X

Bigg Boss 5 Telugu: ప్రియాంక సింగ్ ప్రేమకథకు ఫిదా అయిపోయిన నెటిజన్లు

ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుందంటారు. అయితే బిగ్ బాస్ హౌస్ కంటిస్టెంట్ ప్రియాంక సింగ్ మాత్రం ప్రేమించిన ప్రేమను పొందలేకపోయింది. ఎక్కడ చూసినా పింకీ ప్రేమకథపై చర్చే..

FOLLOW US: 

ప్రేమ..రెండక్షరాల పదం.. వగైరా.. వగైరా..ఇలా వర్ణించేందుకు అద్భుతంగా ఉంటుంది. కానీ ఈ రోజుల్లో కూడా నిజంగా ప్రేమ అనేది ఉందంటారా..ఒకవేళ ఉన్నా అవసరం దాన్ని కప్పేయకుండా మిగలనిచ్చిందా అంటే అవునని మనసుకి అనిపించినా బయటకు మాత్రం ప్రేమ అనే అందమైన ముసుగువేసేవారి సంఖ్య తక్కువేం లేదు. ఇప్పటి వరకూ  అబ్బాయి ప్రేమకథ విన్నారు.. అమ్మాయి ప్రేమ కథ విన్నారు..కానీ  అబ్బాయి నుంచి అమ్మాయిగా మారిన ఈ పింకీ ప్రేమ కథ విన్నాక మాత్రం 'ప్రేమంటే ఇదేరా ' అనిపించకమానదంటున్నారు నెటిజన్లు. 


గురువారం రోజు బిగ్ బాస్ హౌస్‌లో ఉన్న ఇంటి సభ్యులకు వారి వారి తొలి ప్రేమ జ్ఞాపకాలను పంచుకోవాలంటూ టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. అందరూ ఎవరికి వారు వారి లవ్ స్టోరీ చెప్పుకున్నారు. కొందరు సక్సెస్ అయ్యారు, మరికొందరు ఫెయిలయ్యారు, ఇంకొందరు స్టిల్ వెయిటింగ్ అన్నారు...కానీ అందరకన్నా భిన్నంగా ఉంది ప్రియాంక సింగ్ లవ్ స్టోరీ. తన తొలిప్రేమ గురించి చెప్పిన పింకీ ఇంటి సభ్యులనే కాదు ప్రేక్షకులను కూడా మెప్పించింది. 


Also Read: నిశ్చితార్థం ముందు రోజే లేచిపోయిన సిరి.. డయల్ 100కి ఫోన్ చేసి ప్రియుడితో వెళ్లిపోయిన కాజల్‌.. ఒక్కొక్కరిది భలే లవ్‌స్టోరీ


ప్రియాంక మాటల్లో తన లవ్ స్టోరీ ‘అతని పేరు రవి.. అలా పిలవడం నాకు ఇష్టం లేక నేను ముద్దుగా అబ్బాయి అంటూ ఉండేదాన్ని. ఓ ఫంక్షన్‌లో అతన్ని చూశా.. చూడ్డానికి చాలా బాగుంటాడు. చూడగానే నచ్చేశాడు.. పరిచయం అయిన తరువాత ఒకర్నొకరు అర్థం చేసుకున్నాం.  నాకు ధైర్యం చెప్పి నువ్ అలా ఉండాలి, అందరితో కలవాలి అని చెప్పేవాడు. ఇద్దరం బాగా క్లోజ్ అయ్యాం. దాదాపు ఆరేళ్లు రిలేషన్‌లో ఉన్నాం. ఎక్కడికి వెళ్లినా ఇద్దరం కలిసేవెళ్లాం. తనంటే నాకు చాలా ఇష్టం కానీ  ఆ మాట తనకి నేను ఎప్పుడూ చెప్పలేదు. చెప్పేందుకు  ధైర్యం సరిపోలేదు. మా సిస్టర్‌కి పెళ్లి అయ్యింది. నా ఇబ్బందులు కూడా క్లియర్ అయ్యాయి. అమ్మనాన్నల్ని నేను చూసుకోగలననే నమ్మకంతో నేను నా జెండర్‌ని ఛేంజ్ చేసుకున్నా. అమ్మాయిగా మారిన తరువాత కొన్నాళ్ల పాటు అతనికి కనిపించలేదు. ఆ తరువాత కలిసి నువ్ అంటే నాకు ఇష్టం అని చెప్పేశా. దానికి  ఓకే అని చెప్పి నువ్ బాగుంటావు నాకేం ప్రాబ్లమ్ లేదు రిలేషన్‌లో ఉందాం అని అన్నాడు. ఇంతకు మించి ఇంకేంకావాలి నాకో తోడు దొరికిందని  సంబరపడ్డా. నువ్వు తప్ప మరో ప్రపంచం లేదు  పెళ్లి చేసుకుందాం అని అడిగే సరికి సరే అన్నాడు. నాకూ ఓ ఫ్యామిలీ దొరికిందని ఆనందపడ్డాను. కానీ ఆ ఆనందం ఎంతో కాలం నిలవలేదు.


Also Read: సమంతని ఫాలో అవుతున్న చైతు.. ఈ టైమ్‌లో ఆ నిర్ణయం ఎందుకు తీసుకున్నాడో!
 
ఆ అబ్బాయి నా దగ్గరకు వచ్చి.. ఇంట్లో సంబంధాలు చూస్తున్నారు పెళ్లి చేసుకుంటా అన్నాడు. అప్పుడు కూడా నేను నో చెప్పలేదు. అబ్బాయ్ నీకు పెళ్లి అయితే అందరికంటే నేనే హ్యాపీగా ఫీల్ అవుతా కానీ నన్ను కూడా పెళ్లి చేసుకుంటా అన్నావ్ కదా అంటే అప్పుడు తన విశ్వరూపం చూపించాడు.  నువ్ ఏమైనా అమ్మాయివా? నీకు పిల్లలు పుడతారా? ఏం మాట్లాడుతున్నావ్? పెళ్లి ఏంటి పెళ్లి అని చిరాకు పడ్డాడు. ఎందుకంటే నేను తల్లిని కాలేను. నీకు తెలుసో తెలియదో అబ్బాయ్  నేను చాలా ఆసుపత్రులు తిరిగాను. తల్లిని కావడం కోసం లక్షలు ఖర్చు పెట్టాను. సడెన్ గా వదిలేస్తా ఎలా అని కాళ్లపై పడ్డాను. బండిపై వెళ్లిపోతుంటే వెనుక పరిగెత్తినా పట్టించుకోలేదు. ఆ తర్వాత ఓ రోజు ఇంటికి రమ్మని మెసేజ్ పెట్టాను...వెంటనే వచ్చాడు. పది రోజులుగా నిద్రలేదు.. అనుక్షణం నువ్వే గుర్తొస్తున్నావ్ అని చెప్పాను. అప్పుడు తను  నీకు చెప్పాను కదా  నాకు పెళ్లి అని మళ్లీ నువ్ ఇలా మాట్లాడుతున్నావ్ అసలు నువ్ ఎవరో తెలుసా? అని నన్ను గుచ్చి గుచ్చి చిన్నప్పటి నుంచి నన్ను ఏమాట అని నన్ను ఏడిపించేవారో అదే మాటని పదే పదే అన్నాడు. తనలా ఎవరూ నన్ను ఆ మాటతో బాధపెట్టలేదు. 


Also Read: అర్థపావు భాగ్యం పెద్ద మనసు..బిగ్ బాస్ ద్వారా వచ్చిన రెమ్యునరేషన్ ఏం చెసిందో తెలుసా...!


కన్నీళ్లతో తన కథ చెప్పిన ప్రియాంక ఆఖర్లో చెప్పిన మాటలకు ఫిదా అయిపోయాంతా. ఏమందంటే...' నువ్ నన్ను ఇష్టపడినా పడకపోయినా నేను నిన్ను ఇష్టపడ్డా కాబట్టి నువ్వు ఎక్కడ ఉన్నా.. హ్యాపీగా ఉండాలి. కానీ నువ్ ఒకటి గుర్తుపెట్టుకో.. నీకు ఎప్పుడు ఏ కష్టం వచ్చినా ముందు ఈ పింకీ ఉంటుంది..ఐ లవ్యూ.. ఐ మిస్ యూ. నీకు నా తరపున రిక్వెస్ట్ ఏంటంటే.. నువ్వు మళ్లీ నా లైఫ్‌లోకి రావద్దు, ఎక్కడ ఉన్నావో అక్కడే ఉండు’ అని కన్నీళ్లతో తన పేరు రాసిన బెలూన్ గాల్లోకి వదిలిపెట్టింది. ఈ వర్డ్స్ కే నెటిజన్లు మనసు కరిగించాయి. పింకీ యూ ఆర్ ద గ్రేట్ అంటూ మెసేజెస్ పెడుతున్నారు. నీ ప్రేమలో నిజాయితీ ఉంది నువ్వుసంతోషంగా ఉండాలని కోరుతున్నారు. 


Also Read:అజీత్ ‘వాలిమై’ గ్లింప్సెస్.. ‘గెట్ రెడీ ఫర్ ది గేమ్’ అంటూ కార్తికేయ ఛాలెంజ్


Also Read: ‘మీరు చేస్తే నీతి.. నేను చేస్తే బూతా..’ మోస్ట్ ఇంటెన్స్ ట్రైలర్ వచ్చేసింది!


ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Tags: Bigg Boss 5 Telugu contestant Priyanka Singh Reveals How Her Ex Boy Friend Rejected Abused her

సంబంధిత కథనాలు

BiggBoss5: స్పెషల్ పవర్ కోసం హుషారుగా ఆటలాడిన హౌస్ మేట్స్... ఎవరికి దక్కేనో?

BiggBoss5: స్పెషల్ పవర్ కోసం హుషారుగా ఆటలాడిన హౌస్ మేట్స్... ఎవరికి దక్కేనో?

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

Rajinikanth: సూప‌ర్‌స్టార్ కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు.. ఆ విషయంలో బాధగా ఉందంటున్న నటుడు..

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

#RadheShyam Teaser: 'రాధే శ్యామ్' టీజర్ రికార్డుల మోత... అదొక్కటి కూడా వస్తేనా!?

This Week Theatrical Releases: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!

This Week Theatrical Releases: రొమాంటిక్ vs వరుడు కావలెను... అండ్ మోర్!

Chiranjeevi: తన వీరాభిమానికి కొండంత అండగా మెగాస్టార్... సొంతఖర్చుతో చికిత్స

Chiranjeevi: తన వీరాభిమానికి కొండంత అండగా మెగాస్టార్... సొంతఖర్చుతో చికిత్స
SHOPPING
Diwali Gift
Kitchen
Make Up
Top Mobiles
Immunity Booster

టాప్ స్టోరీస్

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

Ind Vs Pak: పంతం నీదా.. నాదా.. సై.. ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ నేడే

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

YS Sharmila: షర్మిల పాదయాత్రలో ఇంట్రెస్టింగ్ సీన్.. వైవీ సుబ్బారెడ్డి ఎంట్రీ

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Loan Options: మీకు అర్జెంట్‌గా డబ్బు కావాలా? ఇలా చేస్తే బెటర్‌!

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన

Harish Rao: బీజేపీని బొంద పెడితే అన్ని తగ్గుతాయ్, ఇక్కడ టీఆర్ఎస్ గెలిస్తే.. మంత్రి హరీశ్ రావు కీలక ప్రకటన