది వెళ్లు అంటూ గొడవ పెట్టుకుంది. ఈ అవకాశాన్ని వాడుకున్న శ్రీరామ్, రవి... యానీని మరింత రెచ్చగొట్టాడు. ఈ గొడవ చాలాసేపు జరిగింది. నాలుగో రౌండ్ లో సిరి-షణ్ముక్ పోటీ పడగా షణ్ముక్ విజేతగా నిలిచాడు. ఏడోవారం ఇంటి కెప్టెన్ అయిన షణ్ముక్ ని బిగ్ బాస్ అభినందించారు. అసలు గేమ్ ఇప్పుడే మొదలైందన్నాడు సన్నీ. మరి షణ్ముక్ కెప్టెన్సీలో హౌజ్ మేట్స్ ఎలా ఉంటారో చూడాలి.
Also Read: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు బెయిల్ మంజూరు
Also Read: త్రివిక్రమ్ ఓ సీన్ రాశారు! అదెలా ఉంటుందో?
Also Read: జగన్‌ను చూసేందుకు వచ్చా ! భేటీ వ్యక్తిగతమేనన్న నాగార్జున !
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి